అల్లు అర్జున్‌కి చిరంజీవి బర్త్ డే విషెస్‌.. దాని గురించి ప్రస్తావన.. ఫ్యాన్స్ అన్‌హ్యాపీ ఎందుకంటే?

Published : Apr 08, 2023, 10:02 AM IST
అల్లు అర్జున్‌కి చిరంజీవి బర్త్ డే విషెస్‌.. దాని గురించి ప్రస్తావన.. ఫ్యాన్స్ అన్‌హ్యాపీ ఎందుకంటే?

సారాంశం

ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌కి మెగాస్టార్‌ చిరంజీవి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేశారు. కానీ బన్నీ ఫ్యాన్స్ మాత్రం అసంతృప్తితో ఉన్నారు. అది మిస్‌ చేయడం పట్ల వాళ్లు నిరాశ చెందుతున్నారు.

ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ నేడు (ఏప్రిల్‌8) తన 41వ పుట్టిన రోజుని జరుపుకుంటున్నారు. `పుష్ప` వంటి పెద్ద హిట్‌ తర్వాత దానికి కొనసాగింపుగా `పుష్ప2` భారీ స్థాయిలో చేస్తున్న నేపథ్యంలో బన్నీ బర్త్ డే చాలా స్పెషల్‌గా మారింది. తన బర్త్ డే సందర్భంగా ఒక్క రోజు ముందుగానే తన అభిమానులకు ట్రీట్‌ ఇచ్చాడు బన్నీ. `పుష్ప2` నుంచి కాన్సెప్ట్ టీజర్‌, ఫస్ట్ లుక్‌ని విడుదల చేశారు. ఈ రెండు నెట్టింట దుమ్మురేపుతున్నాయి.

ఇదిలా ఉంటే బన్నీ బర్త్ డే విషెస్‌ల వెల్లువ సాగుతుంది. ఈ నేపథ్యంలో బన్నీ మామయ్య, మెగాస్టార్‌ చిరంజీవి ప్రత్యేకంగా విషెస్‌ తెలిపారు. హ్యాపీ బర్త్ డే అల్లు అర్జున్‌, మెనీ హ్యాపీ రిటర్న్స్ అని పేర్కొన్నారు. దీంతోపాటు `పుష్ప2ః ది రూల్‌` ఫస్ట్ లుక్‌ రాక్‌ అంటూ ప్రత్యేకంగా మెన్షన్‌ చేశారు. ఆయనకు అభినందనలు తెలిపారు. ప్రస్తుతం చిరంజీవి ట్వీట్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంది. 

అయితే ఈ సందర్భంగా బన్నీ ఫ్యాన్స్ ఓ విషయంలో నిరాశ చెందుతున్నారు. మెగాస్టార్‌ బర్త్ డే విషెస్‌ చెప్పడం పట్ల వారు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. అదే సమయంలో ఎలాంటి ఫోటో లేకుండా కేవలం విషెస్‌ నోట్‌ పేర్కొనడం పట్ల కాస్త అసంతృప్తికి లోనవుతున్నారు. ఏదైనా రేర్‌ ఫోటో ఉంటే పోస్ట్ చేయోచ్చు కదా అని రిక్వెస్ట్ చేస్తున్నారు. ఫోటో పోస్ట్ చేస్తే బాగుండేదని, ఒక్క ఎప్పుడూ చూడని ఫోటోని పోస్ట్ చేయండి అంటున్నారు. ఫోటో వేయ్‌ బాసూ అంటున్నారు. ఈ విషయంలో వాళ్లు నిరాశ చెందినట్టు తెలుస్తుంది. 

ఇక బన్నీకి.. పెద్ద ఇన్‌స్పిరేషన్‌ మెగాస్టార్‌ చిరంజీవి అనే విషయం తెలిసిందే. తరచూ ఈ విషయాన్ని బన్నీ చెబుతూ వస్తుంటారు. అల్లు అర్జున్‌.. లెజెండరీ నటుడు అల్లు రామలింగయ్య వారసత్వాన్ని పునికి పుచ్చుకుని సినిమాల్లోకి వచ్చినా, తమకు మాత్రం చిరంజీవినే గాడ్‌ ఫాదర్‌గా భావిస్తుంటారు. ఇక బన్నీ ప్రస్తుతం `పుష్ప2`లో నటిస్తున్నారు. సుకుమార్‌ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం చిత్రీకరణ దశలో ఉంది. 

నిన్న విడుదల చేసిన కాన్సెప్ట్ టీజర్‌, ఫస్ట్ లుక్‌ ఆకట్టుకుంటున్నాయి. అయితే టీజర్‌లో బన్నీ లుక్‌, కొత్త పోస్టర్‌లో ఆయన లేడీ గెటప్‌ ఆశ్చర్యానికి గురి చేస్తుంది. సినిమాపై అంచనాలను పెంచుతుంది. అయితే పోలీసుల నుంచి తప్పించుకుని, గుర్తు పట్టకుండా ఉండేందుకు బన్నీ హిజ్రాల గెటప్‌లో కనిపిస్తాడా అనేది అనుమానాలు కలుగుతున్నాయి. మరి ఏది నిజమనేది మున్ముందు తేలనుంది. రష్మిక మందన్నా కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో ఫహద్‌ ఫాజిల్‌ విలన్‌గా, సునీల్‌, అనసూయ, రావు రమేష్‌ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Articles on
click me!

Recommended Stories

మేకప్ పై సాయి పల్లవి ఓపెన్ కామెంట్స్, ఆ తలనొప్పి నాకు లేదంటున్న స్టార్ హీరోయిన్
NTR: షారూఖ్‌ ఖాన్‌తో ఎన్టీఆర్‌ భారీ మల్టీస్టారర్‌.. `వార్‌ 2`తో దెబ్బ పడ్డా తగ్గని యంగ్‌ టైగర్‌