ఇంటింటికి తిరిగి కండోములు పంచిన సునీత కొడుకు.. చిరు, రాఘవేంద్రరావు, శేఖర్‌ కమ్ముల ప్రశంసలు..

Published : Dec 20, 2023, 11:28 PM IST
ఇంటింటికి తిరిగి కండోములు పంచిన సునీత కొడుకు.. చిరు, రాఘవేంద్రరావు, శేఖర్‌ కమ్ముల ప్రశంసలు..

సారాంశం

సింగర్‌ సునీత తన కొడుకు ఆకాష్‌ని హీరోగా పరిచయం చేస్తుంది. ప్రస్తుతం ఆయన `సర్కారు నౌకరి` చిత్రంలో నటిస్తున్నాడు. ఇందులో హీరో కండోములు పంచడం విశేషం. 

సింగర్‌ సునీత కొడుకు ఆకాష్‌.. తొలి సినిమాతోనే పెద్ద సాహసం చేశాడు. తను ఓ పల్లెటూరిని ఎంచుకుని ఇంటికి కండోములు పంచాడు. అంతేకాదు అదే ఉద్యోగం చేశాడు. ఆ తర్వాత అనేక అవమానాలు ఎదుర్కొన్నాడు. చివరికి ఇంట్లో భార్య కూడా అనుమానించి, అసహ్యించుకునే పరిస్థితికి వెళ్లిపోయాడు. మరి ఆ తర్వాత ఏం జరిగింది, ఆకాష్‌ `సర్కారు నౌకరి` ఏమైందనేది మిగిలిన కథ. సింగర్‌ సునీత కొడుకు ఆకాష్‌ హీరోగా పరిచయం అవుతూ `సర్కారు నౌకరి` చిత్రంలో నటిస్తున్నాడు. భావన హీరోయిన్‌గా చేసింది. గంగనమోని శేఖర్‌ దర్శకత్వం వహించాడు. 

ఆర్కే టెలీ షో బ్యానర్‌పై కె రాఘవేంద్రరావు ఈ మూవీని నిర్మించాడు. ఆయన ఎంతో మంది హీరోలను పరిచయం చేశారు. వారంతా సూపర్‌ స్టార్లుగా ఎదిగారు. ఇప్పుడు సునీత కొడుకు కూడా హీరోగా పరిచయం అవుతున్నాడు. తాజాగా ఈ మూవీ ట్రైలర్ విడుదల కార్యక్రమం జరిగింది. దీనికి నిర్మాత కె రాఘవేంద్రరావుతోపాటు ప్రముఖ దర్శకులు అనిల్‌ రావిపూడి, శేఖర్‌ కమ్ముల ఆవిష్కరించారు. ట్రైలర్ బాగుందని అభినందించారు. అంతేకాదు ట్రైలర్‌ చూసి మెగాస్టార్ చిరంజీవి కూడా అభినందనలు తెలిపారు. ట్రైలర్‌ బాగుందని ప్రశంసించారు. తెలంగాణ నేపథ్యంలో స్వచ్ఛమైన పల్లెటూరి కథతో ఈ చిత్రం రూపొందిన్నారు. చాలా ఫ్రెష్‌గా ఉందన్నారు. 

ఈ సందర్భంగా కె రాఘవేంద్రరావు సుధీర్ఘంగా వివరించారు. సినిమా బాగా వచ్చిందన్నారు. దర్శకుడిలోని మల్టీ టాలెంట్స్ చూసి ఈ సినిమా చేసినట్టు చెప్పారు. విజువల్స్‌ అదిరిపోయాయన్నారు. తమ సమయంలో ఏడాదికి మూడు నాలుగుసినిమాలు చేసేవాళ్లమని, ఇప్పుడు ఏడాది రెండేళ్లకి ఒకసినిమాలు చేస్తున్నారని తెలిపారు. అయితే శేఖర్‌, అనిల్‌ వంటి దర్శకుల సినిమాల కోసం ఆడియెన్స్ ఎదురు చూస్తున్నారని, అది గొప్ప విషయమన్నారు. `సర్కారు నౌకరి` సినిమాతో పరిచయం చేస్తున్న ఆకాష్.. పెద్దస్టార్‌గా ఎదగాలన్నాడు. ఈ సినిమాలో అతని పర్ ఫార్మెన్స్ చూసిన తర్వాత మరే హీరో ఈ కథకు న్యాయం చేయలేడు అనిపించింది. అలాగే హీరోయిన్ భావన  చూస్తే మహానటి సావిత్రిలా పేరు తెచ్చుకుంటుంది అనిపించింది. `పంచతంత్ర కథలు` చూశాక శేఖర్ ను పిలిచి చెక్ ఇచ్చాను` అని తెలిపారు రాఘవేంద్రరావు. 

