మా ఎలక్షన్స్... ప్రకాష్ రాజ్ వెనకుండి నడిపిస్తున్న ఆ స్టార్ డైరెక్టర్?

Published : Jul 04, 2021, 05:08 PM IST
మా ఎలక్షన్స్... ప్రకాష్ రాజ్ వెనకుండి నడిపిస్తున్న ఆ స్టార్ డైరెక్టర్?

సారాంశం

ఎన్నికలకు రెండు నెలల ముందు నుండే టాలీవుడ్ లో ఎలక్షన్స్ వాతావరణం నెలకొంది. నటుడు ప్రకాష్ రాజ్ మా ఎన్నికల బరిలో దిగనున్నట్లు ప్రకటించడంతో పాటు 27మంది సభ్యులతో కూడిన ప్యానెల్ ప్రకటించారు. 

    
సెప్టెంబర్ లో మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఎన్నికలు జరగనున్నాయి. ప్రస్తుత 'మా' కమిటీ మెంబర్స్ పదవీకాలం ముగియనుండడంతో కొత్త అధ్యక్షుడు ఎన్నిక ప్రక్రియ జరగనుంది. ఇక ఎన్నికలకు రెండు నెలల ముందు నుండే టాలీవుడ్ లో ఎలక్షన్స్ వాతావరణం నెలకొంది. నటుడు ప్రకాష్ రాజ్ మా ఎన్నికల బరిలో దిగనున్నట్లు ప్రకటించడంతో పాటు 27మంది సభ్యులతో కూడిన ప్యానెల్ ప్రకటించారు. 


ఇక ప్రకాష్ రాజ్ కి పోటీగా మంచు విష్ణు, నటి హేమలతో పాటు జీవితా రాజశేఖర్ కంటెస్ట్ చేయనున్నారు. అలాగే తెలంగాణా వాదంతో నటుడు నరసింహారావు పోటీలోకి దూసుకు వచ్చారు. కాగా మెగా ఫ్యామిలీ మద్దతు కూడగట్టిన ప్రకాష్ రాజ్ గట్టిపోటీదారుగా మారారు. ప్రకాష్ రాజ్ కి చిరంజీవి ఆశీస్సులు ఉన్నాయని నటుడు నాగబాబు బహిరంగంగా ప్రకటించిన విషయం తెలిసిందే. 


అలాగే టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ పరోక్షంగా ప్రకాష్ రాజ్ కి మద్దతుగా ఉన్నారట. ఆయన వెనకుండి పూర్తి సహకారం పూరి అందిస్తున్నట్లు టాలీవుడ్ టాక్. చాలా ఏళ్లుగా వీరి మధ్య సన్నిహిత సంబంధాలు ఉన్న నేపథ్యంలో పూరి జగన్నాధ్ ప్రకాష్ రాజ్ అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించాలని కోరుకుంటున్నారట. 


ఇక పూరి తెరకెక్కించిన అనేక చిత్రాలలో ప్రకాష్ రాజ్ కీలక రోల్స్ చేశారు. పూరి కెరీర్ లో బ్లాక్ బస్టర్స్ గా ఉన్న,  బద్రి, ఇడియట్, అమ్మా నాన్న ఓ తమిళ అమ్మాయి, పోకిరి చిత్రాలలో ప్రకాష్ రాజ్ కీలక రోల్స్ చేస్తున్నారు. ఆ అనుబంధం కారణంగా పూరి వర్గం మద్దతు ప్రకాష్ రాజ్ కేనట. 

PREV
click me!

Recommended Stories

Allu Aravind: పవన్‌ కళ్యాణ్‌ వెండితెరకు పరిచయమై 30ఏళ్లు.. అల్లు అరవింద్‌ ఎమోషనల్‌ నోట్‌
Rajinikanth Villain Movies: రజనీకాంత్‌ విలన్‌గా విశ్వరూపం చూపించిన టాప్ 5 మూవీస్‌.. సూపర్‌ స్టార్‌ కావడానికి ముందు