పోలీసులను ఆశ్రయించిన యాంకర్‌ గాయత్రి భార్గవి..

Published : Aug 13, 2021, 08:00 AM IST
పోలీసులను ఆశ్రయించిన యాంకర్‌ గాయత్రి భార్గవి..

సారాంశం

గుర్తు తెలియని దుండగులు తన ఫేస్‌ బుక్‌ పేజీని హ్యాక్‌ చేసి వివిధ మతాలకు సంబంధించి అభ్యంతరకమైన పోసులు చేస్తున్నారని యాంకర్‌ గాయత్రి భార్గవి పోలీసులను ఆశ్రయించింది.

ప్రముఖ తెలుగు యాంకర్‌, నటి గాయత్రి భార్గవి పోలీస్‌ స్టేషన్‌ మెట్లెక్కింది. తన ఫేస్‌బుక్‌ అకౌంట్‌ హ్యాకింగ్ కి గురైందని ఆమె సైబర్‌ పోలీసులను ఆశ్రయించింది. గుర్తు తెలియని దుండగులు తన ఫేస్‌ బుక్‌ పేజీని హ్యాక్‌ చేసి వివిధ మతాలకు సంబంధించి అభ్యంతరకమైన పోసులు చేస్తున్నారని ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఇటీవల పంచుకున్న పోస్ట్ లు తాను పెట్టినవి కావని ఆమె తెలిపింది. ఈ మేరకు ఆమె ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా ఓ నోట్‌ని కూడా షేర్‌ చేసుకుంది. 

ఇదిలా ఉంటే దీనిపై ఏపీసీ కె.వి.ఎం ప్రసాద్‌ మాట్లాడుతూ, యాంకర్‌ భార్గవి ఎఫ్‌బీ అఫీషియల్‌ అకౌంట్‌తోపాటు మరో అకౌంట్‌ని దుండగులు ఆమె పేరు మీద క్రియేట్‌ చేసినట్టు గుర్తించామని తెలిపారు. సోషల్‌ మీడియాలో అప్రమత్తంగా ఉండాలని, ఎప్పటికప్పుడు పాస్‌ వర్క్ లను మార్చుకోవాలని సూచించారు. ఇక యాంకర్‌ భార్గవి ఫిర్యాదుపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్టు ఏసీపీ వివరించారు. 

యాంకర్‌గా, టీవీ, సినిమా నటిగా రాణిస్తున్న భార్గవి `ఒక లైలా కోసం`, `అవును`, `ప్రేమ కావాలి` వంటి సినిమాలతోపాటు `అభిరుచి` టీవీ షోకి యాంకర్‌గానూ చేసింది. పలు సీరియల్స్ లోనూ నటిస్తుంది.

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories

Emmanuel Remuneration: ఇమ్మూ రెమ్యూనరేషన్‌ మైండ్‌ బ్లోయింగ్‌.. బిగ్‌ బాస్‌ తెలుగు 9 షోకి ఎంత తీసుకున్నాడంటే?
Bigg Boss 9: పాపం ఇమ్మాన్యుయల్... టాప్ 3 కూడా మిస్, ఖుషీలో డీమాన్ పవన్