ఫిల్మ్ ఇండస్ట్రీలో మరో విషాదం.. ప్రముఖ సంగీత దర్శకుడి మృతి.

By Mahesh JujjuriFirst Published Feb 8, 2024, 5:13 PM IST
Highlights

ఫిల్మ్ ఇండస్ట్రీని వరుస విషాదాలు ముంచెత్తుతున్నాయి. వరుసగా సీనిమా తారలు కన్నుమూయడం ఇండస్ట్రీని కలవరపెడుతోంది. తాజాగా సౌత్ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ కన్నుమూశారు. 
 

ఫిల్మ్ ఇండస్ట్రీనివరుస విషాదాలుబముంచెత్తుతున్నాయి.  ఇప్పటికే ఎంతో మంది సినీ ప్రముఖులు తిరిగిరాని లోకాలకు వెళ్ళిపోయారు. రీసెంట్ గా  సంగీత దర్శకుడు విజయ్ ఆనంద్ చెన్నైలో కన్నుమూశారు. కన్నడ, తమిళ, తెలుగు సినిమాలకు సంగీతం అందించిన విజయ్ ఆనంద్ 71 సంవత్సరాల వయసులో వృద్దాప్య సమస్యలలతో పాటు అనారోగ్య కారణాలతో మరణించినట్లు తెలుస్తోంది.

సంగీత దర్శకుడు విజయ్ ఆనంద్ చెన్నైలోని ప్రైవేట్ హాస్పిటల్ లో ట్రీట్మెంట్ తీసుకుంటూ పరిస్థితి విషమించి చనిపోయారు. ఆయన మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు, సన్నిహితులు సంతాపం వ్యక్తం చేశారు. ఇళయరాజా వంటి పెద్ద సంగీత దర్శకుని పోటీని ఎదుర్కుంటూ విజయ్ ఆనంద్ కన్నడ చిత్ర పరిశ్రమలో 100 సినిమాలకు సంగీతం అందించి అక్కడి ఇండస్ట్రీని శాసించారని చెప్పాలి.

Latest Videos

సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన ‘నాన్ అడిమై ఇల్లై’ సినిమా విజయ్‌కి మంచి పేరు తెచ్చిపెట్టింది. ఆ సినిమాలోని ‘ఒరు జీవన్ దాన్ ఉన్ పాడల్ దాన్’ అనే పాట పాపులర్ అయ్యింది. తమిళలంలో 10 సినిమాలకు విజయ్ సంగీతం అందించారు. విజయ్ ఆనంద్ మరణంపై తీవ్ర సంతాపం వ్యక్తం చేసిన ప్రముఖులు ఆయనకు నివాళులు అర్పించారు.

click me!