నిశ్చితార్దం రోజునే కారు యాక్సిడెంట్, నటుడు మృతి

Published : Apr 11, 2024, 04:24 PM IST
 నిశ్చితార్దం  రోజునే కారు యాక్సిడెంట్, నటుడు మృతి

సారాంశం

తీవ్రమైన గాయాలతో అక్కడకి దగ్గరలో ఉన్న హాస్పటిల్ కు తీసుకెళ్లారు. అయితే అప్పటికే మరణించారని డాక్టర్లు నిర్దారించారు. 

మృత్యువు ఏ క్షణాన ఎవరిని పలకరిస్తుందో తెలియదు. అయితే జీవితంలో మధుర క్షణాలు వచ్చేటప్పుడు పలకరిస్తేనే మరింత బాథ కలుగుతుంది. ఏదో కవి చెప్పినట్లు ఏ నిముషానికి ఏమి జరుగునో అన్నట్లు ఆ నటుడు వివాహ నిశ్చితార్దం ఆ రోజే. అయితే ఆ రోజే అతని ఆఖరి ఘడియలు కూడా సమీపించాయి. ఆ నటుడు పేరు సూరజ్. ఛత్తీస్ ఘర్ కు చెందిన ఈ నటుడు అక్కడ సినిమాల్లో విలన్ గా చేస్తూంటారు. 

తెల్లారితే ఒరిస్సాలో వివాహ నిశ్చితార్దం. ఆ రోజు రాత్రి  'Aakhri Faisla'అనే సినిమాలో నటించి ఇంటికి వెళ్తూండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. అందుతున్న సమాచారం మేరకు ఓ పికప్ ట్రక్ అతని కారుని గుద్దేసింది. బిలాస్ పూర్ దగ్గర అనుకోకుండా జరిగిన ప్రమాదం ఇది. తీవ్రమైన గాయాలతో అక్కడకి దగ్గరలో ఉన్న హాస్పటిల్ కు తీసుకెళ్లారు. అయితే అప్పటికే మరణించారని డాక్టర్లు నిర్దారించారు. 

 సూరజ్ కు నలభై సంవత్సరాలు.  ఆయన అసలు పేరు సూరజ్ మెహర్. గత కొన్నేళ్లుగా ఛత్తీస్ ఘర్ సినీ పరిశ్రమలో నెగిటివ్ పాత్రలు పోషిస్తున్నారు. అక్కడ అతనికి మంచి పేరే ఉంది. అతను కెరీర్ లో ఇప్పుడు మంచి పీక్ లో ఉన్నారు. వరస ఆఫర్ లు ఉన్న ఈ సమయంలో ఇలా జరగటం బాధాకరమని అక్కడ సినీ పరిశ్రమ పెద్దలు సంతాప సందేశంలో తెలియచేస్తున్నారు. 

PREV
click me!

Recommended Stories

Emmanuel: కట్టే కాలే వరకు ఎంటర్‌టైన్‌ చేస్తా.. బిగ్‌ బాస్‌ మాటలకు ఇమ్మాన్యుయెల్‌ కన్నీటి పర్యంతం
Yogibabu బ్రహ్మానందం కలిసి వస్తే.. నవ్వులు సునామీ వచ్చేది ఎప్పుడంటే?