విష్ణు- ప్రకాష్ రాజ్ చాట్: అంకుల్ మీ ఐడియాలు నాకు కావాలి!

Published : Oct 11, 2021, 03:30 PM ISTUpdated : Oct 11, 2021, 03:36 PM IST
విష్ణు- ప్రకాష్ రాజ్ చాట్: అంకుల్ మీ ఐడియాలు నాకు కావాలి!

సారాంశం

నిన్న మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఎన్నికలు ముగిశాయి. హోరాహోరీగా జరిగిన పోరులో ప్రకాష్ రాజ్ పై మంచు విష్ణు 107 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. 

మా అధ్యక్షుడిగా ఎన్నికైన మంచు విష్ణు సోషల్ మీడియా వేదికగా ఓ ఆసక్తికర పోస్ట్ చేశారు.అధ్యక్ష పదవి కోసం తనతో పోటీపడ్డ ప్రకాష్ రాజ్ ఆయనకు వాట్సప్ సందేశం పంపగా.. మంచు విష్ణు రిప్లై ఇచ్చారు. నిన్న మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఎన్నికలు ముగిశాయి. హోరాహోరీగా జరిగిన పోరులో ప్రకాష్ రాజ్ పై మంచు విష్ణు 107 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. 

ఈ నేపథ్యంలో Manchu vishnu కు శుభాకాంక్షలు చెబుతూ... ప్రకాష్ రాజ్ వాట్సాప్ సందేశం పంపారు... 'డియర్ విష్ణు మా ఎన్నికలలో ఘనమైన విజయం సాధించిన నీకు శుభాకాంక్షలు. 'మా'ను విజయవంతంగా నడపగల శక్తిసామర్ధ్యాలు నీకు ఆ దేవుడు ప్రసాదించాలని, మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే నేను మా సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నాను. నా రాజీనామా అంగీకరించాలని కోరుకుంటున్నాను. సభ్యత్వం లేకున్నా నా సహాయసహకారాలు నీకు ఎప్పుడూ ఉంటాయి..' అని సందేశం పంపారు. 

Prakash raj సందేశానికి మంచు విష్ణు ఈ విధంగా రిప్లై ఇచ్చారు. 'డియర్ అంకుల్ ధన్యవాదాలు.. అయితే మీ నిర్ణయం నన్ను బాధకు గురిచేస్తుంది. మీరు నాకంటే పెద్దవారు. గెలుపు ఓటములు ఓ నాణానికి ఉండే బొమ్మ బొరుసు లాంటివి. పోటీలో  ఒకరు గెలవడం, మరొకరు ఓడడం అనేది సాధారణం. మీరు బాధపడకండి, మీరు ఎప్పుడూ మా లో భాగమే. మీ ఐడియాలు మాకు కావాలి, అలాగే మనం ఇద్దరం కలిసి పనిచేద్దాం. నా సందేశానికి మీరు రిప్లై ఇవ్వకండి. త్వరలోనే నేను మిమ్ముల్ని కలుస్తాను. మనం అనేక విషయాలు చర్చించుకుందాం.. ఐ లవ్ యు అంకుల్...' అంటూ విష్ణు ముగించారు. 

Also read MAA elections ప్రకాష్ రాజ్ ప్యానెల్ నుండి అనసూయ, సుడిగాలి సుధీర్ ఓటమి

ఈ చాట్ స్క్రీన్ షాట్ మంచు విష్ణు తన ట్విట్టర్ లో పోస్ట్ చేయడం జరిగింది. ఎన్నికల ముందు వరకు ఎన్ని ఆరోపణలు చేసుకున్నా... ఫలితాలు వచ్చాక ఇద్దరి మధ్య సానుకూల వాతావరణం ఏర్పడిందని పరిస్థితులను బట్టి అర్థం అవుతుంది. మోహన్ బాబు సైతం ఎవరూ కూడా మీడియా ముందుకు వచ్చి ఆరోపణలు చేయవద్దని, గొడవలు ముగిసిన అధ్యాయం... మంచు విష్ణుకు అందరి సప్పోర్ట్ కావాలని కోరుకున్నారు. 

Also read బ్రేకింగ్... మా సభ్యత్వానికి ప్రకాష్ రాజ్ రాజీనామా... టాలీవుడ్ కి నేను అతిథిగానే ఉంటాను

కొద్దిసేపటి క్రితం మీడియాతో మాట్లాడిన ప్రకాష్ రాజ్ తాను మా ప్రాధమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. తెలుగు వాడిని కాదన్న ఒక్క కారణంతో మా సభ్యులు ఓడించారని, ఇలాంటి అజెండా ఉన్న మా లో సభ్యునిగా ఉండలేనని ఆవేదన వ్యక్తం చేశారు. మా లో సభ్యుడిని కాకున్నా, టాలీవుడ్ తో తన అనుబంధం కొనసాగుతుందని, తెలుగు సినిమాలలో నటిస్తాను అన్నారు. అసలు కథ ముందు ఉంది... ఇది ఇంతటితో ముగియలేదని.. ప్రకాష్ రాజ్ చెప్పడం కొసమెరుపు. 
 

PREV
click me!

Recommended Stories

Akhanda 2 Review: 'అఖండ 2' మూవీ రివ్యూ, రేటింగ్.. బాలకృష్ణ తాండవం ఎలా ఉందో తెలుసా ?
సపోర్ట్ చేసినందుకు వెన్నుపోటు పొడిచిన కళ్యాణ్, మనస్తాపానికి గురైన భరణి.. తనూజ ఏడుపు ఫేక్ అంటూ ముఖం మీదే