
శ్రీలీల టాలీవుడ్ టాప్ యాక్ట్రెస్ లో ఒకరు. ఈ కన్నడ భామ పెళ్ళిసందD చిత్రంతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది. పెళ్ళిసందడి పెద్దగా ఆడకున్నప్పటికీ శ్రీలీల గ్లామర్, డాన్సులు హైలెట్ అయ్యాయి. దాంతో ఆమెకు ఆఫర్స్ క్యూ కట్టాయి. గత రెండేళ్లలో శ్రీలీల అరడజను చిత్రాల్లో నటించింది. రవితేజకు జంటగా ధమాకా చేసింది. ఈ మూవీ సూపర్ హిట్. అలాగే స్కంద, ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్, భగవంత్ కేసరి, ఆదికేశవ చిత్రాల్లో శ్రీలీల నటించడం విశేషం.
ఇక మహేష్ బాబు సంక్రాంతి చిత్రం గుంటూరు కారం లో గ్లామరస్ రోల్ చేసి ఆకట్టుకుంది. కుర్చీ మడత పెట్టి సాంగ్ లో శ్రీలీల ఎనర్జీ గురించి ఎంత చెప్పినా తక్కువే. శ్రీలీల చేసిన పాత్రల రీత్యా ఆమె పేరు చెబితే మాస్ డాన్సులు, గ్లామర్ రోల్స్ గుర్తుకు వస్తాయి. కానీ శ్రీలీల ప్రొఫెషనల్ క్లాసికల్ డాన్సర్. బాల్యం నుండే నృత్యం నేర్చుకుంది. అనేక వేదికలపై ప్రదర్శనలు ఇచ్చింది.
తాజాగా హైదరాబాద్ లో సమతా కుంభ్ కార్యక్రమం జరిగింది. ఇందులో పాల్గొన్న శ్రీలీల అద్భుతమైన పెర్ఫార్మన్స్ ఇచ్చింది. ఆమె గోదా దేవి అవతారంలో భరతనాట్యం చేసింది. ఆమె హావభావాలు, భంగిమలు వీక్షకులను అలరించాయి. శ్రీలీల క్లాసికల్ డాన్స్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. శ్రీలీల టాలెంట్ చూసిన ఆమె ఫ్యాన్స్ పొగడకుండా ఉండలేకున్నారు.
కాగా శ్రీలీల చేతిలో ఉస్తాద్ భగత్ సింగ్ ఉంది. పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న ఈ ప్రాజెక్ట్ అనివార్య కారణాలతో ఆగింది. దీంతో దర్శకుడు హరీష్ శంకర్ మిస్టర్ బచ్చన్ టైటిల్ తో రవితేజ మూవీ స్టార్ట్ చేశాడు. ఏపీలో ఎన్నికలు ముగిశాక ఉస్తాద్ భగత్ సింగ్ పట్టాలెక్కనుంది. శ్రీలీల నూతన ప్రాజెక్ట్స్ ఏమీ ప్రకటించలేదు.