'అన్‌స్టాపబుల్ 'పవన్ ఎపిసోడ్ రిలీజ్ డేట్, వైసీపి వెయిటింగ్

Published : Feb 01, 2023, 05:05 PM ISTUpdated : Feb 01, 2023, 05:07 PM IST
 'అన్‌స్టాపబుల్ 'పవన్ ఎపిసోడ్ రిలీజ్ డేట్,  వైసీపి వెయిటింగ్

సారాంశం

 'అన్‌స్టాపబుల్‌ 2' ఎపిసోడ్ గురించి వైసీపీ కూడా ఎదురు చూస్తోంది. ఈ ఎపిసోడ్ కి సంబంధించిన విడుదల తేదీని ప్రకటించారు. బాలకృష్ణ – పవన్ కళ్యాణ్ రెండు భాగాలుగా ప్రకటించడం జరిగింది.


బాలకృష్ణ, పవన్ కళ్యాణ్  'అన్‌స్టాపబుల్‌ 2'లో   ఏయే టాపిక్స్ గురించి మాట్లాడారు? అనే ఆసక్తి సమాన్యూలలోనే కాదు సెలబ్రెటీలలోనూ... రాజకీయ వర్గాలలోనూ ఉంది. వారంతా ఈ ఎపిసోడ్ కోసం సైతం ఆసక్తిగా ఎదురు చూస్తున్నాయి. ముఖ్యంగా ఏపీలో అధికార పార్టీ కూడా ఈ ఎపిసోడ్ కోసం ఎదురుచూస్తోంది.  ఎందుకంటే... ఇటీవల తెలుగు దేశం అధినేత నారా చంద్రబాబు నాయుడును పవన్ కళ్యాణ్ కలిశారు. ప్రతిపక్షాలపై ప్రభుత్వ వైఖరి సహేతుకంగా లేదంటూ సంఘీభావం ప్రకటించారు. మరోవైపు అమెరికాలో అభిమానుల మధ్య ఘర్షణ జరిగింది. రాబోయే ఎన్నికల్లో టీడీపీ, జనసేన కలిసి పోటీ చేస్తాయని ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో 'అన్‌స్టాపబుల్‌ 2' ఎపిసోడ్ గురించి వైసీపీ కూడా ఎదురు చూస్తోంది. ఈ ఎపిసోడ్ కి సంబంధించిన విడుదల తేదీని ప్రకటించారు. బాలకృష్ణ – పవన్ కళ్యాణ్ రెండు భాగాలుగా ప్రకటించడం జరిగింది.

 ఈ టాక్ షో మీద చాలా క్రేజ్ ఏర్పడింది. దీంతో మేకర్స్ బాలకృష్ణ – పవన్ కళ్యాణ్ అన్‌స్టాపబుల్ 2 మొదటి ఎపిసోడ్ ని ఫిబ్రవరి 2 తారీఖున విడుదలకు సిద్ధం చేసినట్టు ప్రకటించారు. పవన్ కళ్యాణ్ అన్‌స్టాపబుల్ 2 ఎపిసోడ్ కి సంబంధించిన ప్రోమో లు ఇప్పటికే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే రెండో ఎపిసోడ్ కి సంబంధించిన రిలీజ్ డేట్ పై ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. ఎందుకంటే ఇదే టాక్ షోలో ప్రభాస్ సెకండ్ ఎపిసోడ్ కూడా విడుదల కావాల్సి ఉంది.

సమాచారం మేరకు ప్రభాస్ సెకండ్ ఎపిసోడ్ నీ జనవరి 6న విడుదల చేసే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తుంది. దీని తర్వాత బాలకృష్ణ – పవన్ కళ్యాణ్ సెకండ్ ఎపిసోడ్ విడుదల చేయవచ్చు. మొత్తం మీద ప్రభాస్ అలాగే పవన్ కళ్యాణ్ ఈ టాక్ షో కి మంచి క్రేజ్ తీసుకురావడం జరిగింది. నట సింహం నందమూరి బాలకృష్ణ (Balakrishna)తో జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్  సందడి ఎలా ఉంటుందో ఇప్పటికే విడుదలైన వీడియో గ్లింప్స్‌, టీజర్ ద్వారా జనాలకు బాగా అర్థమైంది. ఇద్దరి మధ్య మాంచి ఫన్ ఉండబోతుందని తెలిసింది. అలాగే, పాలిటిక్స్ ప్రస్తావన కూడా ఉందని క్లారిటీ వచ్చింది. 

పవన్ కళ్యాణ్ ఎపిసోడ్ వీడియో గ్లింప్స్‌లో ''నేను కొన్ని మెజర్‌మెంట్స్ (కొలతలు) తీసుకోవాలి'' అని బాలకృష్ణ అంటే పవన్ కళ్యాణ్ నవ్వేశారు. ఇక, 'అన్‌స్టాపబుల్‌ 2' టీజర్ విషయానికి వస్తే... తనను 'బాల' అని పిలవమని పవన్ కళ్యాణ్ అడగడం... అందుకు పవన్ ''నేను ఓడిపోవడానికి సిద్ధం కానీ పిలవలేను'' అని పవన్ అనడం వైరల్ అయ్యింది. అభిమానులు ఎందుకు ఓట్లు వేయడం లేదనే అంశాన్ని కూడా బాలకృష్ణ అడిగారు. 
 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Kokkoroko మూవీతో అలరించేందుకు వస్తోన్న యంగ్‌ సెన్సేషన్‌.. కొత్త పోస్టర్‌ అదిరింది
Dhoolpet Police Station Review: `ధూల్‌పేట్‌ పోలీస్‌ స్టేషన్‌` కేస్‌ 1 వెబ్‌ సిరీస్‌ రివ్యూ.. చూపు తిప్పుకోలేరు