`ఆదిపురుష్‌` గురించి నేను అలా అనలేదు.. కావాలనే నాపై నెగటివ్‌ ప్రచారం: మంచు విష్ణు

Published : Oct 15, 2022, 05:14 PM ISTUpdated : Oct 15, 2022, 05:17 PM IST
`ఆదిపురుష్‌` గురించి నేను అలా అనలేదు.. కావాలనే నాపై నెగటివ్‌ ప్రచారం: మంచు విష్ణు

సారాంశం

`ఆదిపురుష్‌` టీజర్‌పై ఇటీవల మంచు విష్ణు విమర్శలు చేసిన వార్తలొచ్చిన విషయం తెలిసిందే. తాజాగా దీనిపై మంచు విష్ణు స్పందించి క్లారిటీ ఇచ్చారు. కొందరు కావాలని ఇలా చేస్తున్నారని ఆరోపించారు.

పాన్‌ ఇండియా స్టార్ ప్రభాస్‌.. నుంచి రాబోతున్న సినిమా `ఆదిపురుష్‌`. రామాయణం ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రమిది. ఓం రౌత్ రూపొందించారు. ఇటీవల ఈ చిత్ర టీజర్‌ని విడుదల చేశారు. దీనిపై చాలా విమర్శలు వచ్చాయి. యానిమేషన్‌ మూవీగా తెరకెక్కించారని కామెంట్లు వచ్చాయి. మరో కొచ్చడయాన్‌ అని అంటున్నారు. దారుణంగా ట్రోల్స్, మీమ్స్ వైరల్‌ అయ్యాయి. 

ఈ సినిమాపై మా అధ్యక్షుడు, హీరో మంచు విష్ణు కూడా విమర్శలు చేసినట్టు ప్రచారం జరిగింది. తాజాగా ఈ వ్యాఖ్యలపై విష్ణు స్పందించారు. ట్విట్టర్‌ ద్వారా ఆయన ఈ వార్తలను ఖండించారు. తనపై కొందరు కావాలనే చెడు ప్రచారం చేస్తున్నారని ఆయన ఆరోపించారు. ఓ మీమ్‌ని ఆయన ట్విట్టర్‌ ద్వారా షేర్‌ చేస్తూ, `ఫేక్‌ న్యూస్‌. నేను ఊహించినట్టే జరుగుతుంది. `జిన్నా` రిలీజ్‌కి ముందు కొందరు ఐటెమ్‌ రాజాలు ఇలాంటి నెగటివ్‌ వార్తలను స్ప్రెడ్‌ చేస్తున్నారు. డార్లింగ్‌ ప్రభాస్‌కి మంచి జరగాలని కోరుకుంటున్నా. అంతకు మించిన నాకేమీ వద్దు` అని విష్ణు ట్వీట్ చేశారు. 

మరోవైపు `మా` అసోసియేషన్‌కి సంబంధించి `అసోసియేషన్‌లో మెంబర్‌షిప్‌ రావాలంటే హీరో, హీరోయిన్లు కనీ రెండు సినిమాలు చేసి ఉండాలి, అవి థియేటర్లలోగానీ, ఓటీటీలో గానీ రిలీజ్‌ అయి ఉండాలి` అని తాను చెప్పినట్టుగా ఓ మీమ్‌ వైరల్‌ అవుతున్న నేపథ్యంలో దానిపై మరో ట్వీట్‌ చేశారు మంచు విష్ణు. `మరో నకిలీ వార్త. పెయిడ్‌ బ్యాచ్‌ తప్పుడు వార్తలను ప్రచారం చేయడానికి ఎందుకు ప్రయత్నిస్తుంది. జీవితంలో కొంత ఆనందించండి. 21న జిన్నా చూడండి. సానుకూలంగా ఉండండి` అని పోస్ట్ చేశారు.

ఇక `ఆదిపురుష్‌ సినిమా చూసి ఓ తెలుగు వాడిగా నిరాశ చెందా. చిత్ర యూనిట్‌ చీట్‌ చేసినట్టుంది. రామాయణం తెరకెక్కిస్తున్నారని వినగానే మెయిన్‌ స్ట్రీమ్‌ లైవ్‌ యాక్షన్‌ మూవీ అనుకున్నా. కానీ టీజర్‌లో యానిమేషన్‌ మూవీ చూపించారు. దీంతో అందరిలానే తాను నిరాశ చెందా. ముందుగానే ఇది యానిమేషన్‌ మూవీ అని చెప్పి ఉంటే ఇంత ట్రోలింగ్ జరిగేది కాదేమో. ఆడియెన్స్ అంచనాలను పట్టించుకోకుండా యానిమేషన్‌ గ్రాఫిక్స్ ఎలా చూపించినా ప్రయోజనం ఉండదు. ఈ టీజర్‌ చూస్తుంటే రజనీకాంత్‌ `కొచ్చడయాన్‌` మూవీ చూసినట్టనిపించింది` అని మంచు విష్ణు ఓ ఇంటర్వ్యూలో వ్యాఖ్యానించినట్టు వార్తలొచ్చిన విషయం తెలిసిందే. తాజాగా దీనిపై విష్ణు క్లారిటీ ఇచ్చారు.

మంచు విష్ణు ప్రస్తుతం `జిన్నా` చిత్రంలో నటించారు. సన్నీలియోన్‌, పాయల్ రాజ్ పుత్‌ హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రానికి జి నాగేశ్వర్‌రెడ్డి దర్శకత్వం వహించారు. ఈ సినిమా దీపావళి కానుకగా ఈ నెల 21న విడుదల కానుంది. 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Articles on
click me!

Recommended Stories

Nagarjuna: కోడలు శోభితా ప్రెగ్నెన్సీపై నాగార్జున రియాక్షన్‌ ఇదే, తాత కావడంపై హింట్‌.. రూ.2కోట్ల విరాళం
Karthika Deepam 2 Today Episode: వైరాతో చేతులు కలిపిన జ్యోత్స్న- శ్రీధర్ ని కార్తీక్ కాపాడుతాడా?