48 గంటల్లో రూ. 30లక్షలు చెల్లించండి... ధనుష్ కి హైకోర్ట్ షాక్

Published : Aug 06, 2021, 11:39 AM IST
48 గంటల్లో రూ. 30లక్షలు చెల్లించండి... ధనుష్ కి హైకోర్ట్ షాక్

సారాంశం

2018 సుప్రీం కోర్ట్ ఆదేశాల తరువాత కూడా టాక్స్ చెల్లించడానికి నిరాకరించిన ధనుష్, ఇప్పుడు కేసు విత్ డ్రా చేసుకుంటాను అనడంలో నిజాయితీ లేదన్న జస్టిస్ సుబ్రహ్మణ్యం.. 48గంటల్లోగా రూ. 3030757 చెల్లించాలని ఆదేశించారు.

లగ్జరీ కారు రోల్స్ రాయిస్ పన్ను చెల్లింపు విషయంలో హీరో ధనుష్ వ్యవహార శైలి తప్పుబట్టిన మద్రాస్ హై కోర్ట్ ఆగ్రహం వ్యక్తం చేయడంతో పాటు, టాక్స్ చెల్లించాలంటూ ఆదేశించింది. అది కూడా నిర్ణీత సమయంలో చెల్లించేలా కఠినంగా తీర్పు ఇవ్వడం జరిగింది. 2015లో ధనుష్ బ్రిటన్ దేశం నుండి రోల్స్ రాయిస్ కారును ఖరీదు చేశారు. ఈ కారు దిగుమతి సుంకం ధనుష్ ప్రభుత్వానికి చెల్లించాల్సి ఉంది. 


అయితే ఈ టాక్స్ విషయంలో తనకు మినహాయింపు ఇవ్వాలని ధనుష్ కోర్టుని ఆశ్రయించారు. లగ్జరీ కారు టాక్స్ మినహాయింపు అభ్యర్థనను కోర్ట్ తీవ్రంగా తప్పుబట్టింది. పేద ప్రజలు ప్రతి వస్తువు కొనుగోలుపై టాక్స్ చెల్లిస్తుంటే... కోట్ల సంపాదన కలిగిన సినిమా హీరో టాక్స్ మినహాయింపు కోరడం దారుణం అంటూ జస్టిస్ సుబ్రహ్మణ్యం అసహనం వ్యక్తం చేశారు. కనీస వసతులు కూడా లేని పేద ప్రజలు ఎప్పుడూ టాక్స్ మినహాయింపు కోసం ఇలాంటి అభ్యర్ధనలు చేయలేదని ఆయన అన్నారు. ప్రభుత్వం నిర్మించిన రోడ్లపై తిరిగే ఖరీదైన కారు కొనుగోలుపై చెల్లించవలసిన టాక్స్ మినహాయింపు కోరడం విడ్డూరం అన్నారు. 


జడ్జి సుబ్రహ్మణ్యం వ్యాఖ్యలకు వివరణగా ధనుష్ తరపు న్యాయవాది... ఇప్పటికే సగం టాక్స్ చెల్లించారని, మిగతా సగం చెల్లించడానికి సిద్ధంగా ఉన్నట్లు కోర్ట్ కి నివేదించారు. అలాగే ధనుష్ పిటిషన్ విత్ డ్రా చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నట్లు జడ్జికి వివరణ ఇవ్వడం జరిగింది. 2018 సుప్రీం కోర్ట్ ఆదేశాల తరువాత కూడా టాక్స్ చెల్లించడానికి నిరాకరించిన ధనుష్, ఇప్పుడు కేసు విత్ డ్రా చేసుకుంటాను అనడంలో నిజాయితీ లేదన్న జస్టిస్ సుబ్రహ్మణ్యం.. 48గంటల్లోగా రూ. 3030757 చెల్లించాలని ఆదేశించారు. పన్ను చెల్లింపు విషయంలో ధనుష్ వ్యవహార శైలి ఒకింత విమర్శలపాలు అవుతుంది. 
 

PREV
click me!

Recommended Stories

పూసలమ్మిన మోనాలిసా ఎంతగా మారిపోయిందో చూశారా
ఇండస్ట్రీ రికార్డులు బద్దలు కొట్టాల్సిన సినిమా, కానీ ఫ్లాప్..హీరోని తలుచుకుని రోజూ బాధపడే డైరెక్టర్ ఎవరంటే