లావణ్య త్రిపాఠికి చేదు అనుభవం.. ఎయిర్‌లైన్‌పై మండిపాటు

Published : Jul 23, 2021, 06:07 PM IST
లావణ్య త్రిపాఠికి చేదు అనుభవం.. ఎయిర్‌లైన్‌పై మండిపాటు

సారాంశం

 ప్రయాణించాల్సిన విమానం క్యాన్సిల్‌ కావడంతో లావణ్య ప్రయాణానికి అంతరాయం కలిగింది. దీంతో సదరు విమానయాన సంస్థ ఎయిర్ ఏషియాపై సోషల్‌ మీడియాలో ఫైర్‌ అయ్యింది.

ఇటీవల `ఏ1ఎక్స్ ప్రెస్‌`తో మంచి విజయాన్ని అందుకున్న లావణ్య త్రిపాఠికి చేదు అనుభవం ఎదురైందట. ఎయిర్‌లైన్‌ చేసిన మిస్టేక్‌పై ఆమె మండిపడ్డారు. సినిమా షూటింగ్‌ కోసం వేరే ప్రాంతానికి విమానంలో ప్రయాణించాల్సిన లావణ్యకి సదరు ఫ్లైట్‌ చివరి నిమిషంలో క్యాన్సిల్‌ కావడంతో ఆమె మండిపడ్డారు. సాంకేతిక సమస్యల కారణంగా ఆమె ప్రయాణించాల్సిన విమానం క్యాన్సిల్‌ కావడంతో లావణ్య ప్రయాణానికి అంతరాయం కలిగింది. 

దీంతో సదరు విమానయాన సంస్థ ఎయిర్ ఏషియాను సోషల్‌ మీడియాలో ట్యాగ్‌ చేస్తూ విమానం క్యాన్సిల్‌ అవుతుందన్న విషయం ముందుగా ఎందుకు తెలియజేయలేదంటూ ఫైర్‌ అయ్యింది లావణ్య. విమానంలో సీటు రిజర్వ్‌ చేసుకున్న అనంతరం ఫ్లైట్‌ క్యాన్సిల్‌ అని మెసేజ్‌ రావడం ఏంటని మండిపడింది. ఇలాంటిది గతంలో ఎవరికైనా జరిగిందా లేక తనకే ఎదురైందా అంటూ అభిమానులను కోరింది. చివరి నిమిషంలో క్యాన్సిల్‌ కావడంతో తన ప్లాన్స్ అన్ని డిస్టర్బ్ అయినట్టు చెప్పింది లావణ్య.

`అందాల రాక్షసి`గా పాపులర్‌ అయిన లావణ్య త్రిపాఠి ఇటీవల వరుస పరాజయాలతో ఉన్న ఆమె సందీప్‌ కిషన్‌ `ఎ1ఎక్స్ ప్రెస్‌` చిత్రంతో మంచి విజయాన్ని అందుకుంది. ప్రస్తుతం ఆమె `రాయబారి` అనే చిత్రంలో నటిస్తుంది. 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories

తేజ తర్వాత సుమన్ శెట్టి దేవుడిలా కొలిచే తెలుగు హీరో ఎవరో తెలుసా? కారణం ఏంటి?
ఇదెక్కడి ట్విస్ట్ బాబూ.! నాగచైతన్యతో సమంత, శోభిత.. అసలు మ్యాటర్ ఇది