
వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. ఆర్ఆర్ఆర్ తరువాత ఆచార్యతో ఫెయిల్యూర్ అందుకున్న చరణ్.. ప్రస్తుతం శంకర్ తో పాన్ ఇండియా మూవీ చేస్తున్నాడు. ఈసినిమా షూటింగ్ దాదాపు కంప్లీట్ కావస్తోంది. ఇక ఈసినిమా తరువాత చరణ్ ఎవరితో సినిమా చేయబోతున్నాడు. అంటే ఇండస్ట్రీ నుంచి రకరకాల పేర్లు వినిపిస్తున్నాయి. చరణ్ కోసం చాలా మంది దర్శకులు ఎదురు చూస్తున్నారు.
రామ్‌చరణ్, జెర్సీ ఫేం గౌతమ్ తిన్ననూరితో సినిమా చేయాల్సి ఉండగా.. కొన్ని కారణాల వల్ల ఈ సినిమా కాన్సిల్ అయినట్లు న్యూస్ వైరల్ అవుతోంది. మరి గౌతమ్ తో కాకపోతే చరణ్ ఎవరితో సినిమాచేస్తాడు అంటూ ఇండస్ట్రీలో గుసగుసలు వినిపించాయి. వార్తలు వచ్చాయి. అయితే చరణ్ 16వ మూవీని ఓ కన్నడ దర్శకుడు డైరెక్ట్ చేయబోతున్నట్టు న్యూస్ వినిపించింది. కాని ఇదంతా ప్రచారమే అని అంటున్నారు సినిమా జనాలు. అంతే కాదు ఈ విషయంలో మేకర్స్ నుండి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.
ఇక చరణ్ తో సినిమా లిస్ట్ లో తాజాగా మరో దర్శకుడి పేరు వినిపిస్తుంది. ఇటీవలే విక్రమ్‌తో సంచలన విజయం సాధించిన లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో RC16 తెరకెక్కుతున్నట్లు కోలీవుడ్ వర్గాల్లో వినిపిస్తుంది. రామ్ చరణ్ తో సినిమా కోసం లోకేష్ చాలా రోజులుగా చూస్తున్నాడు. చరణ్ తరకు మంచి మిత్రుడని.. ఆయనకు ఓ లైన్ కూడా వినిపించానని కొన్ని రోజుల క్రితం ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు లోకేష్. అయితే అది ఇంత త్వరగా అవుతుందని ఎవరూ అనుకోలేుద.
లోకేష్ ప్రస్తుతం విజయ్‌తో సినిమా చేస్తున్నాడు. ఆ తర్వాత కార్తితో ఖైదీ సీక్వెల్ తెరకెక్కించనున్నాడు. ఇక ఈ రెండు ప్రాజెక్ట్‌ల తర్వాతే రామ్‌చరణ్ సినిమా పట్టాలెక్కనుందట. దీనిపై అధికారికంగా ప్రకటన రావాల్సి ఉంది. ఈ చిత్రం కూడా లోకేష్ సినిమాటిక్ యూనివర్స్‌లో భాగంగానే తెరకెక్కుతున్నట్లు టాక్. అయితే ఇందులో ఎంత వరకూ నిజం ఉందో తెలియాలి అంటే.. అఫీషియల్ అనౌన్స్ మెంట్ వచ్చే వరకూ ఎదరు చూడాల్సిందే.
ఆర్ఆర్ఆర్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా మారిపోయాడు రామ్ చరణ్. జాతీయ స్తాయిలో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు ఈ ఏడాది రిలీజ్ అయిన ట్రిపుల్ ఆర్ బాక్సాఫీస్ ను శేక్ చేసింది. ఇక ఆరువాత తండ్రిత కలిసి నటించిన ఆచార్య సినిమా మాత్రం నిరాశను మిగిల్చింది చరణ్ కు. ప్రస్తుతం ఈయన డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో తన 15వ సినిమా చేస్తున్నాడు. ప్రస్తుతం సూపర్ ఫాస్ట్ గా షూటింగ్ చేసుకుంటున్న ఈ సినిమాను వచ్చే ఏడాది రిలీజ్ చేయాలని చూస్తున్నారు మేకర్స్.