వామ్మో.. కళ్ళలో కసి, ఒళ్ళంతా పూనకం.. అల్లు అర్జున్ ఇలా మారిపోయాడేంటి

pratap reddy   | Asianet News
Published : Aug 12, 2021, 04:11 PM IST
వామ్మో.. కళ్ళలో కసి, ఒళ్ళంతా పూనకం.. అల్లు అర్జున్ ఇలా మారిపోయాడేంటి

సారాంశం

అల్లు అర్జున్ లేటెస్ట్ గా నటిస్తున్న పుష్ప చిత్రం ఊహకు అందడం లేదు. దర్శకుడు సుకుమార్ ఈ చిత్రంలో సరికొత్త అల్లు అర్జున్ ని చూపించబోతున్నాడు. ఇప్పటికే పుష్ప ఫస్ట్ లుక్ సినిమాపై అంచనాలు పెంచేసింది.

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఐకాన్ స్టార్ అయ్యాడు. స్టైలిష్ స్టార్ అనే బిరుదు ఉన్నప్పటికీ బన్నీకి మాస్ లో మంచి గ్రిప్ ఉంది. అల్లు అర్జున్ మాస్ చిత్రాల్లో నటించినా, ఫైట్స్ చేసినా అందులో స్టయిల్ ఉంటుంది. ఊరమాస్ చిత్రం సరైనోడుతో కూడా బన్నీ మ్యానరిజమ్స్ లో స్టయిల్ తగ్గలేదు. 

కానీ అల్లు అర్జున్ లేటెస్ట్ గా నటిస్తున్న పుష్ప చిత్రం ఊహకు అందడం లేదు. దర్శకుడు సుకుమార్ ఈ చిత్రంలో సరికొత్త అల్లు అర్జున్ ని చూపించబోతున్నాడు. ఇప్పటికే పుష్ప ఫస్ట్ లుక్ సినిమాపై అంచనాలు పెంచేసింది. బన్నీ మునుపెన్నడూ చూడని విధంగా రా అండ్ రస్టిక్ లుక్ లో కనిపిస్తున్నాడు. 

ఆగష్టు 13న పుష్ప చిత్రం నుంచి ఫస్ట్ సింగిల్ రాబోతోంది. 'దాక్కో దాక్కో మేక పులోచ్చి కొరుకుద్ది పీక' అనే మాస్ బీట్ ని దేవిశ్రీ ప్రసాద్ రెడీ చేశారు. తాజాగా ఈ సాంగ్ ప్రోమో బయటకొచ్చింది. బన్నీ మాస్ అవతారం చూస్తుంటే ఒళ్ళు గగుర్పాటుకు గురి కావలసిందే. 

నోటితో కట్టి పట్టుకుని, భయంకరమైన రూపంతో, కళ్ళలో కసి కనిపించేలా పూనకంతో అల్లు అర్జున్ ఊగిపోతున్నాడు. మనం చూస్తున్నది అల్లు అర్జున్ నేనా అనే అనుమానం ఒక్క క్షణం కలగకమానదు. అంతలా అల్లు అర్జున్ మేకోవర్, బాడీ లాంగ్వేజ్ మారిపోయింది. ప్రోమో పై మీరూ ఓ లుక్కేయండి. 

 

PREV
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9 : తనూజ తో ఐటమ్ సాంగ్ చేయిస్తానన్న ఇమ్మాన్యుయేల్, అడ్డంగా బుక్కైన డీమాన్ పవన్.. హౌస్ లో చివరి రోజు సందడి
Emmanuel Remuneration: ఇమ్మూ రెమ్యూనరేషన్‌ మైండ్‌ బ్లోయింగ్‌.. బిగ్‌ బాస్‌ తెలుగు 9 షోకి ఎంత తీసుకున్నాడంటే?