
కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ దళపతి హీరోగా తెలుగులో తెరకెక్కుతోన్న మొదటి సినిమా వారసుడు. టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ వంశీ పైడిపల్లి కాంబోలో వస్తున్న ఈ సినిమా ది బాస్ రిటర్న్స్ అనే క్యాప్షన్ తో రూపొందుతోంది. ఇక తెలుగుతో పాటు తమిళంలో కూడా ఒకే సారి తెరకెక్కుతున్న ఈ మూవీ పాన్ ఇండియా రేంజ్ లో కన్నడ,మలయాళ, హిందీలో కూడా రిలీజ్ అయ్యే అవకాశంకనిపిస్తోంది. ఇక తమిళంలో వారిసు టైటిల్‌తో ఈ మూవీ తెరకెక్కుతోంది. కన్నడ భామ రష్మిక మందన్నా హీరోయిన్‌గా నటిస్తోంది.
అయితే సాఫీగా సాగిపోతున్న ఈసినిమా షూటింగ్ విషయంలో ఓ ట్వీస్ట్ చోటు చేసుకుంది. ఈ సినిమాలోని ఓ వీడియో సాంగ్ లీక్ అయ్యిందంటూ.. ఓన్యూస్ ఇపుడు నెట్టింట్లో ట్రెండింగ్ అవుతోంది. డైరెక్టర్ అమీర్ కుమారుడు ఈ వీడియోసాంగ్‌లోని కొంత భాగాన్ని ఆన్‌లైన్‌లో లీక్ చేసినట్టు నెటిజన్లు గుర్తించారు. ఇక వెంటనే అప్రమత్తం అయిన ప్రొడక్షన్ టీం.. చర్యలు స్టార్ట్ చేయడంతో అక్కడ నుంచి హెచ్చరికలు రావడంతో అమీర్ కుమారుడు ఆ వీడియోను డిలీట్ చేసి ప్రొఫైల్‌ను లాక్ చేశాడు.
అయితే ఈ వీడియో సాంగ్ లీక్ అవ్వడం ఇప్పుడు సంచలనంగా మారింది. ఈ విషయంలో మూవీ టీమ్ తో పాటు.. విజయ్ ఫ్యాన్స్ కూడా అప్‌సెట్ అవడమే కాకుండా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలా జరిగిందేమిటి అని డైరెక్టర్ వంశీ పైడి పల్లి కూడా తలపట్టుకుని కూర్చున్నట్టు సమాచారం. ఇక మరో సారి ఇలా లీకులు అవకుండా సరైన జాగ్రత్తలు తీసుకోవాలని టీంకు అభిమానులు విజ్ఞప్తి చేస్తున్నారు. శరత్‌కుమార్, జయసుధ, ప్రకాశ్ రాజ్, ప్రభు, యోగిబాబు, శ్రీకాంత్ ఇలా స్టార్ కాస్ట్ చాలా మంది ఈసినిమాలో కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
అయితే వీడియో బాగా వైరల్ అవ్వకముందే డిలెట్ కావడంతో నష్టం తక్కవగా జరిగినట్టు ఫీల్ అవుతున్నారట టీమ్. అయితే ఈసారి ఇలా జరగక్కుండా ఉండేందుకు పక్కాగా ప్రణాళికలను తయారు చేస్తున్నాడట వంశీ పైడిపల్లి. ఈ సినిమాను శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌లో దిల్ రాజు, శిరీష్ నిర్మిస్తున్నారు. ఇక తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కుతున్న ఈ సినిమాకు స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ థమన్ స్వరాలు సమకూర్చుతున్నారు. 2023 సంక్రాంతి కానుకగా ఈ సినిమాను రిలీజ్ చేయాబోతున్నారు టీమ్.