తెలుగు మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ కి తెలుగువాడే అధ్యక్షుడు కావాలి... నటుడు రవిబాబు కీలక వ్యాఖ్యలు

Published : Oct 06, 2021, 03:50 PM ISTUpdated : Oct 06, 2021, 04:00 PM IST
తెలుగు మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ కి తెలుగువాడే అధ్యక్షుడు కావాలి... నటుడు రవిబాబు కీలక వ్యాఖ్యలు

సారాంశం

నేను లోకల్ నాన్ లోకల్ కార్ట్ ఉపయోగించడం లేదు అంటూనే, Prakash raj పై రవిబాబు సంచలన కామెంట్స్ చేశారు. ప్రకాష్ రాజ్ గౌరవంగా సినిమాలు చేసుకోకుండా, ఎన్నికలలో నిలబడం ఎందుకు అన్నారు.


ఎన్నికలు దగ్గర పడే కొద్దీ టాలీవుడ్ లో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. మా సభ్యులుగా ఉన్న కొందరు నటులు ఓపెన్ గా తమ అభిప్రాయం వెల్లడిస్తున్నారు. నటుడు, దర్శకుడు రవిబాబు పోటీలో ఉన్న ఇద్దరు వ్యక్తులలో ఎవరికి ఓటు వేయాలనే విషయంపై కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన ముఖ్యంగా మనవాడు, తెలుగువాడికే ఓటు వేయాలని కుండబద్దలు కొట్టారు. 

నేను లోకల్ నాన్ లోకల్ కార్ట్ ఉపయోగించడం లేదు అంటూనే, Prakash raj పై ఆయన సంచలన కామెంట్స్ చేశారు. ప్రకాష్ రాజ్ గౌరవంగా సినిమాలు చేసుకోకుండా, ఎన్నికలలో నిలబడం ఎందుకు అన్నారు. పోటీలో నిలబడడం ద్వారా ప్రకాష్ రాజ్ నాన్ లోకల్ అని ఎందుకు అనిపించుకోవాలి, నేనే ప్రకాష్ రాజ్ అయితే ఎన్నికలలో పోటీ చేయను అన్నారు రవిబాబు.

ఇక మోహన్ బాబు ఫ్యామిలీని Ravibabu ఆకాశానికి ఎత్తారు. అరవై సినిమాలకు పైగా నిర్మించిన మంచు ఫ్యామిలీ అనేక మందికి ఉపాధి కల్పించారు. ఏళ్లుగా కొంత మంది విద్యార్థులకు ఉచిత విద్య అందిస్తున్నారు. సేవా దృక్పథం ఉన్న కుటుంబం. మోహన్ బాబు వారసుడిగా వస్తున్న మంచు విష్ణు ఖచ్చితంగా మంచి చేస్తాడన్న నమ్మకం ఉందని రవిబాబు విశ్వాసం వ్యక్తం చేశారు. 

Alsro Read పోస్టల్ బ్యాలెట్ దుర్వినియోగం అవుతుంది.. విష్ణు ప్యానెల్ పై ఎన్నికల అధికారికి ప్రకాష్ రాజ్ ఫిర్యాదు


MAA elections లో తెలుగువారినే ఎందుకు ఎన్నుకోవాలో ఆయన కొన్ని కారణాలు చెప్పారు. తెలుగువాడిని ఎన్నుకోవడం మనకు కంఫర్ట్ గా ఉంటుంది అన్నారు. తెలుగు పరిశ్రమలో మొదట తెలుగువాళ్ళకే అవకాశాలు ఇవ్వాలని రవిబాబు గట్టిగా డిమాండ్ చేశారు. ఎక్కువ డబ్బులు ఇచ్చి ఎందుకు బయట నటులను తీసుకోవాలి, మనవాళ్లకు ఎందుకు అవకాశం ఇవ్వరు. మన వాళ్లకు టాలెంట్ లేదా? మనవాళ్లను మనం ఎంకరేజ్ చేసుకోకపోతే, బయట వాళ్ళు ఎలా చేస్తారు అన్నారు. తాను తెరకెక్కించిన సినిమాల్లో అనేక మంది తెలుగు నటులకు అవకాశాలు ఇచ్చానని రవిబాబు ధీమా వ్యక్తం చేశారు. ముఖ్యంగా తెలుగు మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ కి తెలుగువాడే అధ్యక్షుడిగా ఉండాలి, అంటూ ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. 

Also Read ‘‘ మా ’’ ఎన్నికల్లో కొత్త ట్విస్ట్: నరేశ్, కరాటే కల్యాణీలపై హేమ సంచలన ఆరోపణలు, ఎన్నికల అధికారికి ఫిర్యాదు

PREV
click me!

Recommended Stories

Ustaad Bhagat Singh: ఊపేసేలా ఉన్న `దేఖ్‌ లేంగే సాలా` పాట.. మళ్లీ ఆ రోజులను గుర్తు చేసిన పవన్‌ కళ్యాణ్‌
అడివి శేష్ గూఢచారి 2 తో పాటు బోల్డ్ హీరోయిన్ నుంచి రాబోతున్న 5 సినిమాలు ఇవే