ఉపాసనకి అలియా భట్ సర్ప్రైజ్, భలే గిఫ్ట్ పంపింది.. గర్భవతి కావడంతో ముందుగానే..

Published : Apr 08, 2023, 08:46 AM IST
ఉపాసనకి అలియా భట్ సర్ప్రైజ్, భలే గిఫ్ట్ పంపింది.. గర్భవతి కావడంతో ముందుగానే..

సారాంశం

రాంచరణ్ సతీమణి ఉపాసన ప్రస్తుతం గర్భవతి అయిన సంగతి తెలిసిందే. చరణ్, ఉపాసనకి పుట్టబోయే బిడ్డ కోసం మెగా ఫ్యామిలీ తో పాటు అభిమానులంతా ఎదురుచూస్తున్నారు.

రాంచరణ్ సతీమణి ఉపాసన ప్రస్తుతం గర్భవతి అయిన సంగతి తెలిసిందే. చరణ్, ఉపాసనకి పుట్టబోయే బిడ్డ కోసం మెగా ఫ్యామిలీ తో పాటు అభిమానులంతా ఎదురుచూస్తున్నారు. ఒకవైపు ఆర్ఆర్ఆర్ చిత్రానికి ఆస్కార్ అవార్డు, గ్లోబల్ క్రేజ్ తో రాంచరణ్ ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. పర్సనల్ లైఫ్ లో కూడా చరణ్ కి ఈ ఏడాది మెమొరబుల్ గా మారనుంది. 

వివాహం జరిగిన పదేళ్ల తర్వాత చరణ్, ఉపాసన దంపతులు తల్లిదండ్రులు కాబోతున్నారు. దీనితో ప్రస్తుతం అందరి చూపు ఉపాసనపైనే ఉంది. ఆమె ఎక్కడికి వెళ్లినా ఆ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఏది ఏమైనా ఉపాసన ప్రస్తుతం ఈ సమయాన్ని సంతోషంగా గడుపుతోంది. 

బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ ఊహించని విధంగా ఉపాసనని సర్ప్రైజ్ చేసింది. ఉపాసనకు అలియా అదిరిపోయే గిఫ్ట్ పంపింది. అలియా నుంచి గిఫ్ట్ అందుకున్న ఉపాసన సంతోషం వ్యక్తం చేస్తూ ఈ విషయాన్ని సోషల్ మీడియాలో పంచుకున్నారు. 

అలియా భట్ ప్రస్తుతం 'ఈద్ ఏ మమ్మ' అనే క్లోతింగ్ బ్రాండ్ కి బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తున్నారు. ఆ సంస్థకి సంబంధించిన పెద్ద కిట్ ని అలియా ఉపాసనకు పంపింది. ఈ కిట్ లో గర్భంతో ఉన్నవారికి అవసరమైన బట్టలు, వస్తువులతో పాటు పుట్టబోయే పిల్లలకు కావలసిన బట్టలు కూడా ఉంటాయి. 

ఇటీవల ఉపాసన సీమంతం వేడుకని రాంచరణ్ దుబాయ్ లో గ్రాండ్ గా సెలెబ్రేట్ చేశారు. ప్రస్తుతం రాంచరణ్ తన భార్య పక్కనే ఉంటూ ఆమె కోసం సమయం కేటాయిస్తున్నాడు. ఆర్ఆర్ఆర్ చిత్రంతో అలియా భట్, రాంచరణ్ ఫ్యామిలీ మధ్య మంచి రిలేషన్ ఏర్పడింది. ఆర్ఆర్ఆర్ లో చరణ్ రామరాజుగా.. అలియా సీతగా జంటగా నటించారు. 

అలియా భట్, రణబీర్ కపూర్ దంపతులు కూడానా గత ఏడాది తల్లి దండ్రులు అయిన సంగతి తెలిసిందే. అలియా గత ఏడాది నవంబర్ లో పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. 

PREV
click me!

Recommended Stories

మేకప్ పై సాయి పల్లవి ఓపెన్ కామెంట్స్, ఆ తలనొప్పి నాకు లేదంటున్న స్టార్ హీరోయిన్
NTR: షారూఖ్‌ ఖాన్‌తో ఎన్టీఆర్‌ భారీ మల్టీస్టారర్‌.. `వార్‌ 2`తో దెబ్బ పడ్డా తగ్గని యంగ్‌ టైగర్‌