మామ,అల్లుళ్ల ట్వీట్ సంభాషణ!

Published : Oct 20, 2018, 11:12 AM IST
మామ,అల్లుళ్ల ట్వీట్ సంభాషణ!

సారాంశం

సూపర్ స్టార్ మహేష్ బాబు బావ గల్లా జయదేవ్ కుమారుడు అశోక్ సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. 'అదే నువ్వు అదే నేను' టైటిల్ తో ఈ సినిమా తెరకెక్కుతోంది. దర్శకుడు శశి ఈ సినిమా డైరెక్ట్ చేస్తుండగా.. దిల్ రాజు తన బ్యానర్ లో సినిమాను నిర్మిస్తున్నాడు.

నభా నటేష్ హీరోయిన్ గా నటిస్తోన్న ఈ సినిమా షూటింగ్ ఇటీవలే ప్రారంభమైంది. ఈ సందర్భంగా మహేష్ బాబు తన అల్లుడు అశోక్ కి సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు చెప్పారు. 'నీ డెబ్యూ సినిమాకి గుడ్ లక్.. సినీ ప్రపంచంలోకి నీకు స్వాగతం.. 

నీకు విజయాలు, ప్రేమ దక్కాలని కోరుకుంటున్నాను' అంటూ మహేష్ ట్వీట్ చేయగా.. ''థాంక్యూ మామ.. నీ స్ఫూర్తి తోనే ఈ జర్నీ ప్రారంభిస్తున్నాను. ఎల్లప్పుడూ నిన్నే ఉదాహరణగా తీసుకొని ఈ లోకంలో ప్రయాణిస్తా'' అంటూ అశోక్ గల్లా స్పందించాడు. మామ అల్లుళ్ల మధ్య జరిగిన ఈ సరదా సంభాషణ చూసుకొని అభిమానులు మురిసిపోతున్నారు. 

ఇది కూడా చదవండి.. 

బావ కొడుక్కి మహేష్ సపోర్ట్ లేదా..?

PREV
click me!

Recommended Stories

Nagarjuna తో పోటీకి దిగి.. బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన అల్లరి నరేష్, ఇంతకీ ఆమూవీ ఏదో తెలుసా?
Savitri: మహానటి జీవితం నాశనం కావడానికి జెమినీ గణేషన్‌, పొలిటీషియన్‌ మాత్రమే కాదు, ఆ మూడో వ్యక్తి ఇతడేనా?