
`లైగర్` భామ అనన్యపాండే ఇంట్లో విషాదం ఛాయలు అలుముకున్నాయి. అనన్య నానమ్మ, సీనియర్ నటుడు చుంకీ పాండే తల్లి స్నేహలతా పాండే(85) కన్నుమూశారు. ముంబయిలోని బాంద్రాలో గల తమ నివాసంలో ఆమె శనివారం వయసుతో కూడిన అనారోగ్యంతో తుది శ్వాస విడిచారు. చుంకీపాండే, తల్లి స్నేహలతా వేర్వేరు చోట్ల ఉంటున్నారు. విషయం తెలియగానే హుటాహుటిని తమ ఇంటికి చేరుకున్నారు చుంకీ పాండే, ఆయనభార్య భావన, అనన్య పాండే, చిన్నకూతురు రిసా.
అందుకు సంబంధించిన ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అంత్యక్రియలు కూడా శనివారం పూర్తి చేశారు. తల్లికి చుంకీ పాండే తలకొరివి పెట్టారు. ఈ అంతిమ వీడ్కోలు కార్యక్రమాల్లో బాలీవుడ్‌కి చెందిన ప్రముఖులు సైతం హాజరయ్యారు. నానమ్మ మరణంతో అనన్య పాండే కన్నీరుమున్నీరయ్యారు. వీరి మధ్య ఎంతో అనుబంధం ఉంది.
ఇదిలా ఉంటే `స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 2` చిత్రంతో హీరోయిన్‌గా పరిచయమైన అనన్య పాండే.. `పతి పత్ని ఔర్ వాహ్`, `ఖాలీ పీలీ` చిత్రాల్లో నటించింది. తెలుగు, హిందీలో బైలింగ్వల్‌గా రూపొందుతున్న `లైగర్` చిత్రంతో తెలుగులోకి ఎంట్రీ ఇస్తుంది. ఇందులో విజయ్ దేవరకొండ సరసన నటిస్తుందీ భామ. మరోవైపు శకున్ బత్రా చిత్రంలోనూ నటిస్తుంది.