
మెగా పవర్ స్టార్ రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో గేమ్ ఛేంజర్ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. అయితే చాలా కాలంగా ఈ చిత్ర షూటింగ్ ఆలస్యం అవుతోంది. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ చిత్ర రిలీజ్ పై ఇంకా క్లారిటీ లేదు. ఇంతలో బుచ్చిబాబు దర్శకత్వంలో రామ్ చరణ్ నటించే చిత్రానికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ శరవేగంగా జరుగుతోంది.
అయితే రాంచరణ్ తదుపరి చిత్రాలకి సంబంధించిన ఊహాగానాలు కూడా మొదలయ్యాయి. అయితే తాజాగా ఒక క్రేజీ న్యూస్ వైరల్ అవుతోంది. కొంత కాలంగా బాలీవుడ్ దర్శకులు రాంచరణ్ తో సినిమా చేయడానికి ప్రయత్నిస్తున్నారు. తాజాగా ఒక క్రేజీ ప్రాజెక్టు ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది.
బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వంలో నటించేందుకు రాంచరణ్ సిద్ధం అవుతున్నట్లు తెలుస్తోంది. ఆల్రెడీ సైన్ చేసినట్లు కూడా ఊహాగానాలు వెలువడుతున్నాయి.
సంజయ్ లీలా భన్సాలీ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఆయన చిత్రాలు ఎంతో కళాత్మకంగా ఉంటాయి. అయితే ఆయన చిత్రాలు మాస్ ఆడియన్స్ కంటే క్లాస్ ఆడియన్స్ ని ఎక్కువగా మెప్పిస్తుంటాయి. మరి మాస్ ఫాలోయింగ్ ఉన్న రాంచరణ్ సంజయ్ లీలా భన్సాలి దర్శకత్వంలో నటించడం రిస్క్ అని కొందరు అంటున్నారు. ఇటీవల చరణ్ కూడా ముంబైకి ఎక్కువగా వెళుతూ వస్తున్నాడు. ఈ చిత్ర కథా చర్చలకే అనే ప్రచారం జరుగుతోంది.