దుల్కర్ సల్మాన్ మరో తెలుగు సినిమాతో తెలుగు ఆడియెన్స్ ముందుకు రాబోతున్నారు. `లక్కీ భాస్కర్` చిత్రంలో నటిస్తున్నారు. రంజాన్ సందర్భంగా ఈ మూవీ టీజర్ విడుదలైంది.
మలయాళ స్టార్‌హీరో దుల్కర్ సల్మాన్ తెలుగు హీరో అయిపోయాడు. `మహానటి` తో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చిన ఆయన నెమ్మదిగా ఇక్కడ పాగా వేస్తున్నాడు. మార్కెట్ పెంచుకుంటున్నాడు. `సీతారామం`తో తెలుగు ఆడియెన్స్ కి మరింత దగ్గరయ్యాడు. ఇప్పుడు మరో తెలుగు స్ట్రెయిట్ మూవీతో వస్తున్నారు. తాజాగా ఆయన `లక్కీ భాస్కర్` అనే చిత్రంలో నటిస్తున్నారు. వెంకీ అట్లూరి దర్శకత్వం వహిస్తు్న మూవీ ఇది.
తాజాగా ఈ చిత్ర టీజర్ విడుదలైంది. పీరియాడికల్ యాక్షన్ డ్రామాగా ఈ చిత్రం తెరకెక్కుతుంది. డబ్బు ప్రధానంగా సాగుతుంది. సంపన్నులకు, మధ్యతరగతి వాడికి మధ్య పోరాటం ప్రధానంగా సినిమా సాగుతుందని తెలుస్తుంది. తాజాగా విడుదలైన టీజర్‌లో.. దుల్కర్ క్యాషియర్‌గా కనిపిస్తున్నారు. ఆయన అకౌంట్‌లో కోట్లల్లో డబ్బు వస్తుంది. అది ఎలా సాధ్యం, ఎక్కడి నుంచి వచ్చిందనేది పెద్ద సస్పెన్స్ గా మారుతుంది. దుల్కర్ సల్మాన్ కేవలం క్యాషియరేనా? ఆయనకు మరో ప్రపంచం ఏదైనా ఉందా అనే అనుమానాలను కలిగించేలా టీజర్ సాగింది.
ఇక ఇందులో మధ్యతరగతి జనాల మనస్థత్వాలను, డబ్బుని వాళ్లు ఖర్చుచేసే విధానాన్ని దుల్కర్ ఇందులో చెప్పాడు. మిడిల్‌క్లాస్ మెంటాల్టీ సార్, మేమింతే, కష్టం వస్తే ఖర్చులు తగ్గించుకుని, రూపాయి రూపాయి దాచుకుని, అదే పంతం వస్తే, ఒక్క రూపాయి కూడా మిగిల్చకుండా ఖర్చు పెట్టేస్తాం సర్` అంటూనే చివర్లో ఎక్కడి నుంచి మొదలు పెడదాం అంటూ దుల్కర్ సల్మాన్ చెప్పే డైలాగ్ అదరిపోయేలా ఉంది. అయితే ఆయన చెప్పే మాటలకు, చేసే పనులు భిన్నంగా ఉన్నాయి. పెద్ద స్కామ్ ఏదో జరుగుతుందా? అన్నట్టుగా టీజర్ చూస్తుంటే అర్థమవుతుంది.
మొత్తంగా ఇంట్రెస్టింగ్‌గా, ఎంగేజింగ్‌గా ఉంది. సినిమాపై ఆసక్తిని పెంచింది. దర్శకుడు వెంకీ అట్లూరి తనలోని మరో యాంగిల్‌ని చూపించబోతున్నారు అర్థమవుతుంది. ఇక ఈ చిత్రంలో మీనాక్షిచౌదరి హీరోయిన్‌గా నటిస్తుంది. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్‌ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శ్రీకర స్టూడియోస్ ఈ చిత్రాన్ని సమర్పిస్తోంది. విమర్శకుల ప్రశంసలతో పాటు, ప్రేక్షకుల మెప్పు పొందిన 'సార్/వాతి' వంటి ఘన విజయం తర్వాత దర్శకుడు వెంకీ అట్లూరి ఈ ప్రొడక్షన్స్ తో కలిసి పనిచేయడం విశేషం. పాన్ ఇండియా మూవీగా దీన్ని తెరకెక్కిస్తున్నారు.జూన్‌లో విడుదల చేయబోతున్నట్టు వెల్లడించారు.