Darja Teaser:చీర కట్టిన సివంగి... లేడీ డాన్ కనకంగా అనసూయ వీర విహారం 

Published : Mar 30, 2022, 12:46 PM IST
Darja Teaser:చీర కట్టిన సివంగి... లేడీ డాన్ కనకంగా అనసూయ వీర విహారం 

సారాంశం

లేడీ డాన్ గా నెగిటివ్ రోల్ లో అనసూయ దుమ్మురేపింది. కనకం పాత్రలో పంచ్ డైలాగ్స్ విసిరింది. దర్జా మూవీ టీజర్ విడుదల కాగా అనసూయ ఆద్యంతం ఆకట్టుకుంది. 


నటిగా అనసూయ జోరు చూపిస్తున్నారు. ప్రధాన పాత్రలతో పాటు క్యారెక్టర్ రోల్స్ చేస్తూ సత్తా చాటుతున్నారు. ఆమె ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రం దర్జా. అవుట్ అండ్ అవుట్ మాస్ ఎంటర్టైనర్ గా ఈ మూవీ తెరకెక్కింది. అనసూయ కనకం అనే లేడీ మాఫియా లీడర్ రోల్ చేస్తున్నారు. స్మగ్లింగ్, సెటిల్మెంట్స్, దందాలు చేసే లేడీ విలన్ రోల్ చేస్తున్నారు. దర్జా టీజర్ (Darja Teaser) విడుదలైంది. అనసూయ నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో రెచ్చిపోయారు. 

చీర కట్టిన సివంగిని అంటూ అనసూయ చెప్పిన పంచ్ డైలాగ్స్ బాగా పేలాయి. ఇక నటుడు సునీల్ మరో కీలక రోల్ చేస్తున్నారు. ఆయన అనసూయను ఎదిరించే పవర్ ఫుల్ పోలీస్ పాత్ర చేస్తున్నారు. ఈ మధ్య వరుసగా నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలు చేస్తున్న సునీల్(Sunil) దర్జా మూవీలో పాజిటివ్ షేడ్స్ ఉన్న రోల్ చేశాడు. టీజర్ లో సునీల్ ఫైట్స్ గట్రా చూస్తుంటే మరలా హీరో అవతారం ఎత్తాలని చూస్తున్నట్లు ఉంది. దర్జా మూవీ సునీల్, అనసూయ మధ్య నడిచే వార్ లా అనిపిస్తుంది.  మొత్తంగా దర్జా మూవీ టీజర్ ఆసక్తి రేపుతోంది. 

శివశంకర్ పైడిపాటి నిర్మిస్తున్న ఈ చిత్రానికి సలీమ్ మాలిక్ దర్శకత్వం వహిస్తున్నారు. కాగా ఇటీవల విడుదలైన ఖిలాడి చిత్రంలో అనసూయ (Anasuya)అల్ట్రా మోడ్రన్ గర్ల్ రోల్ చేశారు. అలాగే కృష్ణవంశీ రంగమార్తాండతో పాటు అనసూయ మరికొన్ని చిత్రాలలో నటిస్తున్నారు. మరోవైపు టెలివిజన్ వ్యాఖ్యాతగా పలు కార్యక్రమాల్లో కనిపిస్తూ సత్తా చాటుతున్నారు. 

PREV
click me!

Recommended Stories

Balakrishna: వెంకటేష్‌ కోసం తన 50 ఏళ్ల సెంటిమెంట్‌ని పక్కన పెట్టిన బాలయ్య.. చిరు, నాగ్‌ల కోసం ఇలా చేయలేదు
Trisha: త్రిష ఎంగేజ్మెంట్ బ్రేకప్ చేసుకున్న వ్యక్తితో డేటింగ్ చేసిన హీరోయిన్.. అందరి ముందు ఒప్పేసుకుంది