SSMB 29 : రాజమౌళి, మహేష్ మూవీ లేటెస్ట్ అప్డేట్.. లుక్ టెస్ట్ కంప్లీట్, ఎన్ని ఫైనల్ చేశారంటే

By tirumala AN  |  First Published Mar 4, 2024, 5:35 PM IST

సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శక ధీరుడు రాజమౌళి కాంబినేషన్ లో చిత్రానికి ముందస్తు సన్నాహకాలు జోరందుకుంటున్నాయి. వీలైనంత త్వరలో షూటింగ్ మొదలుపెట్టే ఆలోచనలో రాజమౌళి ఉన్నట్లు తెలుస్తోంది.


సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శక ధీరుడు రాజమౌళి కాంబినేషన్ లో చిత్రానికి ముందస్తు సన్నాహకాలు జోరందుకుంటున్నాయి. వీలైనంత త్వరలో షూటింగ్ మొదలుపెట్టే ఆలోచనలో రాజమౌళి ఉన్నట్లు తెలుస్తోంది. ఆల్రెడీ స్క్రిప్ట్ లాక్ అయినట్లు విజయేంద్ర ప్రసాద్ ప్రకటించారు. 

అంతర్జాతీయ ప్రమాణాలతో హాలీవుడ్ స్థాయి చిత్రంగా తీర్చిదిద్దాలని రాజమౌళి ప్రయత్నిస్తున్నారు. అందుకు తగ్గట్లుగా ప్రిపరేషన్స్ జరుగుతున్నాయి. ఇండియన్ సినిమాలోనే బిగ్గెస్ట్ ప్రాజెక్టు గా మహేష్, రాజమౌళి చిత్రం ఉండబోతోంది. కేఎల్ నారాయణ దుర్గా ఆర్ట్స్ బ్యానర్ పై ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నారు. 

Latest Videos

అడవుల్లో తిరిగే ప్రపంచ సాహసికుడు కథగా ఈ చిత్రం ఉండబోతున్నట్లు తెలుస్తోంది. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన అప్డేట్ వైరల్ అవుతోంది. రాజమౌళి పర్యవేక్షణలో మహేష్ బాబుకు లుక్ టెస్ట్ చేశారట. ఈ చిత్రంలో కోసం 8 లుక్కులు ఫైనల్ చేశారట. అందులో బెస్ట్ లుక్ ని ఫైనల్ చేసి మహేష్ బాబుని ఆ విధంగానే చిత్రంలో చూపించబోతున్నారు. 

ఈ చిత్రంలో మహేష్ బాబుకి జోడిగా ఇండోనేషియాకి చెందిన చెలేసా ఇస్లాన్ అనే నటి నాటించబోతున్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. త్వరలోనే దీనికి సంబంధించిన అప్డేట్ రానుంది.  కీరవాణి సంగీత దర్శకుడు. ఆర్ఆర్ఆర్ ఆస్కార్ కి గురిపెట్టి కొట్టిన జక్కన్న ఈ చిత్రంతో ఇంకెన్ని అంతర్జాతీయ అవార్డులు దక్కించుకుంటారో చూడాలి. 

click me!