ధోనీ, సాక్షిలతో రామ్‌చరణ్‌, ఉపాసన సరదా ముచ్చట్లు.. అరుదైన వీడియో వైరల్‌..

Published : Mar 03, 2024, 09:47 AM IST
ధోనీ, సాక్షిలతో రామ్‌చరణ్‌, ఉపాసన సరదా ముచ్చట్లు.. అరుదైన వీడియో వైరల్‌..

సారాంశం

రామ్‌చరణ్‌, ఉపాసన అనంత్‌ అంబానీ ప్రీ వెడ్డింగ్‌ పార్టీలో సందడి చేశారు. ఇందులో క్రికెటర్‌ ఎంఎస్‌ ధోనీ, ఆయన భార్య సాక్షి ధోనీలను కలవడం వైరల్‌గా మారింది. 

టీమిండియా మాజీ కెప్టెన్‌ ఎంఎస్‌ ధోనీ, సాక్షిలతో మెగాపవర్‌ స్టార్‌ రామ్‌చరణ్‌, ఉపాసన జంట కలిసి సందడి చేయడం ఆకట్టుకుంటుంది. నెటిజన్లని మంత్రముగ్దుల్ని చేస్తుంది. ఇండియన్‌ ఫ్యాన్స్ ని అలరిస్తుంది. ఈ ఇద్దరు జంటల కలయికకి అంబాని ఇంటి పెళ్లి సందడి వేదిక కావడం విశేషం. 

ఇండియన్‌ కుభేరుడు ముఖేష్‌ అంబానీ కుమారుడు అనంత్‌ అంబానీ రెండు రోజుల క్రితం ప్రీ వెడ్డింగ్‌ వేడుక చాలా గ్రాండ్‌గా నిర్వహించారు. దీనికి బాలీవుడ్‌ మొత్తం కదిలి వచ్చింది. బాలీవుడ్‌ దిగ్గజాలు సల్మాన్‌, అమీర్‌, షారూఖ్‌లతోపాటు అనేక మంది సెలబ్రిటీలు పాల్గొన్నారు. డాన్సులతో సందడి చేశారు. అదే సమయంలో మనీ ప్రభావం ఎంతగా ఉంటుందనే దానికి ఇది నిదర్శనంగా నిలుస్తుంది. 

ఇందులో తెలుగు నుంచి రామ్‌చరణ్‌ జంట మాత్రమే పాల్గొంది. మిగిలిన వారికి ఆహ్వానం లేదా? లేక ఉండి వెళ్లలేదా  అనేది క్లారిటీ లేదు, కానీ కేవలం రామ్‌చరణ్‌ మాత్రమే వెళ్లారు. ఈ సందర్భంగా ఎంఎస్‌ ధోనీ జంటని, రామ్‌చరణ్‌ జంట కలవడం విశేషం. ఓ హోటల్‌ లో వీరంతా కలుసుకున్నారు. సరదాగా మాట్లాడుకున్నారు. ఈ సందర్భంగా హోటల్‌ నుంచి బయటకు వస్తున్న సమయంలో తీసిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్‌ అవుతుంది. 

ఇందులో రామ్‌చరణ్‌ జంట, ధోనీ జంట ఎంతో చూడ ముచ్చటగా ఉన్నారు. సందడిగా కనిపించారు. వీడియో వైరల్‌గా మారింది. ఫ్యాన్స్ ని ఖుషి చేస్తుంది. ధోనీ అంతర్జాతీయ వన్డేలకు రిటైర్ మెంట్‌ని ప్రకటించిన విషయం తెలిసిందే. ఆయన ఐపీఎల్‌లో సందడి చేస్తున్నారు. మరోవైపు రామ్‌చరణ్‌ ప్రస్తుతం `గేమ్‌ ఛేంజర్‌`లో నటిస్తున్నారు. శంకర్‌ దర్శకత్వం వహిస్తున్నారు. దీంతోపాటు `ఆర్‌సీ16`లో నటించబోతున్నారు. 

read more: ప్రభాస్, మహేష్, ఎన్టీఆర్ , చరణ్ స్టార్ హీరోల ఫస్ట్ రెమ్యునరేషన్ ఎంతో తెలుసా..?
 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Articles on
click me!

Recommended Stories

Akhanda 2 New Date: అఖండ 2 మూవీ కొత్త రిలీజ్‌ డేట్‌.. బాలయ్య ఊహించని సర్‌ప్రైజ్‌, ఈ సినిమాలకు పెద్ద దెబ్బ
Venkatesh: `నువ్వు నాకు నచ్చావ్‌` మూవీతో పోటీ పడి చిత్తైపోయిన నాగార్జున, మోహన్‌ బాబు చిత్రాలివే