
హైదరాబాద్, 25 ఆగష్టు - ప్రేక్షకులకు ఏది అవసరం అనేది కేవలం మన 100 % రీజినల్ ఓ టి టి ప్లాట్ ఫామ్ "ఆహ" కి మాత్రమే తెలుసు. అలా వస్తున్న షోనే ఈ డ్యాన్స్ ఐకాన్. ఈ షో లాంచ్ ఎపిసోడ్ కి ముఖ్య అతిథులుగా విజయ్ దేవరకొండ, అనన్య పాండే విచ్చేయనున్నారు. ఈ ఎపిసోడ్ తో ప్రారంభమవుతున్న డ్యాన్స్ ఐకాన్ సెప్టెంబర్ 11 నుండి ఆహ లో తప్పక చూడండి.
విజయ్, అనన్య ఇద్దరు కలిసి ''అకడి పకడి దిక్క దికిడి'' అను పాట మీద డ్యాన్స్ చేసి అందరిని ఉర్రూతలూగించారు. కంటెస్టెంట్ రాయచూర్ ఆనంద్ కు తాను జీవితాంతం తన ''రౌడీస్'' బ్రాండ్ దుస్తులు అందచేస్తానని విజయ్ మాటిచ్చారు. జడ్జి శేఖర్ మాస్టర్, మరియు కో-ఓనర్ శ్రీముఖి, యశ్ మాస్టర్, మోనాల్ గజ్జర్ ఇచ్చే పవర్ ప్యాక్డ్ పర్ఫార్మెన్స్ అందరిని ఆకట్టుకోబోతుంది. కంటెస్టెంట్ ఫ్లోరినా డ్యాన్స్ కు ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ ఫిదా అయ్యి తనతో పాటు స్టెప్స్ వేశారు. అసలు ఎంటర్టైన్మెంట్ అంతా డ్యాన్స్ ఐకాన్ లాంచ్ ఎపిసోడ్ లో ఉండడం విశేషం.
ఈ మధ్యే విడుదలైన ఫస్ట్ లుక్ కి విశేష ఆదరణ లభించింది. టాలెంట్, డిటర్మినేషన్ మరియు హార్డ్ వర్క్ ఉన్న వేదికే ఈ డాన్స్ ఐకాన్. ఈ షో కంటెస్టెంట్స్ తో పాటు వారిని కొరియోగ్రాఫ్ చేసే మాస్టర్స్ జీవితాల్ని కూడా మార్చేస్తుంది. గెలిచిన కంటెస్టెంట్ యొక్క కొరియోగ్రాఫర్ కు టాలీవుడ్ లో ఒక పెద్ద హీరో కి డాన్స్ కొరియోగ్రఫీ చేసే అవకాశం వస్తుంది. అది ఎవరని ఆహా వారు ఫినాలే రోజు అందరికి వెల్లడిస్తారు. ఈ షో కి యాంకర్ గా ఓంకార్ వ్యవహరిస్తున్నారు.