విశాల్ కి ఊహించని షాక్ ఇచ్చిన మద్రాస్ హైకోర్టు.. ఆయన సినిమాలపై బ్యాన్, 21 కోట్ల వివాదం

Published : Apr 08, 2023, 10:53 AM IST
విశాల్ కి ఊహించని షాక్ ఇచ్చిన మద్రాస్ హైకోర్టు.. ఆయన సినిమాలపై బ్యాన్, 21 కోట్ల వివాదం

సారాంశం

విశాల్ తెలుగు తమిళ భాషల్లో సమానంగా గుర్తింపు తెచ్చుకున్న హీరో. విశాల్ ని తెలుగు ప్రేక్షకులు ఇక్కడి నటుడిగానే ప్రేమ కురిపిస్తారు. 

విశాల్ తెలుగు తమిళ భాషల్లో సమానంగా గుర్తింపు తెచ్చుకున్న హీరో. విశాల్ ని తెలుగు ప్రేక్షకులు ఇక్కడి నటుడిగానే ప్రేమ కురిపిస్తారు. తెలుగు రాష్ట్రాలతో విశాల్ కి ప్రత్యేక అనుబంధం ఉంది. విశాల్ ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ ఏపీలోనే మొదలయింది. సినిమాలతో పాటు ఇతర వ్యవహారాలు, వివాదాలతో కూడా నిత్యం విశాల్ గురించి వార్తలు వస్తూనే ఉన్నాయి. 

ఒక పాత వివాదం నేపథ్యంలో విశాల్ కి ఊహించని ఎదురు దెబ్బ తగిలింది. తమిళనాట పెద్ద ప్రొడక్షన్ హౌస్ అయిన లైకా సంస్థకి విశాల్ రూ 15 కోట్ల ఫిక్స్డ్ డిపాజిట్ చెల్లించాలని మూడు వారాల గడువు ఇస్తూ కోర్టు ఆదేశించింది. అలా చేయకుంటే విశాల్ సొంత నిర్మాణ సంస్థ ఫిలిం ఫ్యాక్టరీ బ్యానర్ లో తెరకెక్కే చిత్రాలపై నిషేధం ఉంటుందని తెలిపింది. 

విశాల్, లైకా సంస్థ వివాదంలో ఇది కీలక పరిణామం అనే చెప్పాలి. కొన్నేళ్ల క్రితం విశాల్.. అన్బు చెళియన్ అనే ఫైనాన్షియర్ వద్ద తన నిర్మాణ సంస్థ ఫిలిం ఫ్యాక్టరీ కోసం రూ 21 కోట్లు అప్పు తీసుకున్నాడు. అయితే ఈ రుణాన్ని లైకా నిర్మాణ సంస్థ సదరు ఫైనాన్షియర్ కి చెల్లించింది. దీనికి ప్రతిఫలంగా లైకా.. విశాల్ తో ఒక ఒప్పందం చేసుకుంది. తమ డబ్బు చెల్లించే వరకు విశాల్ నటించే చిత్రాల పంపిణి హక్కులు తమకే సొంతం అన్నట్లుగా ఒప్పందం చేసుకున్నారు. 

కానీ ఈ ఒప్పందాన్ని అతిక్రమిస్తూ విశాల్ తన ' సామాన్యుడు' చిత్రాన్ని రిలీజ్ చేసుకున్నాడు. దీనితో లైకా సంస్థ కోర్టుని ఆశ్రయించింది. దీనితో విశాల్ 15 కోట్లు లైకా సంస్థకి ఫిక్స్డ్ డిపాజిట్ చెల్లించాలని ఆదేశించింది. కానీ విశాల్ అలా చేయలేదు. దీనిపై హై కోర్టులో తాజాగా విచారణ జరిగింది. తనకి ఇటీవల 18 కోట్ల నష్టం వచ్చింది ని విశాల్ తెలిపారు. అందువల్లే చెల్లించలేకపోయానని కోర్టులో పేర్కొన్నారు. 

దీనితో కోర్టు విశాల్ ఆస్తులకు సంబంధించిన వివరాలు అడిగింది. అలాగే సింగిల్ జడ్జి స్పెషల్ కోర్టు ఆదేశించిన 15 కోట్ల ఫిక్స్డ్ డిపాజిట్ ని హై కోర్టు కూడా సమర్ధించింది. ఆ మొత్తం చెల్లించే వరకు విశాల్ నిర్మాణ సంస్థ ఫిలిం ఫ్యాక్టరీలో తెరకెక్కుతున్న చిత్రాలు థియేటర్స్, ఓటిటిలో రిలీజ్ కాకుండా నిషేధం విధిస్తున్నట్లు హై కోర్టు పేర్కొంది. దీనితో విశాల్ పెద్ద ఆర్థిక సమస్యల్లోనే పడ్డాడు. విశాల్ తన నిర్మాణ సంస్థలో పలు చిత్రాలు నిర్మిస్తున్నాడు. దీనిపై విశాల్ తదుపరి యాక్షన్ ఎలా ఉండబోతోందో మరి. 

PREV
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9 title Winner: నాగార్జున డైలాగ్‌తో చెప్పి మరీ కప్‌ కొట్టిన కళ్యాణ్‌, ఎమోషనల్‌ కామెంట్‌.. తనూజకే క్రెడిట్‌
Bigg Boss Telugu 9: రమ్య మోక్ష చేత అందరి ముందు క్షమాపణలు చెప్పించిన కళ్యాణ్‌.. పరువు పోయిందిగా