స్లిమ్ అండ్ స్టైలిష్... సమంత లేటెస్ట్ వర్కవుట్ వీడియో వైరల్

By team teluguFirst Published Aug 6, 2021, 11:03 AM IST
Highlights

జిమ్ లో కఠిన కసరత్తులు చేస్తున్న వీడియో షేర్ చేశారు  సమంత. బరువులు ఎత్తుతూ... శరీరంలోని క్యాలరీలు కరిగించే వ్యాయామాలు చేస్తుంది సమంత. జిమ్ వేర్ లో స్లిమ్ అండ్ స్టైలిష్ గా ఉన్న సమంత లుక్ వైరల్ గా మారింది. 

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ఫిట్నెస్ ఫ్రీక్. శరీరాన్ని ఆరోగ్యంగా, అందంగా ఉంచుకోవడానికి చాలా కఠినంగా వ్యవహరిస్తారు. గంటల తరబడి వ్యాయామం, యోగ, ప్రాణాయామం చేయడం ఆమె దిన చర్యలో భాగం. ఇక ఆహారం విషయంలో కూడా అంతే జాగ్రత్తలు తీసుకుంటారు. డైట్ ఎక్స్పర్ట్స్ సలహా మేరకు తాజా, ఆరోగ్యకరమైన ఆహారం తీసుకుంటారు. దాదాపు ఆమె కెమికల్స్ వాడకుండా పండించే ఆర్గానిక్ ఫుడ్ తింటారు. దీని కోసం తన ఇంటి వారండా, గార్డెన్స్ వాడుకుంటారు. 


సమంత తన ఆహారంలో భాగమైన కొన్ని రకాల పండ్లు, కూరగాయలు స్వయంగా పండించుకుంటారు. కోట్ల సంపాదన, ఫేమ్, ఇమేజ్ ఉండి కూడా ఎటువంటి అశ్రద్ధ చేయకుండా కష్టపడి శరీరాన్ని యవ్వనంగా, అందంగా ఉంచుకుంటారు. తన వర్కవుట్ వీడియోలు పంచుకోవడం ద్వారా ఫ్యాన్స్ కి స్ఫూర్తిగా నిలుస్తారు సమంత. తాజాగా ఆమె జిమ్ లో కఠిన కసరత్తులు చేస్తున్న వీడియో షేర్ చేశారు. బరువులు ఎత్తుతూ... శరీరంలోని క్యాలరీలు కరిగించే వ్యాయామాలు చేస్తుంది సమంత. జిమ్ వేర్ లో స్లిమ్ అండ్ స్టైలిష్ గా ఉన్న సమంత లుక్ వైరల్ గా మారింది. 

సమంత వర్కవుట్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ది ఫ్యామిలీ మాన్ 2 వెబ్ సిరీస్ తో సక్సెస్ కొట్టిన సమంత, పాన్ ఇండియా చిత్రం శాకుంతలం షూటింగ్ లో పాల్గోంటున్నారు. పౌరాణిక గాథగా తెరకెక్కుతున్న శాకుంతలం చిత్రానికి గుణశేఖర్ దర్శకత్వం వహిస్తున్నారు. భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. శాకుంతలం మూవీలో అల్లు అర్జున్ కూతురు అర్హ చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎంట్రీ ఇవ్వడం విశేషం.

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by S (@samantharuthprabhuoffl)

click me!