గుంటూరులో సావిత్రి విగ్రహావిష్కరణ

Published : Mar 29, 2017, 11:26 AM ISTUpdated : Mar 26, 2018, 12:01 AM IST
గుంటూరులో సావిత్రి విగ్రహావిష్కరణ

సారాంశం

7 అడుగుల సావిత్రి కాంస్య విగ్రహాన్ని స్పీకర్ కోడెల శివప్రసాద్ ఆవిష్కరించారు

 

 

 

మహానటి సావిత్రి గారి కాంస్య విగ్రహాన్ని ఆమె కుమార్తె చాముండేశ్వరి గారి సౌజన్యంతో నిన్న గుంటూరులో ఆవిష్కరించడం జరిగింది.

 

ఈ కార్యక్రమంలో ప్రముఖ సినీ నటి సుహాసిని,వేద సీడ్స్ మేనేజింగ్ డైరెక్టర్ డా. పి.చంద్రశేఖర్ తో పాటు పలువురు రాజకీయ ప్రముఖులు మరియు భారీ సంఖ్యలో అభిమానులు పాల్గొనడం జరిగింది.

 

గుంటూరులోని నాజ్‌ సెంటర్‌ ఐలాండ్‌లో కళాదర్బార్‌ అమరావతి సాంస్కృతిక సంస్థ వారు ఏర్పాటు చేసిన 7 అడుగుల సావిత్రి కాంస్య విగ్రహాన్ని స్పీకర్ కోడెల శివప్రసాద్ ఆవిష్కరించారు.

ఆ మహానటి నటించిన 85 తెలుగు సినిమాల్లో తాను  80 సినిమాల దాకా చూశానని అంటూ  కన్యాశుల్కం, మాయాబజార్‌ చిత్రాలు సావిత్రి నటనతో  ఎప్పటికీ గుర్తుండి పోయేలా తెరకెక్కాయని అన్నారు.

సావిత్రి నిండైన తెలుగుదనం అని వర్ణిస్తూ  వ్యక్తిగతంగాను ఆమె ఔదార్యం అందరికీ ఆదర్శం కావాలని స్పీకర్ అన్నారు.

 

 సావిత్రి తన సంపాదనలో చాలావరకు దాన ధర్మాలకే వెచ్చించారని తెలిపారు. అటువంటి గొప్ప వ్యక్తికి కాంస్య విగ్రహం ఏర్పాటు చేయటం చంద్రునికి ఓ నూలు పోగువంటిదన్నారు.

PREV
click me!

Recommended Stories

5000 తో ఫిల్మ్ ఇండస్ట్రీకి వచ్చింది, ప్రస్తుతం 5 నిమిషాలకు 3 కోట్లు వసూలు చేస్తున్న హీరోయిన్ ఎవరో తెలుసా?
Actor Sivaji: మహిళా కమిషన్‌ దెబ్బకి దిగొచ్చిన శివాజీ.. స్త్రీ అంటే మహాశక్తితో సమానం అంటూ క్షమాపణలు