డైరెక్టర్ శేఖర్ కమ్ముల మాట్లాడుతూ , రాఘవేంద్రరావు ఇప్పుడు సినిమాలు చేసి ఉంటే ఆయన ఇప్పుడు ఛార్టెడ్ ఫ్లైట్ లో తిరిగేవారు. మీ సినిమాలు అంత కలెక్ట్ చేసేవి అన్నారు. రాఘవేంద్రరావు ది లక్కీ హ్యాండ్ ఈ సినిమా మంచి హిట్ కావాలి. "సర్కారు నౌకరి" ట్రైలర్ బాగుంది. తెలంగాణ విలేజ్ బ్యాక్ డ్రాప్ లో ఒక కొత్త వరల్డ్ క్రియేట్ చేశారు. కొత్త వాళ్లు నటించేప్పుడు కొంత బెరుకు ఉంటుంది. ఆకాష్ అనుభవం ఉన్న నటుడిలా పర్ ఫార్మ్ చేశాడు. దర్శకుడు శేఖర్ మూవీని ఆకట్టుకునేలా చేశాడు. టీమ్ అందరికీ ఆల్ ది బెస్ట్ చెబుతున్నా` అని అన్నారు.

సింగర్ సునీత మాట్లాడుతూ, నాకు ఒక జీవితానికి సరిపడా సంతృప్తినిచ్చిన సినిమా ఇది. కెరీర్ లో మొదటి సినిమా అంటే ఎవరికైనా ప్రత్యకమే. అలాంటి స్పెషల్ మూవీని మా అబ్బాయికి అందించిన దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు గారికి, దర్శకుడు శేఖర్ గారికి జీవితాంతం రుణపడి ఉంటాం.  "సర్కారు నౌకరి"  సినిమాలో మా అబ్బాయి ఆకాష్ ఫస్ట్ మూవీ అయినా అనుభవం ఉన్నవాడిలా నటించాడనే ప్రశంసలు వింటుంటే చాలా సంతోషంగా ఉంది. కొత్త ఏడాదిలో విడుదలవుతున్న ఫస్ట్ మూవీ మాదే. మీ అందరూ  "సర్కారు నౌకరి" మూవీని ఆదరిస్తారని కోరుకుంటున్నా.  మా సినిమాకు సపోర్ట్ చేసిన మెగాస్టార్ చిరంజీవి గారికి మీడియా సమక్షంలో థ్యాంక్స్ చెబుతున్నా` అని చెప్పింది. ఇందులో టీమ్‌ పాల్గొని తమ ఆనందాన్ని వ్యక్తం చేసింది.  

ఈ సినిమా పల్లెటూరి నేపథ్యంలో సాగుతుంది. ఇందులో హీరో సర్కారు నౌకరి చేస్తుంటాడు.ఆయన గ్రామాల్లో హెల్త్ ఆఫీసర్‌గా వర్క్ చేస్తాడు. సెక్స్ పరమైన రక్షణ కోసం ఆయన ఇంటింటికి కండోములు పంచుతుంటాడు. వాటిని పిల్లలు బుగ్గలుగా ఊదుకుంటూ ఆడుకుంటారు. మరి అవేంటో తెలిశాక ఏం జరిగింది, తన లైఫ్‌ ఎలా మారింది? తన ఉద్దేశ్యం ఏంటనేది ఈ సినిమా కథ. ట్రైలర్ ఆద్యంతం ఆకట్టుకుంది. 
 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories

Karthika Deepam 2 Latest Episode: జ్యో అరెస్ట్- ఉలుకుపలుకు లేకుండా పడిపోయిన సుమిత్ర-నోరు జారిన పారు
Mowgli Movie Review: మోగ్లీ మూవీ రివ్యూ, రేటింగ్‌.. సుమ కనకాల కొడుక్కి ఎట్టకేలకు హిట్‌ పడిందా?