హుతిక్ రోషన్-దీపికా ఘాటు ముద్దు.... లీగల్ నోటీసులు ఇచ్చిన అధికారులు..

By Mahesh Jujjuri  |  First Published Feb 8, 2024, 5:46 PM IST

బాలీవుడ్ సీనియర్ హ్యాండ్సమ్ హీరో హృతిక్ రోషన్ తో పాటు...హీరోయిన్ దీపికా పదుకోనేకు లీగల్ నోటీసులు జారీ అయ్యాయి. ఫైటర్ మూవీలో డీప్ లిక్ లాక్ కారణంగా వారికి లీగల్ నోటీసులు ఇచ్చారు. కిస్ సీన్ సహజం కదా.. మరి ఏ కారణంతో ఈ నోటీసులు ఇచ్చారోతెలుసా..? 



బాలీవుడ్ కండల హీరో.. హ్యాండ్సమ్ సీనియర్ స్టార్  హృతిక్ రోషన్, ముద్దుగుమ్మ దీపిక పదుకోనే హీరో హీరోయిన్లు గా నటించిన సినిమా ఫైటర్. సిద్ధార్థ్ ఆనంద్ డైరెక్షన్‌లో తెరకెక్కిన ఫైటర్ మూవీకి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. బాలీవుడ్ లో సూపర్ గా నడుస్తున్న ఈసినిమాకు తాజాగా కొన్ని  న్యాయపరమైన చిక్కులు ఎదురయ్యాయి.  ఈసినిమాలో హృతిక్, దీపికల మధ్య ఘాటు ముద్దు తంటాలు తెచ్చిపెట్టింది. వారు పెట్టుకున్న డీప్ లిప్ లాక్ సీన్ వివాదాస్పదంగా మారింది. 

రామ్ చరణ్ కి ఉపాసన వార్నింగ్..? హీరోయిన్ తో ఆ సీన్లపై మెగా కోడలు గరం.. గరం...

Latest Videos

ఏ సినిమాలో అయినా లిప్ కిస్ లు సహజం.. దానికి సెన్సార్ నుంచి అభ్యంతరం రావాలి. కాని అది లేకుండా సెన్సార్ అయిన సినిమాలో  హీరోయిన్ తో హీరో లిప్ లాక్ ఇస్తే సమస్య ఏంటీఅని మీకు డౌట్ రావచ్చు.. అయితే అక్కడే ఓ ట్విస్ట్ ఉంది. వీరిద్దరు కిస్ చేసుకునేప్పుడు  ఎయిర్ ఫోర్స్ యూనిఫామ్‌లో ఉండి ముద్దు సీన్‌లో నటించారు. ఈ విషయాన్ని తీవ్రంగా  వ్యతిరేకిస్తూ IAF అధికారి సౌమ్యదీప్ దాస్ ఫైటర్ టీమ్‌కి లీగల్ నోటీసులు పంపారు.

ఫైటర్ మూవీ జనవరి 25న  రిలీజ్ అయ్యింది. ఈ సినిమాలో హృతిక్, దీపికా ఇద్దరు  ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్లుగా నటించారు. బాధ్యతాయుతమైన అధికారులుగా ఉన్న పాత్రల్లో నటించిన వీరిద్దరూ లిప్ లాక్ సీన్‌లో నటించడం ఇప్పుడు వివాదాస్పదమైంది. దీనిపై IAF అధికారి సౌమ్యదీప్ దాస్ తీవ్ర స్ధాయిలో అభ్యంతరం వ్యక్తం చేశారు. టీమ్‌కి లీగల్ నోటీసులు జారీ చేసారు. శౌర్యాన్ని, పవిత్రతను ప్రదర్శించే సైనిక దుస్తుల్లో ఉండి లిప్ లాక్ సీన్‌లో నటించడం అంటే యూనిఫామ్ పవిత్రను అగౌరపరచడమే కాకుండా భారత వైమానిక చట్టాన్ని ఉల్లంఘించడమేనని సౌమ్యదీప్ దాస్ తన నోటీసులో పేర్కొన్నారు.

త్రిష ఆస్తి అన్ని కోట్లా...? 40 ఏళ్ల బ్యాచిలర్ హీరోయిన్ 20 ఏళ్ళ సినిమా కెరీర్ లో భారీ సంపాదన ..?

ఈ సినిమాలో అనిల్ కపూర్, కరణ్ సింగ్ గ్రోవర్, అక్షయ్ ఒబెరాయ్ లాంటి స్టార్ నటులు నటించారుఇక ఫైటర్ మూవీకి మంచి స్పందన వచ్చింది. కాని భారీ బడ్జెట్ మూవీ మాత్రం కలెక్షన్ల  విషయంలో డల్ అయ్యింది. ఈ మూవీ వరల్డ్ వైడ్ గా 302 కోట్లు వసూలు చేసింది. కాగా ఫైటర్ ఓటీటీ హక్కులు భారీ రేటుకు నెట్ ప్లిక్స్ కొనుగోలుచేసింది. ఇక వచ్చే నెల అంటే.. మార్చి 29 నుండి ఫైటర్ ఓటీటీలో స్ట్రీమింగ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. 

click me!