
`మన్మథుడు` మూవీ నాగార్జున కెరీర్‌లో మైల్ స్టోన్‌లాంటి ఫిల్మ్. ఈ మూవీ పెద్ద విజయం సాధించడంతోపాటు ఇప్పటికే నాగార్జునకి అదే ట్యాగ్ రన్ అవుతుంది. టాలీవుడ్ మన్మథుడు నాగ్ అనే పిలుస్తుంటారు. అంతగా ఈ మూవీ తెలుగు ఆడియెన్స్ ని ప్రభావితం చేసింది. నాగార్జునని మన్మథుడిని చేసింది. కింగ్ ఆఫ్ రొమాన్స్ గా మార్చేసింది. ఇందులో ఫస్ట్ పెయిర్ నాగ్(అభి), అన్షు(మహి) జంట ఎంతగానో ఆకట్టుకుంది. వీరిద్దరి మధ్య లవ్ ట్రాక్ హృదయాలను పిండేస్తుంది.ఆ తర్వాత పరిణామాలు సైతం ఆకట్టుకుంటాయి.
ఇందులో అన్షు కనిపించింది కాసేపే అయినా చాలా ఇంపాక్ట్ చూపించింది. ఆ తర్వాత హీరోయిన్ అన్షు ఒకటి రెండు సినిమాలు చేసి పూర్తిగా ఇండస్ట్రీకే దూరమయ్యింది. వివాహం చేసుకుని లైఫ్‌లో సెటిల్ అయ్యింది. వారి ఫ్యామిలీతో కలిసి లండన్‌లో స్థిరపడింది. దాదాపు 22ఏళ్ల తర్వాత మళ్లీ కలుసుకున్నారు. ఇటీవల అన్షు హైదరాబాద్ వచ్చారు. పలు ఇంటర్వ్యూలిస్తున్నారు. రీఎంట్రీకి సంబంధించిన ఆసక్తిని వెల్లడించింది. తాను మళ్లీ సినిమాలు చేసేందుకు సిద్ధంగానే ఉన్నట్టు చెప్పింది.
ఇక ఇప్పుడు తన హీరోని కలుసుకుంది. `మన్మథుడు` హీరో నాగార్జునని ఆమె మీట్ అయ్యింది. అన్షు ఫ్రెండ్ ఇచ్చిన పార్టీకి నాగార్జున, అమల హాజరయ్యారు. రెండు దశాబ్దాల తర్వాత మళ్లీ కలుసుకోవడంతో ఇద్దరూ ఆనందపడ్డారు. ముఖ్యంగా అన్షు ఆనందానికి అవదుల్లేవు. ఈ విషయాన్ని ఆమె సోషల్ మీడియా ద్వారా పంచుకుంది.
`రెండు దశాబ్దాల క్రితం నాగార్జునతో కలిసి `మన్మథుడు`లో నటించాను. ఇన్నేళ్ల తర్వాత ఆయన్ని మళ్లీ కలుసుకోవడం, ఆయన దాతృత్వం, శౌర్యం ఎప్పటిలాగే ఉత్సాహంగా ఉన్నారు. కొన్ని జ్ఞాపకాలు నిజంగా కాల పరీక్షగా నిలుస్తాయి` అని పేర్కొంది అన్షు. ఈ సందర్భంగా `మన్మథుడు` చిత్రంలోని చిత్రాన్ని కూడా పంచుకుంది. అప్పుడు ఇప్పుడు అభి, మహి అని పేర్కొంది. అన్షు పంచుకున్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఎవర్ గ్రీన్ జోడీ అంటూ కామెంట్లు పెడుతున్నారు నెటిజన్లు.
`మన్మథుడు` చిత్రంలో నాగార్జున సరసన అన్షుతోపాటు సోనాలీ బింద్రే హీరోయిన్లుగా నటించారు. కే విజయ భాస్కర్ దర్శకత్వం వహించారు. దీనికి త్రివిక్రమ్ స్టోరీ, స్క్రీన్‌ప్లే అందించారు. ఈ మూవీ 2002లో విడుదలైంది పెద్ద విజయం సాధించింది. ఇప్పటికీ ఎవర్ గ్రీన్ మూవీగా నిలిచింది. ప్రస్తుతం నాగార్జున మరే సినిమాకి కమిట్ కాలేదు. ఇటీవల సంక్రాంతికి `నా సామి ర ంగ` చిత్రంతో నటించి విజయాన్ని అందుకున్నారు. ఇప్పుడు ధనుష్‌తో శేఖర్ కమ్ముల చిత్రంలో నటిస్తున్నారు.