టాలీవుడ్ లో తీవ్ర విషాదం కిరాతకుడు మూవీ హీరో మృతి

Published : Aug 06, 2021, 09:20 AM IST
టాలీవుడ్ లో తీవ్ర విషాదం కిరాతకుడు మూవీ హీరో మృతి

సారాంశం

64 ఏళ్ల బొమ్మిరెడ్డి రాఘవ ప్రసాద్ అనారోగ్య కారణాలతో మృతి చెందారు. కొన్నాళ్లుగా బొమ్మిరెడ్డి ప్రసాద్ అనారోగ్యంతో బాధపడుతున్నట్లు సమాచారం. కిరాతకుడు అనే టైటిల్ తో తెరకెక్కిన సినిమాలో హీరోగా నటించి, స్వయంగా నిర్మించిన ఆయన రూపాయి సినిమాకు సహ నిర్మాతగా వ్యవహరించారు.   

టాలీవుడ్ లో విషాదం చోటు చేసుకుంది. నటుడు, నిర్మాత మాజీ సర్పంచ్ బొమ్మిరెడ్డి రాఘవ ప్రసాద్ అకాల మరణం పొందారు. 64 ఏళ్ల బొమ్మిరెడ్డి రాఘవ ప్రసాద్ అనారోగ్య కారణాలతో మృతి చెందారు. కొన్నాళ్లుగా బొమ్మిరెడ్డి ప్రసాద్ అనారోగ్యంతో బాధపడుతున్నట్లు సమాచారం. కిరాతకుడు అనే టైటిల్ తో తెరకెక్కిన సినిమాలో హీరోగా నటించి, స్వయంగా నిర్మించిన ఆయన రూపాయి సినిమాకు సహ నిర్మాతగా వ్యవహరించారు. 

ఆ తర్వాత రాజధాని, సౌర్య చక్ర, దొంగల బండి, బంగారు బుల్లోడు, రంగవల్లి తదితర సినిమాల్లో నటించి నటుడిగా మంచి గుర్తింపు పొందారు.అంతేకాకుండా గతంలో స్వగ్రామం తూర్పు గోదావరి జిల్లా పి.గన్నవరం మండలం రాజుల పాలెం గ్రామ సర్పంచ్‌గా కూడా సేవలందించారు. బొమ్మిరెడ్డి రాఘవ ప్రసాద్ మృతిపై పలువురు సినీ నటులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. కరోనా మహమ్మారి అనేక మంది నటులను పొట్టనబెట్టుకోగా, అనారోగ్య కారణాలతో గత రెండేళ్ల మరికొందరు నటులు ప్రాణాలు వదలడం, బాధాకరం. 

PREV
click me!

Recommended Stories

'నారీ నారీ నడుమ మురారి' టీజర్ రివ్యూ..రవితేజ, శర్వానంద్ ఇద్దరిలో ఎవరో ఒకరికి డ్యామేజ్ తప్పదా ?
Avatar 3: రిలీజ్‌కి ముందే 5000 కోట్లు.. ప్రీ రిలీజ్‌ బిజినెస్‌లో అవతార్‌ 3 సంచలనం.. బాక్సాఫీసు వద్ద డీలా