
తెలుగు ప్రజలకు రాజమౌళి పరిచయం చేసిన మగధీర మళ్లీ రాబోతోంది. అందేటి.. ఈ సినిమాకేమన్నా సీక్వెల్ ప్లాన్ చేస్తున్నారా అనుకుంటున్నారా ? అదేం కాదండీ.. మన తెలుగు ప్రజలను అలరించిన మగధీర ఈసారి జపాన్ ప్రజలకు చేరువ కాబోతున్నట్లు సమాచారం. బాహుబలి చిత్రాన్ని జపాన్ భాషలోకి అనువదించి అక్కడి ప్రేక్షకులకు దగ్గరైన మన జక్కన్న ఇప్పుడు మగధీరను కూడా అదే తరహాలో జపాన్ ప్రేక్షకులకు పరిచయం చేయబోతున్నట్లు సినీవర్గాల ద్వారా తెలిసింది.
రామ్‌చరణ్ హీరోగా 2009లో విడుదలై రికార్డులు సృష్టించిన 'మగధీర' చిత్రాన్ని జపాన్ భాషలో అనువదించేందుకు రాజమౌళి సన్నహాలు చేస్తున్నట్లు సమాచారం. ఈ సినిమా తర్వాత 'ఈగ' చిత్రాన్ని కూడా జపాన్ మార్కెట్లో విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే, ఈ విషయంపై ఇంకా అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. ఇదే నిజమైతే, జపాన్ మార్కెట్లో మన జక్కన తమ మార్క్ వేయటం ఖాయమని భావిస్తున్నారు సినీప్రజలు.