సినిమా వాళ్ళ ఇళ్లల్లో పెళ్లి, విడాకులు అయితే.. కొన్ని కాకులు అంటూ విరుచుకుపడ్డ యాంకర్ ఝాన్సీ

pratap reddy   | Asianet News
Published : Oct 11, 2021, 01:22 PM ISTUpdated : Oct 11, 2021, 01:26 PM IST
సినిమా వాళ్ళ ఇళ్లల్లో పెళ్లి, విడాకులు అయితే.. కొన్ని కాకులు అంటూ విరుచుకుపడ్డ యాంకర్ ఝాన్సీ

సారాంశం

చిత్ర పరిశ్రమకు ఎప్పుడూ మీడియా తలనొప్పిగానే ఉంటుంది. సెలెబ్రిటీలుగా ఉన్నప్పుడు కొన్ని విషయాలు ప్రజలకు తెలియకుండా ఉండవు. మీడియా ద్వారా సమాచారం వెళుతుంది.

చిత్ర పరిశ్రమకు ఎప్పుడూ మీడియా తలనొప్పిగానే ఉంటుంది. సెలెబ్రిటీలుగా ఉన్నప్పుడు కొన్ని విషయాలు ప్రజలకు తెలియకుండా ఉండవు. మీడియా ద్వారా సమాచారం వెళుతుంది. కానీ ఇటీవల మీడియా పోకడ ఎక్కువైందనే విమర్శని సినీ ప్రముఖులు లేవనెత్తుతున్నారు. సినిమా వాళ్లకు కూడా వ్యక్తిగత జీవితం ఉంటుంది. తమ పర్సనల్ లైఫ్ తమ ఇళ్ళకి మాత్రమే పరిమితం కావాలని కోరుకునే సెలెబ్రిటీలు ఉంటారు. కానీ ఇటీవల సినీ ప్రముఖుల వ్యక్తిగత జీవితాల గురించి మీడియా ఫోకస్ ఎక్కువైంది. 

చిత్ర పరిశ్రమలో ఏం జరిగినా మీడియాలో పెద్ద న్యూస్ గా ప్రొజెక్ట్ అవుతోంది. దీనిపై నటి, యాంకర్ ఝాన్సీ సంచలన వ్యాఖ్యలు చేశారు. మీడియాని కాకులతో పోల్చుతూ సంచలన వ్యాఖ్యలు చేసింది. ఇటీవల ఇండస్ట్రీలో జరిగిన సంఘటనలపై మీడియా చేసిన హడావిడిని ఎత్తిపొడుస్తూ ఝాన్సీ ఈ వ్యాఖ్యలు చేసింది. 

'అనగనగా ఓ ఎద్దు.. ఆ ఎద్దుకో పుండు.. ఆ పండులో పురుగులు.. ఎద్దు పుండు కాకికి ముద్దు.. కబుర్లు చెప్పాల్సిన కాకులు పొడిచి పొడిచి పురుగులు తింటూ పుండు పెద్దది చేశాయి. ఎద్దు బుసలు కొట్టి రెచ్చిపోయింది. కాకులు గోల పెంచాయి. మైకులు పెట్టి మరీ మా మురికి గొట్టాలని జనాల ఇళ్లలోకి వదలడం మించి ముఖ్యమైన వార్తలు లేవా? సినిమా ఇంట్లో పెళ్లి అయినా, విడాకులు అయినా, ఎన్నికల అయినా లోకులకు సందడి అనుకుని హడావిడి చేస్తున్న కాకుల్లారా… ప్రజా ప్రయోజనం అంటే ఏంటో డిక్షనరీలో చూడండి' అంటూ ఝాన్సీ మీడియాపై రెచ్చిపోయారు. 

 

ఆమె సోషల్ మీడియాలో పెట్టిన ఈ పోస్ట్ ఇటీవల టాలీవుడ్ లో జరిగిన సంఘటనలను ప్రతిబింబించే విధంగా ఉన్నాయి. ఝాన్సీ పోస్ట్ గమనిస్తే.. పవన్ కళ్యాణ్, మా ఎన్నికలు, ఓ నటి పర్సనల్ లైఫ్ ఇలా అనేక గుర్తుకు వస్తాయి. 

Also Read: ఏరికోరి ఎంచుకున్న ప్రకాష్ రాజ్.. చేతులు కాల్చుకున్న అనసూయ, సుధీర్.. నెక్స్ట్ ఏంటి ?

PREV
click me!

Recommended Stories

Akhanda 2 Review: 'అఖండ 2' మూవీ రివ్యూ, రేటింగ్.. బాలకృష్ణ తాండవం ఎలా ఉందో తెలుసా ?
సపోర్ట్ చేసినందుకు వెన్నుపోటు పొడిచిన కళ్యాణ్, మనస్తాపానికి గురైన భరణి.. తనూజ ఏడుపు ఫేక్ అంటూ ముఖం మీదే