తీవ్ర అస్వస్థతలో లెజెండరీ నటుడు ధర్మేంద్ర.. రూమర్లపై స్పందించిన కూతురు

Published : Nov 11, 2025, 09:15 AM ISTUpdated : Nov 11, 2025, 09:43 AM IST
actor Dharmendra

సారాంశం

Dharmendra:  బాలీవుడు నటుడు ధర్మేంద్ర అస్వస్థతకు గురయ్యారు. ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయన అనారోగ్యంపై వస్తోన్న రూమర్లపై కూతురు ఇషా స్పందించారు. ఆమె ఈ వార్తలను ఖండించారు. 

 తీవ్ర అస్వస్థతలో బాలీవుడ్‌ నటుడు ధర్మేంద్ర 

 ప్రముఖ బాలీవుడ్ నటుడు ధర్మేంద్ర(89)  తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. నిన్న శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది రావడంతో ఆయన్ని వెంటిలేటర్‌పై ఉంచారు. చాలాకాలంగా అనారోగ్యంతో చికిత్స తీసుకుంటున్నారు. 

రొటీన్‌ చెకప్‌ కోసం వెళ్లి

దాదాపు 11 రోజులుగా ముంబైలోని బ్రీచ్ క్యాండీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.  సోమవారం ఆయనను వెంటిలేటర్‌పై ఉంచినట్లు వార్తలు వచ్చాయి. అయితే, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కుటుంబ సభ్యులు చెబుతూ వచ్చారు. అక్టోబర్ 31న శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కారణంగా ధర్మేంద్రను ఆసుపత్రికి తరలించి ఐసీయూలో చేర్చారు. ఆ సమయంలో కూడా ఆయన రొటీన్ చెకప్ కోసం వెళ్లారని అన్నారు. కానీ మంగళవారం ఉదయం ఆయన తుదిశ్వాస విడిచినట్టు బాలీవుడ్‌ మీడియా రాసుకొచ్చింది. సోషల్‌ మీడియాలో అనేక మంది ధర్మేంద్ర మృతి పట్ల సంతాపం తెలియజేస్తున్నారు.  

నాన్న చనిపోలేదుః ధర్మేంద్ర కూతురు పోస్ట్ 

ఇదిలా ఉంటే ధర్మేంద్ర మరణ వార్తలపై ఆయన కూతురు ఈషా స్పందించారు. తన తండ్రి చనిపోలేదని తెలిపారు. ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉందని, తప్పుడు వార్తలను ప్రచారం చేయోద్దని, తమ కుటుంబ ప్రైవసీని కాపాడాలని తెలిపారు. ఈ మేరకు ఆమె సోషల్‌ మీడియాలో పోస్ట్ పెట్టారు. ప్రస్తుతం ఇది అందరిని ఆశ్చర్యపరుస్తోంది.  ధర్మేంద్రకి భార్య, నటి హేమమాలిని, కుమారులు సన్నీ డియోల్, బాబీ డియోల్, కూతురు ఈషా ఉన్నారు.

 

 

 

 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Articles on
click me!

Recommended Stories

Krishna కథ వినకుండా మహేష్ బాబు చేసిన డిజాస్టర్ సినిమా ఏదో తెలుసా?
Long Delayed Movies: చిరంజీవి నుంచి నాగ చైతన్య వరకు.. లాంగ్ డిలే వల్ల అడ్రస్ లేకుండా పోయిన 8 సినిమాలు ఇవే