
టాలీవుడ్ లో యంగ్ అండ్ టాలెంటెడ్ హీరోగా విశ్వక్ సేన్ ప్రత్యేక గురించి తెచ్చుకున్నాడు. విభిన్న కథలు ఎంచుకుంటూ సక్సెస్ ఫుల్ నటుడిగా తనను తాను ప్రూవ్ చేసుకుంటున్నాడు. ‘ఈ నగరానికి ఏమైంది’, ‘ఫలక్ నుమా దాస్’, ‘హిట్’.. వంటి చిత్రాలతో మాస్ హీరోగా తనకంటూ ప్రత్యేక ఫ్యాన్ బేస్ ను ఏర్పర్చుకున్నాడు. అయితే గతంలో విశ్వక్ సేన్ ఏడాదికో సినిమాతో తెలుగు ఆడియెన్స్ ను అలరించాడు. కానీ ప్రస్తుతం ఒకే ఏడాదిలో ఏకంగా ఆరు సినిమాలు చేస్తూ బిజియేస్ట్ హీరోగా మారిపోయాడు. వరుస చిత్రాలతో మాస్ ఆడియెన్స్ లో ఎనర్జీ నింపేందుకు సిద్ధమవుతున్నాడు.
ఈ ఏడాది విశ్వక్ సేన్ అరడజన్ సినిమాల్లో నటిస్తున్నారు. ఇప్పటికే ‘అశోకవనంలో అర్జున కల్యాణం, ఓరి దేవుడా, ముఖ చిత్రం’ సినిమాల్లో నటిస్తున్న విషయం తెలిసిందే. నిన్ననే విశ్వక్ సేన్ పుట్టిన రోజు సందర్భంగా ముఖచిత్రం (Mukhachitram) సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ అండ్ టీజర్ ను రిలీజ్ చేశారు. ఈ చిత్రంలో విశ్వక్ పవర్ ఫుల్ లాయర్ పాత్రను పోషిస్తున్నాడు. అలాగే గామీ, అక్టోబర్ 31 లేడీస్ నైట్ వంటి చిత్రాల్లోనూ నటిస్తున్నాడు.
ఇవే గాక తన బర్త్ సందర్భంగా ఫ్యాన్స్ ను ఖుషీ చేసేందుకు మరో రెండు క్రేజీ ప్రాజెక్ట్ లను అనౌన్స్ చేశాడు విశ్వక్ సేన్. అయితే 2019లో ‘ఫలక్ నుమా దాస్’ (Falaknuma Das) చిత్రంలో దర్శకుడి, రచయితగా పరిచయం అయ్యాడు. ప్రస్తుతం ఈ చిత్రానికి సీక్వెల్ తెరకెక్కిస్తున్నట్టు తెలిపాడు. దీంతో పాటు మరో ప్రాజెక్ట్ కూడా రానున్నట్టు ప్రకటించారు. స్టూడెంట్, యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ గా రెండో ప్రాజెక్ట్ రూపుదిద్దుకుంటుందని వివరించాడు.
అయితే ప్రస్తుతం విశ్వక్ సేన్ ‘ముఖ చిత్రం’, ‘ఓరి దేవుడా’ ‘దాస్ కా ధమ్కీ’ (Das Ka Dhamki) చిత్ర షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. ఈ చిత్రాలు పూర్తయిన వెంటనే తన నెక్ట్స్ ఫిల్మ్స్ సెట్స్ పైకి వస్తాయని తెలిపారు. దీంతో విశ్వక్ సేన్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. దాస్ చివరిగా రొమాంటిక్ డ్రామా ‘పాగల్’ చిత్రంలో నటించాడు. కానీ అనుకూల ఫలితాలు రాకపోవడంతో.. తన అప్ కమింగ్ ఫిల్మ్స్ పై ప్రత్యేక శ్రద్ధ పెడుతున్నట్టు తెలుస్తోంది. ఏదేమైనా విశ్వక్ ఈ ఏడాది వరుస చిత్రాలతో తెలుగు ప్రేక్షకులను అలరించనున్నాడు.