`వార్‌ 2` సెట్‌లోకి ఎన్టీఆర్‌ ఎంట్రీ.. నయా లుక్‌ అదిరింది.. హృతిక్‌తో భీకర పోరాటం..

Published : Apr 11, 2024, 05:07 PM IST
`వార్‌ 2` సెట్‌లోకి ఎన్టీఆర్‌ ఎంట్రీ.. నయా లుక్‌ అదిరింది.. హృతిక్‌తో భీకర పోరాటం..

సారాంశం

ఎన్టీఆర్‌.. బాలీవుడ్‌లోకి అడుగుపెడుతూ `వార్‌ 2` చిత్రంలో నటించనున్నారు. తాజాగా ఈ మూవీ సెట్‌లోకి అడుగుపెట్టారు తారక్‌. `వార్‌ 2` సెట్‌లో హల్‌చల్‌ చేశారు.

ఎన్టీఆర్‌.. బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తూ `వార్‌ 2` సినిమాలో నటిస్తున్నారు. హృతిక్‌ రోషన్‌ హీరోగా తెరకెక్కుతున్న చిత్రమిది. అయాన్‌ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్నారు. యష్‌ రాజ్‌ ఫిల్మ్స్ స్పై యూనివర్స్ లో భాగంగా ఈ మూవీ రూపొందుతుంది. ఇటీవలే ఈ మూవీ చిత్రీకరణ ప్రారంభమైంది. హృతిక్‌పై కొన్ని సన్నివేశాలు చిత్రీకరించారు. ఇప్పుడు ఈ మూవీ సెట్‌లోకి ఎన్టీఆర్‌ అడుగుపెట్టాడు. గురువారం తారక్‌ ముంబయిలోకి చేరుకుని డైరెక్ట్‌ గా షూటింగ్‌ సెట్‌లోకి అడుగుపెట్టాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన పిక్స్, వీడియో క్లిప్స్ సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. 

స్కై బ్లూ షర్ట్, జీన్స్ లో ఉన్నారు ఎన్టీఆర్‌. తలపై క్యాప్‌ ధరించారు. స్టయిల్‌గా కెమెరాకి పోజులిచ్చారు. తారక్‌ కోసం బాలీవుడ్‌ మీడియా ఎగబడింది. ఆయన్ని కెమెరాల్లో బంధించేందుకు పోటీపడ్డారు. అంతేకాదు ఎన్టీఆర్‌ కోసం టీమ్‌ చేసిన హడావుడి కూడా మామూలుగా లేదు. చూస్తుంటే ఎన్టీఆర్‌ ముంబయిలోకి అడుగుపెట్టడంతోనే బాలీవుడ్‌ షేక్‌ అయిపోతుందని చెప్పొచ్చు. 

ఎన్టీఆర్‌ పాల్గొనే `వార్‌ 2` షూటింగ్‌ పది రోజులపాటు షెడ్యూల్‌ ఉంటుందట. హృతిక్‌ రోషన్‌, ఎన్టీఆర్‌ ల మధ్య ఈ సన్నివేశాలను చిత్రీకరిస్తారని తెలుస్తుంది. ఇందులో హృతిక్‌ హీరోగా కనిపిస్తారని, నెగటివ్‌ రోల్‌లో ఎన్టీఆర్‌ కనిపిస్తారని సమాచారం. ఇద్దరి మధ్య భీకరమైన పోరాట సన్నివేశాలు ఉంటాయట. ఆయా సీన్లని ప్రస్తుత షెడ్యూల్‌లో చిత్రీకరించబోతున్నారని సమాచారం. ఇక ఇందులో కియారా అద్వానీ హీరోయిన్‌గా నటిస్తుంది. ఆమె తారక్‌కి జోడీగా చేస్తుందని సమాచారం. ఈ మూవీని వచ్చే ఏడాది ఆగస్ట్ 14న విడుదల చేయబోతున్నారు. 

ఎన్టీఆర్‌ ప్రస్తుతం తెలుగులో `దేవర` చిత్రంలో నటిస్తున్నారు. ఈ మూవీ చిత్రీకరణ పూర్తయ్యిందట. అందుకే ఇప్పుడు ఆయన `వార్‌2` షూటింగ్‌లో పాల్గొంటున్నట్టు తెలుస్తుంది. ఇక `దేవర` పోస్ట్ ప్రొడక్షన్‌ వర్క్ జరుగుతుంది. భారీగా సీజీ వర్క్ ఉంటుందని తెలుస్తుంది. ఈ చిత్రాన్ని అక్టోబర్‌ 10న దసరా కానుకగా విడుదల చేయబోతున్నారు. అనంతరం ఎన్టీఆర్‌.. ప్రశాంత్‌ నీల్‌ మూవీ చేస్తారని తెలుస్తుంది. మరోవైపు ఎన్టీఆర్‌ బాలీవుడ్‌లోనూ ఓ స్ట్రెయిట్‌ మూవీ చేయబోతున్నారట. యష్‌ రాజ్‌ ఫిల్మ్స్ లోనే స్పై యూనివర్స్‌లోనే తారక్ హీరోగా ఓ సినిమా ఉంటుందని సమాచారం. 
 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories

Emmanuel: కట్టే కాలే వరకు ఎంటర్‌టైన్‌ చేస్తా.. బిగ్‌ బాస్‌ మాటలకు ఇమ్మాన్యుయెల్‌ కన్నీటి పర్యంతం
Yogibabu బ్రహ్మానందం కలిసి వస్తే.. నవ్వులు సునామీ వచ్చేది ఎప్పుడంటే?