`లస్ట్ స్టోరీస్‌ 2` ట్రైలర్‌.. మొత్తం శృంగారం చుట్టే.. పెళ్లికి ముందే టెస్ట్ డ్రైవ్‌.. వామ్మో అరాచకం..

Published : Jun 21, 2023, 05:00 PM IST
`లస్ట్ స్టోరీస్‌ 2` ట్రైలర్‌.. మొత్తం శృంగారం చుట్టే.. పెళ్లికి ముందే టెస్ట్ డ్రైవ్‌.. వామ్మో అరాచకం..

సారాంశం

హిందీలో వచ్చిన వెబ్‌ సిరీస్‌ `లస్ట్‌ స్టోరీస్‌` విశేష ఆదరణ పొందడంతో దానికి రెండో భాగం రూపొందించారు. `లస్ట్ స్టోరీస్‌ 2` త్వరలో స్ట్రీమింగ్‌ కానుంది. తాజాగా ట్రైలర్‌ రిలీజ్‌ అయ్యింది.

హిందీలో ఐదేళ్ల క్రితం అడల్ట్ కంటెంట్‌తో వచ్చిన `లస్ట్ స్టోరీస్‌` ఓటీటీలో మంచి ఆదరణ పొందింది. అడల్ట్ కంటెంట్‌ అయినప్పటికీ ఆడియెన్స్ ఎగబడి చూశారు. మహిళలు తమ కోరికలను తీర్చుకోవడం కోసం ఏం చేశారనే అంశంతో ఈ `లస్ట్ స్టోరీస్‌` తెరకెక్కింది. మొదటి భాగానికి మంచి ఆదరణ రావడంతో ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ ఫ్లిక్స్ ఇప్పుడు రెండో సిరీస్‌ని తీసుకొచ్చింది. ఇందులో తమన్నా, మృణాల్‌ ఠాకూర్‌, కాజోల్‌, విజయ్‌ వర్మతోపాటు నీనా గుప్తా, అంగద్‌ బేడీ, అమృత సుభాష్‌ ముఖ్య పాత్రలు పోషించారు. 

అమిత్‌ రవీంద్రనాథ్‌ శర్మ, కొంకణా సేన్‌ వర్మ, ఆర్‌ బాల్కి, సుజోయ్‌ ఘోష్‌లు దర్శకత్వం వహించారు. నాలుగు కథలకు నలుగురు దర్శకత్వం వహించారు. తాజాగా ఈ చిత్ర ట్రైలర్‌ విడుదలైంది. ఇదంతా శృంగారం చుట్టే తిరిగడం గమనార్హం. నాలుగు కథల్లోనూ కామన్‌ పాయింట్‌ సెక్స్. అక్క వేరే వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకోవడం, కాజోల్‌ భర్త పని మనిషిపై మోజు పడటం, సింగిల్‌ గా ఉండే తమన్నా పెళ్లైన వ్యక్తితో రిలేషన్‌షిప్‌కి రెడీ కావడం, మృణాల్‌ ఠాకూర్‌ని తన బామ్మ పెళ్లికి ముందే టెస్ట్ డ్రైవ్‌కి వెళ్లమని చెప్పడం వంటి అంశాలతో ఈ ట్రైలర్‌ సాగింది. తమ సెక్స్ కోరికలను తీర్చుకోవడానికి మహిళలు ఏం చేశారనే కథతో ఈ నాలుగు కథలు సాగుతున్నట్టుగా ట్రైలర్‌ చూస్తే అర్థమవుతుంది. 

ఇందులో చాలా వరకు బాలీవుడ్‌ నటులు నటించారు. కానీ టాలీవుడ్‌లో పాపులర్‌ అయిన మిల్కీ బ్యూటీ తమన్నా, అలాగే ఇటీవల `సీతారామం`లో సీతగా ఆకట్టుకున్న మృణాల్‌ ఠాకూర్‌ ఇందులో నటించడం ఆశ్చర్యపరుస్తుంది. పైగా వాళ్లు బోల్డ్ గా ఉండటం, రొమాంటిక్‌ సీన్లకు సిద్ధపడటం తెలుగు అభిమానులు జీర్ణించుకోలేని విధంగా ఉంది. ఇటీవల `జీ కర్దా`లో తమన్నా బోల్డ్ సీన్లు చేసి ఆశ్చర్యపరిచింది. దీంతో ఇందులోనూ నటించడంలో పెద్ద ఆశ్చర్యం లేదు, కానీ ఆమెని ఇలా చూడటమే ఫ్యాన్స్ తట్టుకోలేకపోతున్నారు. 

మొత్తంగా అడల్ట్ కంటెంట్‌తో రూపొందిన `లస్ట్ స్టోరీస్‌ 2` ఈ నెల 29న నెట్‌ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్‌ కానుంది. మొదటి భాగానికి మంచి ఆదరణ రావడం, వివాదాస్పదంగా అది మరింత పాపులర్‌ కావడంతో ఇప్పుడు రెండో సిరీస్‌పై అందరిలోనూ ఆసక్తి నెలకొంది. మరి ఇది ఎలా ఉండబోతుంది, దీనికి ఎలాంటి ఆదరణ దక్కుతుందో చూడాలి. 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories

Missterious Review: 'మిస్‌టీరియస్' మూవీ రివ్యూ.. ట్రైయాంగిల్ లవ్ స్టోరీలో మిస్టరీ ఆకట్టుకుందా, తేలిపోయిందా ?
అఖండ-2లో బాలయ్య కూతురిగా ఫస్ట్ ఛాయస్ స్టార్ హీరో కూతురట.. ఆమె ఎవరో తెలుసా.?