ఆట మొదలెట్టిన ఎన్టీఆర్

Surya Prakash   | Asianet News
Published : Jul 11, 2021, 07:10 AM IST
ఆట మొదలెట్టిన ఎన్టీఆర్

సారాంశం

మరోసారి బుల్లితెర పై సందడి చేయడానికి సిద్దం అవుతున్నారు తారక్.. ‘ఆట నాది గెలుపు మీది’ అంటూ నయా షో తో రాబోతున్నాడు. ప్రముఖ టీవీ ఛానల్ జెమిని లో టెలికాస్ట్ కానున్న ఎవరు మీలో కోటీశ్వరుడు షోకు ఎన్టీఆర్ హోస్ట్ గా వ్యవహరించనున్నారు.

ప్రముఖ ఛానల్ జెమినీలో "ఎవరు మీలో కోటీశ్వరుడు" పేరుతో ప్రారంభం కానున్న మొదటి సీజన్ కు జూనియర్ ఎన్టీఆర్ హోస్ట్ గా వ్యవహరించనున్నారు. ఈ రియాలిటీ షో సంబంధించిన షూటింగ్ శనివారం అన్నపూర్ణ స్టూడియోస్ లో మొదలైంది. దాదాపుగా 10 రోజుల పాటు జరగనున్న ఈ రియాలిటీ షో షూటింగ్ లో ఎన్టీఆర్ పాల్గొననున్నాడు. అటు హీరోగా కాకుండా వ్యాఖ్యతగా కూడా ఎన్టీఆర్ బుల్లితెర పైన తన మార్క్ చూపించాడని షూటింగ్ లో పాల్గొన్నవారు చెప్తున్నారు. అలాగే ఎన్టీఆర్ లుక్ అదిరిపోయిందిట.

ఇక 2000సంవత్సరంలో బుల్లితెరలో మొదలైన "కౌన్ బనేగా కరోడ్ పతి" షో ఎంతో మందిని లక్షాధికారులను చేసింది.. కొంతమందిని కోటీశ్వరులను చేసింది. తమకున్న మేధస్సు,తెలివితో షోలో అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పి గెలుచుకున్న డబ్బుతో ఎందరి జీవితాలనో మార్చింది ఆ షో. అమితాబ్ బచ్చన్ తో మొదలైన "కౌన్ బనేగా కరోడ్ పతి" దిగ్విజయంగా 12 సీజన్లు నిర్వహించారు. 

ఆ తర్వాత తెలుగులో "మీలో ఎవరు కోటీశ్వరుడు"గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ షోని తెలుగు ప్రజలు ఆదరించారు. కింగ్ నాగార్జున హోస్ట్ గా మొదలైన ఈ షోలో మెగా స్టార్ చిరంజీవి వంటి టాప్ హీరోలు హోస్ట్ గా వ్యవహరించారు. కానీ రేటింగ్స్ రావడం లేదని నిలిపివేశారు.ఇప్పుడు జెమినీ టీవీ ఆ హక్కులు తీసుకొని కొత్త పద్దతిలో స్టార్ట్ చేస్తోంది. ఈ షో కోసం ఎన్టీఆర్ దాదాపు 10 కోట్ల పారితోషికం తీసుకుంటున్నట్లు టాక్.  

PREV
click me!

Recommended Stories

Anirudh Kavya Marriage: అనిరుధ్ - కావ్య మారన్ పెళ్లి నిజమేనా? ఈ ఏడాదిలోనే ఒక్కటవ్వబోతున్నారా?
Rakul Preet Singh: 7 దేశీ లుక్స్‌లో అదరగొట్టిన రకుల్.. అచ్చమైన ఇండియన్ బ్యూటీ ఎలా ఉందంటే?