ఆది పినిశెట్టి హీరోగా ఎ.య‌స్‌.ర‌వికుమార్ చౌద‌రి ద‌ర్శ‌క‌త్వంలో చిత్రం

Published : Mar 28, 2017, 03:24 PM ISTUpdated : Mar 24, 2018, 12:05 PM IST
ఆది పినిశెట్టి హీరోగా ఎ.య‌స్‌.ర‌వికుమార్ చౌద‌రి ద‌ర్శ‌క‌త్వంలో చిత్రం

సారాంశం

విభిన్న పాత్రలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన  హీరో  ఆది పినిశెట్టి యజ్ఞం, పిల్లా నువ్వు లేని జీవితం లాంటి సినిమాల దర్శకుడు రవి కుమార్ చౌదరి ఇద్దరి కాంబినేషన్ లో డిఫరెంట్ లవ్ యాక్షన్ ఎంటర్ టైనర్ చిత్రం

'ఒక విచిత్రం '  సినిమాతో తెలుగు సినిమాల్లోకి తెరంగేట్రం చేసి గుండెల్లో గోదారి, స‌రైనోడు, మ‌లుపు స‌హా ప‌లు చిత్రాల్లో విభిన్న‌మైన పాత్ర‌ల‌తో మెప్పించిన యువ క‌థానాయ‌కుడు ఆది పినిశెట్టి హీరోగా రుగ్వేద క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై య‌జ్ఞం, పిల్లానువ్వులేని జీవితం వంటి సూప‌ర్‌హిట్ చిత్రాల ద‌ర్శ‌కుడు ఎ.య‌స్‌.ర‌వికుమార్ చౌద‌రి ద‌ర్శ‌క‌త్వంలో ఓ కొత్త చిత్రం ప్రారంభం కానుంది. ''డిఫ‌రెంట్ క‌థ‌ ఇది .  ఆది పినిశెట్టి స‌రికొత్త లుక్‌లో క‌న‌ప‌డ‌తాడు. ల‌వ్‌, కామెడి, యాక్ష‌న్‌, ఎమోష‌న్స్ ఇలా అన్నీ ఎలిమెంట్స్‌ ఉన్న సినిమా. ఆది కెరీర్‌లో మ‌రో బెస్ట్ మూవీగా నిలుస్తుంది.  సినిమా మేకింగ్‌లో ఎక్క‌డా కాంప్ర‌మైజ్ కాకుండా సినిమాను రూపొందిస్తాం. త్వ‌ర‌లోనే ప్రారంభం కానున్న ఈ సినిమాకు సంబంధించిన న‌టీన‌టులు, టెక్నిషియ‌న్స్ వివ‌రాల‌ను తెలియ‌చేస్తాం'' అని ద‌ర్శ‌కుడు ఎ.య‌స్‌.ర‌వికుమార్ చౌద‌రి తెలిపారు. ప్ర‌ముఖ నిర్మాత డి.ఎస్‌.రావు ఈ చిత్రానికి నిర్మాణ బాధ్య‌త‌లు వ‌హిస్తారు

PREV
click me!

Recommended Stories

5000 తో ఫిల్మ్ ఇండస్ట్రీకి వచ్చింది, ప్రస్తుతం 5 నిమిషాలకు 3 కోట్లు వసూలు చేస్తున్న హీరోయిన్ ఎవరో తెలుసా?
Actor Sivaji: మహిళా కమిషన్‌ దెబ్బకి దిగొచ్చిన శివాజీ.. స్త్రీ అంటే మహాశక్తితో సమానం అంటూ క్షమాపణలు