100 మంది సంగీతకారులతో మ్యాస్ట్రో ఇళయరాజా మ్యూజిక్ కాన్సెర్ట్.. హైదరాబాద్ లో గ్రాండ్ ఈవెంట్

Published : Feb 01, 2023, 05:36 PM IST
100 మంది సంగీతకారులతో మ్యాస్ట్రో ఇళయరాజా మ్యూజిక్ కాన్సెర్ట్.. హైదరాబాద్ లో గ్రాండ్ ఈవెంట్

సారాంశం

హైదరాబాద్ నగరం సంగీత ప్రియులని ఆకర్షించే ఒక గ్రాండ్ ఈవెంట్ కి రెడీ అవుతోంది. భారత చలనచిత్ర పరిశ్రమలో గొప్ప సంగీత దర్శకులలో ఇళయరాజా ఒకరు. ఎన్నో చిత్రాల్లో ఇళయరాజా అందించిన పాటలు ఇప్పటికి సంగీత ప్రియులని ఉర్రూతలూగిస్తూ ఉంటాయి. 

హైదరాబాద్ నగరం సంగీత ప్రియులని ఆకర్షించే ఒక గ్రాండ్ ఈవెంట్ కి రెడీ అవుతోంది. భారత చలనచిత్ర పరిశ్రమలో గొప్ప సంగీత దర్శకులలో ఇళయరాజా ఒకరు. ఎన్నో చిత్రాల్లో ఇళయరాజా అందించిన పాటలు ఇప్పటికి సంగీత ప్రియులని ఉర్రూతలూగిస్తూ ఉంటాయి. అలాంటి లెజెండ్రీ మ్యుజీషియన్ త్వరలో హైదరాబాద్ లో లవ్ పెర్ఫార్మన్స్ ఇవ్వబోతున్నారు. 

ఫిబ్రవరి 26న ఈ మ్యూజిక్ కన్సెర్ట్ వేడుక గ్రాండ్ గా జరగనుంది. హైదరాబాద్ టాకీస్ సంస్థ ఈ గ్రాండ్ ఈవెంట్ ని నిర్వహించబోతోంది. ఈ మేరకు ఆ సంస్థ ప్రకటన విడుదల చేసింది. అంతే కాదు హైదరాబాద్ టాకీస్ టీం చెన్నైలో ఇళయరాజాని మీట్ అయ్యారు. ఈవెంట్ కి సంబంధించిన ప్రోమో షూట్ లో పాల్గొన్నారు. 

మ్యూజిక్ లవర్స్ ఉర్రూతలూగే విధంగా ఈ ఈవెంట్ ని నిర్వహించబోతున్నట్లు హైదరాబాద్ టాకీస్ సంస్థ ప్రతినిధులు పేర్కొన్నారు. గచ్చిబౌలి స్టేడియంలో ఈ ఈవెంట్ జరగనుంది. వేదికపై ఇళయరాజా 100 మంది సంగీతకారులతో కలసి ఎప్పటికి మరచిపోలేని విధంగా పెర్ఫార్మ్ చేయనున్నారు. ఈ ఈవెంట్ కి 20 వేలమంది వరకు ఆడియన్ హాజరు కానున్నట్లు తెలుస్తోంది. 

ఈ ఏడాది ఇళయరాజా తన 80వ వసంతంలోకి అడుగు పెట్టబోతున్నారు. ఆయనకి ట్రిబ్యూట్ గా ఈ ఈవెంట్ జరగనుంది. ఈ ఈవెంట్ కి ఒకరోజు ముందు అంటే ఫిబ్రవరి 25న ప్రముఖ సంగీత దర్శకులు, గాయకులు అంతా కలసి ఇళయరాజా చిత్రాల్లోని పాటలు పాడనున్నారు. 

గతంలో హైదరాబాద్ టాకీస్ సంస్థ ఏఆర్ రెహమాన్, అరిజిత్ సింగ్ లతో కూడా ఈ తరహా ఈవెంట్స్ నిర్వహించి విజయవంతం చేసింది. మ్యూజిక్ మ్యాస్ట్రో ఇళయరాజా ఈవెంట్ ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఇళయరాజా గారితో ఈవెంట్ చేసే అవకాశం రావడం లైఫ్ టైం ఆపర్చునిటీ ని ఆ సంస్థ కో ఫౌండర్ దీప్తి.. భాగస్వాములు మనోజ్, అంజు శ్రీధర్ అన్నారు. 

 

PREV
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9 Winner Fix: బిగ్‌ బాస్‌ విన్నర్‌ ముందే ఫిక్స్.. అదే జరిగితే సరికొత్త హిస్టరీకి శ్రీకారం
Sara Arjun: ధురంధర్ స్టార్ సారా అర్జున్ రూ.12 కోట్ల లగ్జరీ ఫ్లాట్.. వైరల్ ఫోటోలు