`ఆకాశ వీధుల్లో` ట్రైలర్‌పై మాస్‌ డైరెక్టర్‌ గోపీచంద్‌ మలినేని ప్రశంసలు

Published : Jul 23, 2021, 05:07 PM IST
`ఆకాశ వీధుల్లో` ట్రైలర్‌పై మాస్‌ డైరెక్టర్‌ గోపీచంద్‌ మలినేని ప్రశంసలు

సారాంశం

`ఆకాశ వీధుల్లో` చిత్ర ట్రైలర్‌ని శుక్రవారం హైదరాబాద్‌లోని ప్రసాద్‌ ల్యాబ్‌లో విడుదల చేశారు. అతిథిగా విచ్చేసిన గోపీచంద్‌ మలినేని ట్రైలర్‌పై ప్రశంసలు కురిపించారు.

ఇటీవల `క్రాక్‌` చిత్రంతో సూపర్‌ హిట్‌ అందుకుని, త్వరలో బాలయ్యతో మరో యాక్షన్‌ సినిమా చేయబోతున్న దర్శకుడు గోపీచంద్‌ మలిలేని తాజాగా ఓ చిన్న సినిమాపై ప్రశంసలు కురిపించారు. `ఆకాశ వీధుల్లో` చిత్ర ట్రైలర్‌ని శుక్రవారం హైదరాబాద్‌లోని ప్రసాద్‌ ల్యాబ్‌లో విడుదల చేశారు. అతిథిగా విచ్చేసిన గోపీచంద్‌ మలినేని ట్రైలర్‌పై ప్రశంసలు కురిపించారు. కొత్త టీమ్‌ అద్భుతంగా సినిమాని తెరకెక్కించారని, ట్రైలర్‌ ఇంటెన్స్ గా ఆకట్టుకుంటుందన్నారు. గౌతమ్‌ కృష్ణ, పూజిత పొన్నాడ జంటగా జి కె ఫిలిం ఫ్యాక్టరీ, మనోజ్ ఆర్ట్ క్రియేషన్స్ బ్యానర్స్ పై గౌతమ్ కృష్ణ హీరోగా, దర్శకుడిగా పరిచయం అవుతూ రూపొందించిన చిత్రమిది.

ఈ సినిమా గురించి గోపీచంద్‌ మాట్లాడుతూ, `ట్రైలర్ చూసాకా చాలా ఇంటెన్సింగ్ గా అనిపించింది. కొత్త దర్శకుడైనా కూడా మొదటి సినిమాకే ఇంత బాగా తీసాడంటే అతనిలో ఎంత తపన ఉందొ అర్థం చేసుకోవచ్చు. ఈ ట్రైలర్ చూసి ఈ టీమ్ ను అభినందించాలనే ఈ వేడుకకు వచ్చాను. ఈ టీమ్ అందరికి ఆల్ ది బెస్ట్ చెబుతున్నాను. గౌతమ్ దర్శకుడిగా మొదటి సినిమా అయినా చాలా అద్భుతంగా తెరకెక్కించాడు. ఒక దర్శకత్వం మాత్రమే కాదు అటు హీరోగా కూడా చాలా ఇంటెన్స్ తో నటించాడు. ఇక తెలుగమ్మాయిలు తక్కువవుతున్న ఈ సమయంలో పూజిత హీరోయిన్ గా మంచి గుర్తింపు తెచ్చుకుంటుంది` అని టీమ్‌కి అభినందనలు తెలిపారు. 

`టీజర్ చాలా బాగుంది. దర్శకుడు గౌతమ్ ని అభినందిస్తున్నాను. ఈ సినిమా విషయంలో అందరు కొత్తవాళ్లే నేనే సీనియర్ని అని అనుకునేదాన్ని, కానీ ఈ సినిమా షూటింగ్ లో గౌతమ్ టాలెంట్ చూసాక షాక్ అయ్యాను. మొదటి సినిమాకే ఈ రేంజ్ లో కష్టపడి ఓ అద్భుతాన్ని ఆవిష్కరించారు. ఈ సినిమాలో నేను పార్ట్ అయినందుకు ఆనందంగా ఉంది. జూడా శాండీ చక్కని సంగీతం అందించారు. ఒక పాటే విన్నాం .. అన్ని పాటలు వింటే అదిరిపోతాయి` అని హీరోయిన్ పూజిత పొన్నాడ అన్నారు. 

`ఈ సినిమా చేస్తానని మా అబ్బాయి అన్నప్పుడు ఆ ఎదో చేస్తాడులే అని అందరిలా నేను అనుకున్నాను కానీ ఈ సినిమా షూటింగ్ లో మా అబ్బాయితో పాటు ఈ టీం పడుతున్న కష్టం చూసి నిజమే వీళ్ళు ఓ మంచి సినిమా చేస్తున్నారు అన్న నమ్మకం కలిగింది. నిజంగా ఓ గొప్ప చిత్రాన్ని మీకు అందించే ప్రయత్నం చేస్తున్నాం. ఈ సినిమాలో ఇప్పటికే విడుదలైన ఓ సాంగ్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇంకా నాలుగు సాంగ్స్ ఉన్నాయి .. అందులో రాహుల్ సిప్లిగంజ్ పాడిన సాంగ్ థియటర్స్ లో దద్దరిల్లి పోతుంది. అలాగే రాహుల్ రామకృష్ణ, చిన్మయి లాంటి వాళ్ళు పాడిన పాటలు కూడా అదిరిపోతాయి` అని నిర్మాత మనోజ్ చెప్పారు. 

హీరో గౌతమ్ కృష్ణ మాట్లాడుతూ, ఈ సినిమాకు నేనే దర్శకుడు అవ్వడానికి కారణం, ఒక కథను తెరపైకి ఎక్కించే క్రమంలో దర్శకుడు అన్ని విధాలుగా రెస్పాన్స్ తీసుకోవాలి, పైగా చెప్పే కథలో ఎక్కడ ఇంటెన్షన్ తగ్గకూడదని నేనే దర్శకత్వం వహిస్తున్నా. సినిమా అంటే నాకు ప్యాషన్, అందుకే నేనే దగ్గరుండి చేస్తున్నాను. మనం ఎదో చేస్తామని చెబితే ఎవరు నమ్మరు. కానీ మనం ఏమిటో చేసి చూపిస్తేనే అందరు నమ్ముతారు. అందుకే మనపై మనకు నమ్మకం ఉండాలి. ఈ సినిమా కసితో చేసాం. ఓ హార్ట్ బ్రేక్ అయిన వ్యక్తి గురించి చెప్పే కథ ఇది` అని చెప్పారు.

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9: రీతూ కాదు, తనూజ వెంటపడేవాడిని.. షాకిచ్చిన డీమాన్‌ పవన్‌.. బిగ్‌ బాస్‌ ఎమోషనల్‌ జర్నీ
ఈ హీరోయిన్ నటించిన 4 సినిమాలు డిజాస్టర్లు.. కానీ పేరేమో మరో సావిత్రి