. గత మార్చిలో మెహరీన్, భవ్య బిష్ణోయ్ ల నిశ్చితార్థం జైపూర్ లో అత్యంత ఘనంగా జరిగింది. ఇక పెళ్లే తరువాయి అనుకుంటున్న సమయంలో మెహరీన్ నిశ్చితార్థం రద్దు విషయాన్ని సోషల్ మీడియా ద్వారా అందరితో పంచుకుంది.
మెహరీన్ పెళ్లి ఆగిపోయిన సంగతి తెలిసిందే. అయితే కారణం ఏమిటనేది ఎవరికీ అర్దం కాలేదు. హర్యానా మాజీ సీఎం భజన్ లాల్ మనవడు భవ్య భిష్ణోయ్‌తో నిశ్చితార్థాన్ని రద్దు చేసుకుంటున్నట్టు మెహరీన్ సంచలన ప్రకటన చేయటం కేవలం టాలీవుడ్ ని మాత్రమే కాక సినీ ప్రేమికులను ఆశ్చర్యపరిచింది. ఈ నేపధ్యంలో అసలు ఈ సడెన్ గా ఈ నిర్ణయం తీసుకోవటానికి గల కారణాలు గురించి అందరూ డిస్కస్ చేస్తున్నారు. ఆ క్రమంలో ఓ విషయం బయిటకు వచ్చింది.
వివరాల్లోకి వెళితే.. ఇటీవలే హరియాణా మాజీ ముఖ్యమంత్రి భజన్‌లాల్ మనవడు భవ్య బిష్ణోయ్‌తో మెహరీన్ నిశ్చితార్థం జరిగిన సంగతి తెలిసిందే. కరోనా కారణంగా పెళ్లిని వాయిదా వేసుకున్న ఈ జంట త్వరలో పెళ్లి తేదీ చెబుతారనుకుంటున్న సమయంలో ‘పెళ్లి చేసుకోవడం లేద’ని ప్రకటించారు. ఈ విషయాన్ని మెహరీన్ సోషల్ మీడియా ద్వారా తెలియజేశారు.
‘‘భవ్య బిష్ణోయ్‌తో నా నిశ్చితార్థాన్ని రద్దు చేసుకున్నాను. ఈ నిర్ణయం మేమిద్దరం కలిసి తీసుకున్నాం. మేం పెళ్లి చేసుకోవడం లేదు. ఈ రోజు నుంచి నాకు, భవ్యబిష్ణోయ్, అతడి కుటుంబంతో ఎలాంటి సంబంధం ఉండదు. ప్రతి ఒక్కరూ నా నిర్ణయాన్ని, నా వ్యక్తిగత గోప్యతను గౌరవిస్తారని భావిస్తున్నాను. ప్రస్తుతం నా సినిమాలపై దృష్టిపెట్టాను. అభిమానులను అలరించేలా సినిమాలు చేస్తాను’’ అని చెప్పారు మెహరీన్. అయితే మెహరీన్ ..ఇలాంటి నిర్ణయం తీసుకోవటం వల్ల కారణం సినిమాలపై తనకు ఉన్న అపరితమైన ప్రేమే అంటున్నారు.
వివాహం తర్వాత మెహరీన్ సినిమాల్లో కంటిన్యూ అవుతాను అనటం..అతని కుటుంబానికి నచ్చలేదట. తమ కుటుంబంలో ఓ గృహిణిగా కొనసాగాలి కానీ వివాహం తర్వాత సినిమాలంటే ఇబ్బందిగా ఉంటుందని చెప్పారట. ఆ డిస్కషన్స్ లో మెహరీన్ కి నచ్చ చెప్పే ప్రయత్నాలు జరిగాయట. కానీ చివరకు మెహరీన్ తన కెరీర్ ..వివాహంతో శుభం కార్డ్ పడుతుందని , ఆ పెళ్లే వద్దనుకుందిట.
దాంతో తన ఫోకస్ అంతా ఇకపై సినిమాలపైనా పెడతానంటూ క్లారిటీ ఇస్తూ ట్వీట్ చేసింది మెహ్రీన్. తాను తీసుకున్న నిర్ణయాన్ని గౌరవిస్తారని.. అభిమానుల్ని అలరిస్తారని తెలియజేస్తూ ట్వీట్ చేసింది మెహరీన్. ప్రస్తుతం ఎఫ్ 2 సీక్వెల్ ఎఫ్ 3లో నటిస్తున్న మెహ్రీన్ అంతకుముందు ‘కృష్ణగాడి వీరప్రేమ గాథ’, ‘మహానుభావుడు’, ‘రాజా ది గ్రేట్’, వంటి చిత్రాల్లో నటించింది.