Macherla Niyojakavargam :‘మాచర్ల నియోజకవర్గం’ ఫస్ట్ ఎటాక్.. యాక్షన్ సీక్వెన్స్ లో నితిన్ విశ్వరూపం..

Published : Mar 30, 2022, 12:59 PM IST
Macherla Niyojakavargam :‘మాచర్ల నియోజకవర్గం’ ఫస్ట్ ఎటాక్..  యాక్షన్ సీక్వెన్స్ లో నితిన్ విశ్వరూపం..

సారాంశం

యంగ్ హీరో నితిన్ (Nitin) నటిస్తున్న తాజా చిత్రం ‘మాచర్ల నియోజకవర్గం’. నితిన్ పుట్టిన రోజు సందర్భంగా మేకర్స్ ఫస్ట్ ఎటాక్ పేరుతో గ్లిమ్స్ రిలీజ్ చేశారు. 

టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ కు ఈరోజు ఎంతో ప్రత్యేకం.  ఈ రోజు తన పుట్టినరోజును ఫ్యామిలీ, అభిమానులతో కలిసి గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకున్నాడు. ఈ సందర్భంగా నితిన్ నటిస్తున్న  తాజాగా చిత్రం ‘మాచర్ల నియోజకవర్గం’ (Macherla Niyojakavargam) నుంచి బర్త్ డే విషెస్ తెలుపుతూ ‘ఫస్ట్ ఎటాక్’ పేరుతో గ్లిమ్స్ ను విడుదల చేశారు. ఎడిటర్ ఎస్‌ఆర్‌ శేఖర్‌ దర్శకుడిగా పరిచయం అవుతున్న ఈ మాస్‌ ఎంటర్‌టైనర్‌ షూటింగ్‌ చివరి దశకు చేరుకుంది. యంగ్ హీరోయిన్ కృతి శెట్టి (Kriti Shetty) నితిన్ సరసన ఆడిపాడనుంది. ఈ చిత్రంలో సిద్ధార్థ్ రెడ్డి అనే ఐఏఎస్ అధికారి పాత్రలో నితిన్ నటిస్తున్నారు. 

అయితే తాజాగా రిలీజ్ అయిన ఫస్ట్ ఎటాక్ లో హై వోల్టేజ్ యాక్షన్ ఎపిసోడ్ ను చూపించారు. నితిన్ యాక్షన్ మోడ్‌లో కనిపిస్తున్నాడు. ఆకట్టుకునే విజువల్స్, డీసెంట్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో గ్లిమ్స్ ఆకట్టుకుంటోంది. నితిన్ లుక్ కూడా అట్రాక్టివ్ గా ఉంది. మాచర్ల నియోజకవర్గం మూవీని ఈ ఏడాది జూలై 8న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నట్టు మేకర్స్ ప్రకటించారు.  

 

నితిన్ హోమ్ బ్యానర్ శ్రేష్ట్ మూవీస్ మరియు ఆదిత్య మూవీస్ పతాకంపై ‘మాచర్ల నియోజకవర్గం’ తెరకెక్కుతోంది. ఈ మాస్ ఎంటర్‌టైనర్‌కు మహతి స్వర సాగర్ సంగీతాన్ని అందించారు. మరోవైపు వక్కంతం వంశీ దర్శకత్వంలో నితిన్ ఒక చిత్రానికి సంతకం చేసినట్టు తెలుస్తోంది. ఈ ప్రాజెక్ట్   ఏడాది చివర్లో ప్రారంభమవుతుంది.


 

PREV
click me!

Recommended Stories

Balakrishna: వెంకటేష్‌ కోసం తన 50 ఏళ్ల సెంటిమెంట్‌ని పక్కన పెట్టిన బాలయ్య.. చిరు, నాగ్‌ల కోసం ఇలా చేయలేదు
Trisha: త్రిష ఎంగేజ్మెంట్ బ్రేకప్ చేసుకున్న వ్యక్తితో డేటింగ్ చేసిన హీరోయిన్.. అందరి ముందు ఒప్పేసుకుంది