సురేష్ బాబు నుండి అల్లు కాంపౌండ్ లోకి!

Published : May 28, 2018, 05:53 PM ISTUpdated : May 28, 2018, 05:59 PM IST
సురేష్ బాబు నుండి అల్లు కాంపౌండ్ లోకి!

సారాంశం

టాలీవుడ్ లో ఉన్న అగ్ర నిర్మాణ సంస్థల్లో సురేష్ ప్రొడక్షన్స్, గీతాఆర్ట్స్ రెండూ ఉంటాయి

టాలీవుడ్ లో ఉన్న అగ్ర నిర్మాణ సంస్థల్లో సురేష్ ప్రొడక్షన్స్, గీతాఆర్ట్స్ రెండూ ఉంటాయి. మధురాశ్రీధర్ రెడ్డి మొదటి నుండి సురేష్ బాబు ప్రొడక్షన్స్ తోనే ఉంటూ వచ్చారు.పెళ్లిచూపులు సినిమా తరువాత సురేష్ బాబు చిన్న కొడుకు అభిరామ్ ను హీరోగా పెట్టి సినిమా చేయాలనుకున్నాడు. దానికి తగ్గట్లు కథ కూడా సిద్ధం చేశాడు. కానీ దానికి సురేష్ బాబు అంగీకరించలేదు.

అయితే ఇప్పుడు సురేష్ బాబు ప్రొడక్షన్స్ ను అల్లు కాంపౌండ్ లోకి జంప్ అయ్యాడు మధురాశ్రీధర్ రెడ్డి. అల్లు శిరీష్ హీరోగా 'ఏబిసిడి' అనే మలయాళ సినిమాను రీమేక్ చేయబోతున్నారు. మలయాళంలో దుల్కర్ సల్మాన్ నటించిన ఈ సినిమా అక్కడ మంచి విజయాన్ని సాధించింది. ఇప్పుడు అదే సినిమాను తెలుగులోకి తీసుకు రాబోతున్నారు. 

అయితే ఈ సినిమాలో మరో రెండు యంగ్ రోల్స్ ఉంటాయి. హీరోతో పాటు సమానంగా ఆ పాత్రలు ఉంటాయి. మరి ఆ పాత్రల కోసం ఎవరిని ఎన్నుకుంటారో చూడాలి. దర్శకుడు సంజీవ్ రెడ్డి ఈ సినిమాను డైరెక్ట్ చేయబోతున్నారు. త్వరలోనే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలుకానుంది. 
 

PREV
click me!

Recommended Stories

James Cameron-Rajamouli: పులులతో సీన్లు ఉంటే చెప్పు, వారణాసి సెట్ కి వస్తా.. రాజమౌళితో జేమ్స్ కామెరూన్
Rashmika Mandanna: ఫ్రెండ్స్ తో శ్రీలంక ట్రిప్ ఎంజాయ్ చేస్తున్న రష్మిక, ఇది బ్యాచిలరేట్ పార్టీనా ?