చైతు “లవ్ స్టోరీ” రిలీజ్ డేట్ ఫిక్స్

Surya Prakash   | Asianet News
Published : Aug 13, 2021, 08:17 AM IST
చైతు “లవ్ స్టోరీ” రిలీజ్ డేట్ ఫిక్స్

సారాంశం

 సునిశితమైన భావోద్వేగాలను బలంగా తెరమీద పలికించగల విజనరీ ఉన్న శేఖర్ కమ్ముల అందించబోతున్న ఈ ప్రేమకథ టాలీవుడ్ లో స్సెషల్ ఎట్రాక్షన్ గా మారబోతుంది. 

హీరో నాగ చైతన్య, సాయి పల్లవి జంట గా శేఖర్ కమ్ముల డైరెక్షన్ లో తెరకెక్కిన మూవీ ‘లవ్ స్టోరీ’ . ఈ సినిమా కరోనా సెకండ్ వేవ్ ప్రభావంతో రిలీజ్ అర్దాంతరంగా వాయిదా పడింది. ఇదే సినిమాతో పాటు రిలీజ్ కావాల్సిన టక్ జగదీష్ ఓటీటి రిలీజ్ కు వెళ్లటంతో అందరి దృష్టీ ఈ సినిమా విడుదలపై  పడింది. కానీ లవ్ స్టోరీ నిర్మాతలు ఆసియన్ సినిమావారు..తెలంగాణాలో అతి పెద్ద థియోటర్ చైన్ కలిగి ఉండటంతో వారు థియోటర్ రిలీజ్ కే వెళ్లాలని ఫిక్స్ అయ్యారు. దానికి తోడు డైరక్ట్ ఓటీటి రిలీజ్ లకు వారు వ్యతిరేకంగా ఉన్నారు. ఈ క్రమంలో థియోటర్ లోనే రిలీజ్ ఫిక్స్ అయ్యి ఓ డేట్ ని ఫిక్స్ చేసారు. అతి త్వరలోనే ప్రకటన రానుంది. ఇంతకీ ఆ డేట్ ఏమిటి?

జూలై నెలలో సినిమా థియేటర్లు మళ్లీ తెరుచుకోవడంతో చిన్న చిన్న సినిమాలన్ని వరుసపెట్టి రిలీజ్ అవుతున్నాయి. మెల్లిగా కోవిడ్ భయాలు వీడి ఇప్పుడిప్పుడే ప్రేక్షకులు థియేటర్లకు వస్తుండడంతో “లవ్ స్టోరీ” సినిమా కూడా రిలీజ్ డేట్‌ను ఫిక్స్ చేసుకుంది. వినాయక చవితి సందర్భంగా ఈ సినిమాను వచ్చే నెల 10వ తేదీన విడుదల చేయాలని మేకర్స్ డిసైడ్ అయ్యారట. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది.
 
  ప్రేమలో కనిపించే బావోద్వేగాలను ప్రధానంగా ఈ సినిమాని డిజైన్ చేసారు శేఖర్ కమ్ముల. తను ఎలాంటి కథను చెప్పబోతున్నాడో ఆ ఫీల్ ని పోస్టర్ , వైరల్ అయ్యిన పాటతో చెప్పేసారు శేఖర్ కమ్ముల. కథను పరిచయం చేయడం లో శేఖర్ కమ్ముల మాస్టర్ స్ట్రోక్ కనిపిస్తుంది. అందుకోసం ఫ్యాన్ వెయిటింగ్. అయితే ఈ సినిమా ఓటీటిలో రాదని తెలుస్తోంది.  ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కిన ఈ లవ్‌స్టోరీలో నాగ్ చైతన్య డ్యాన్స్ మాస్టర్‌గా నటిస్తున్నుట్టు తెలిసింది. అటు సాయి పల్లవి సినిమాలో డ్యాన్సర్‌గా కన్పించనుందట.  ఈ ప్రేమకథ నాగచైతన్య ఇమేజ్ ని కొత్తగా ప్రొజెక్ట్ చేస్తుందని టీం అంటోంది.

ఫిదా తర్వాత శేఖర్ కమ్ముల దర్శకత్వంలో రాబోతున్న ఈ అందమైన ప్రేమకథ అక్కినేని అభిమనుల్లో, ప్రేక్షకుల్లో అమిత ఆసక్తిని కలిగించింది. సునిశితమైన భావోద్వేగాలను బలంగా తెరమీద పలికించగల విజనరీ ఉన్న శేఖర్ కమ్ముల అందించబోతున్న ఈ ప్రేమకథ టాలీవుడ్ లో స్సెషల్ ఎట్రాక్షన్ గా మారబోతుంది. ఏమిగోస్  క్రియేషన్స్, సోనాలి నారంగ్  సమర్పణలో శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ ఎల్ పి బ్యానర్ పై నారాయణ్ దాస్ కె నారంగ్, పి రామ్మోహన్ రావు ఈ సినిమాను నిర్మించారు.

నాగచైతన్య, సాయిపల్లవి హీరోహీరోయిన్లుగా నటిస్తున్న ఈ మూవీలో రాజీవ్ కనకాల,ఈశ్వరీ రావు,దేవయాని ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.
ఆర్ట్:రాజీవ్ నాయర్
సినిమాటోగ్రఫీ: విజయ్ సి కుమార్,
సహా నిర్మాత : విజయ్ భాస్కర్,
 పి.ఆర్.వో -జి.ఎస్.కె మీడియా,
డిజిటల్ మార్కెటింగ్: నీహారిక గాజుల
మ్యూజిక్ : పవన్
నిర్మాతలు : నారాయణ్ దాస్ కె నారంగ్, పి రామ్మోహన్ రావు
రచన- దర్శకత్వం : శేఖర్ కమ్ముల
 

PREV
click me!

Recommended Stories

Emmanuel Remuneration: ఇమ్మూ రెమ్యూనరేషన్‌ మైండ్‌ బ్లోయింగ్‌.. బిగ్‌ బాస్‌ తెలుగు 9 షోకి ఎంత తీసుకున్నాడంటే?
Bigg Boss 9: పాపం ఇమ్మాన్యుయల్... టాప్ 3 కూడా మిస్, ఖుషీలో డీమాన్ పవన్