Latha Mangeshkar Fans : లతాజీ మంగేష్కర్ కోసమే బతుకుతున్న ఫ్యాన్స్.. లతాజీ అంటే చెప్పలేనంత అభిమానం

Sreeharsha Gopagani   | Asianet News
Published : Feb 06, 2022, 11:45 AM IST
Latha Mangeshkar Fans : లతాజీ మంగేష్కర్ కోసమే బతుకుతున్న ఫ్యాన్స్.. లతాజీ అంటే చెప్పలేనంత అభిమానం

సారాంశం

ఇండియా నైటింగేల్, ప్రముఖ గాయని లతా మంగేష్కర్ కు ప్రపంచ వ్యాప్తంగా కోట్లల్లో అభిమానులు ఉన్నారు. కానీ లతా మంగేష్కర్ ఫ్యాన్స్ లో వీరు ప్రత్యేకం.. లతాజీ కోసం వీరు తమ జీవితాన్నే త్యాగం చేశారు. మరికొందరు అభిమానాన్ని చాటుకున్నారు.  

‘గాన కోకిల కోసం జీవితాన్నే త్యాగం చేసిన అభిమాని..’
సాధారణంగా ప్రముఖులందరికీ అభిమానులు ఉంటారు. కానీ లైఫ్ అంతా వారికోసమే బ్రతకాలనుకునే వారు కొంతమందే ఉంటారు. ప్రముఖ సింగర్ లతా మంగేష‍్కర్‌ కు అలాంటి ఓ డై హార్డ్‌ ఫ్యాన్ ఉన్నాడు. ఆమె  మీద అభిమానంతో తన ఇంటినే లతా మంగేష్కర్ మ్యూజియంలా మార్చేశాడు. అంతేకాదు జీవితాంతం ఆమె కోసం బ్రహ్మచారిగా ఉండిపోయాడు. ముంబైలోని మీరట్‌ కు చెందిన గౌరవ్‌ శర్మ లతా మంగేష్కర్‌ కు వీరఅభిమాని. ఆమె పాడిన పాటలను, దేశవిదేశాల్లో ఆమె మీద వచ్చిన పుస్తకాలను కలెక్ట్ చేశాడు. అలా ఆమెకు సంబంధించి ప్రతీది సేకరించి మొత్తం తన ఇంటినే లతా మంగేష్కర్‌ మ్యూజియంగా మార్చేసి అసలైన అభిమానిగా నిలిచిపోయాడు.  

ముంబైకి చెందిన ఆటో డ్రవర్ గొప్ప త్యాగం..
తన గొంతుతో 5‌0 ఏండ్లుగా  ప్రపంచ వ్యాప్తంగా అభిమానులను కూడగట్టుకుంది. తన కోకిల లాంటి గానంతో ప్రతి ఒక్కరినీ కట్టిపడేసింది. అలాంటి లతా మంగేష్కర్ కరోనాకు గురై ప్రస్తుతం ముంబైలోని బ్రీచ్ ఆస్ప్రతిలో చికిత్స పొందుతున్న సమయంలో ముంబైకి చెందిన ఆటో డ్రైవర్ సత్యావాన్ జీత్ ఆటో గొప్ప త్యాగం చేశాడు. ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్న ఈయన చిన్నప్పటి  నుంచి లతా మంగేష్కర్ కు వీరాభిమాని. ఆమెను దేవి సరస్వతిగా భావిస్తున్నాడు. అయితే లతా మంగేష్కర్ ఇంకా ఐసీయూలోనే ట్రీట్ మెంట్ పొందుతున్న సమయంలో తన మనస్సు చలించింది. ఆమె పాటలతో నిండిపోయిన ఆ గుండె ‘లతా’ త్వరగా కోలుకోవాలని తాను ఆటో నడపగా వచ్చిన ఆదాయాన్ని విరాళంగా అందించాడు. మళ్లీ లతా మంగేష్కర్ పాటలు వినాలని ఆకాంక్షించాడు. కాగా, సత్యవాన్ తన ఆటోను మొత్తం గ్రీన్ మ్యాట్ తో డేకరేట్ చేసి, లతా మంగేష్కర్ పాడిన పాటలను ప్లే చేస్తూ ఆటోను నడిపిస్తున్నాడు. ఆటో సైడ్ వాల్స్ పై లతా మంగేష్కర్ ఫొటోలు, పొందిన అవార్డులు, ఆమె హిట్ సాంగ్స్ లిరిక్స్ రాసి తన అభిమానాన్ని చాటుకున్నాడు.  

లతాజీకి ఆఫ్గాన్ ఫ్యాన్స్ ప్రత్యేకమైన గిఫ్ట్...
ప్రపంచ మంతటా అభిమానులు సంపాదించుకున్న ది గ్రేట్ లెజెండరీ సింగర్ లతాజీకి ఫ్యాన్స్ నుంచి ఎన్నో రకా సర్ ప్రైజెస్ అందాయి.  అయితే ఆఫ్గాన్ కు చెందిన ‘అమానుల్లా నజీమ్ - హస్నా’ లతాజీకి లైఫ్ అంతా గుర్తుండిపోయే గిఫ్ట్ ను ప్రజెంట్ చేశారు. చాక్లేట్ పై లతా మంగేష్కర్ ఫొటోను ప్రింట్ చేసుకుని ఆఫ్గాన్ నుంచి ప్రత్యేకంగా ఆమె కోసమే తెచ్చారు. 2014లో లతాజీకి అందించారు ఇందుకు గాయని కూడా హ్యాపీగా ఫీలవుతూ వారికి ధన్యవాదాలు తెలిపింది. 

పాకిస్థాన్ నుంచి లతా మంగేష్కర్ కు వీరాభిమానులు
తన గానంతో ప్రపంచాన్ని మైమరిపించే కోకిలా లతా మంగేష్కర్. తన గాత్రానికి పాకిస్థాన్ లో అభిమానులు ఏర్పడ్డారు. ముఖ్యంగా పాకిస్థాన్ కు చెందిన ఆటో డ్రైవర్ అస్లాం బాలీవుడ్ పాటలను మధురంగా పాడే వాడు. అయితే గులామ్ అలీ 90లో పాడిన ‘యాద్ కి ఆయే’ సాంగ్ ను డ్రైవర్ అస్లాం చక్కగా పాడాడు. ఇందుకు మంగేష్కర్ ఆ  వీడియోను తన ఫేస్ బుక్ లో షేర్ చేసింది. దీంతో ఆయన లతాజీని స్ఫూర్తిగా తీసుకొనని  సింగర్ గా రాణించేందుుకు ప్రయత్నించాడు. 1993లో ఓ టీవీ సింగింగ్ కాంపిటీషన్ లో అస్లాం పాల్గొని  ఫైనల్ వరకు వెళ్లారు. ఆతర్వాత పాకిస్థాన్ లోని ఫ్యాన్స్ ఆమె ప్రతి పుట్టిన రోజును  పాకిస్థాన్ లో సెలబ్రేట్ చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన వివరాలను పాకిస్థాన్ కు చెందిన ఓ మీడియా చానెల్ వెల్లడింది.   

PREV
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9: చివరి రోజు ఓటింగ్‌ తలక్రిందులు, పక్కా ప్లాన్‌ ప్రకారమే.. టాప్‌లో ఉన్నదెవరంటే?
Karthika Deepam 2 Today Episode: దీప, కార్తీక్ లపై రెచ్చిపోయిన పారు, జ్యో- శ్రీధర్ పదవి పోయినట్లేనా?