Lata Mangeshkar: మొదటి ఫిల్మ్ ఫేర్ తీసుకోవడానికి వెనుకాడిన లతా మంగేష్కర్.. సంప్రదాయాన్నిగౌరవించి..

Published : Feb 06, 2022, 12:45 PM IST
Lata Mangeshkar: మొదటి ఫిల్మ్ ఫేర్ తీసుకోవడానికి వెనుకాడిన లతా మంగేష్కర్..  సంప్రదాయాన్నిగౌరవించి..

సారాంశం

గాన కోకిల లతా మంగేష్కర్ ఇక లేదు. భారత సినీ వినీలాకాశంలో వెలుగు వెలిగిన గానమాధురి నింగిని చేరింది. వేల పాటలు పాడిన మంగేష్కర్ భారత సంప్రదాయానికి పెట్టింది పేరుగా ఉండేది. అందుకే ఆమె మొదటి ఫిల్మ్ ఫేర్ ను కూడా తీసుకోవడానికి వెనుకాడిందట.

గాన కోకిల లతా మంగేష్కర్ ఇక లేదు. భారత సినీ వినీలాకాశంలో వెలుగు వెలిగిన గానమాధురి నింగిని చేరింది. వేల పాటలు పాడిన మంగేష్కర్ భారత సంప్రదాయానికి పెట్టింది పేరుగా ఉండేది. అందుకే ఆమె మొదటి ఫిల్మ్ ఫేర్ ను కూడా తీసుకోవడానికి వెనుకాడిందట.

ఉత్తరాది గాన తరంగం లతా మంగేష్కర్. ఎప్పుడూ చక్కటి చీరకట్టు.. పెద్ద బొట్టు పెట్టుకుని దేవతలా మెరిసిపోయేవారు లతాజీ. కల్మషం లేని నవ్వుతో.. చక్కటి రూపు రేఖలతో ఉండే లతా మంగేష్కర్.. సంప్రదాయాలని కూడా అంతే సిన్సియర్ గా ఫాలో అయ్యేవు. ఎక్కడికి వెళ్ళినా చక్కగా పట్టుచీరతో నిండుగా కనిపించేవారు లతాజీ.

లతా మంగేష్కర్ గురించి ఓ ఆసక్తి కరంవిషయం అప్పుడప్పుడు వినించేది. ఆమె కెరీర్ బిగినింగ్ డేస్ లో.. 1954 లో ఆమెకు మొదటి ఫిల్మ్ ఫేర్ వచ్చింది. కాని ఆమె స్టేజ్ మీదకు వెళ్లి అది తీసుకోవడానికి సున్నితంగా వెనుకాడిందట. దానికి గల కారణం ఏంటీ.. ఏదైనా తప్పు ఉంటే సరిదిద్దుకుంటాము అని న్యాయ నిర్ణేతలు అడిగితే.. ఆమె ఇలాచెప్పిందట. వస్త్రాలు లేని ఓ స్త్రీ ప్రతిమను... భారత స్త్రీగా నేను ఎలా అందుకోగలను అని అన్నారట. అప్పుడు ఆ అవార్డ్ కు ఓ జేబు రుమాలు కట్టి ఇవ్వగా ఆమె అందుకున్నారట.

తను ఎన్ని ఉన్నత శిఖరాలు అందుకున్నా.. ఎంత సంపాదన ఉన్నా.. కోట్లు గడించినా.. లతా మంగేష్కర్  విదేశా పోకడలు అలవాటు చేసుకోలేదు. ఎన్నో దేశాల్లో వేలకొద్ది కచేరీలు చేసినా.. లతాజీ అచ్చమైన భారత సాంప్రదాయ చీరకట్టులోనే ఉండేవారు. అమెను చూస్తే చేతులు ఎత్తి నమస్కరించే విధంగా కనిపించేవారు లతా మంగేష్కర్.

ఎన్నో ఏళ్లు నిర్విరామంగా స్వరసాగర మధనం చేసిన లెజండరీ సింగర్ 92 ఏళ్ల వయస్సులో కన్ను మూశారు. కరోనా వల్ల వచ్చిన  అనారోగ్యంతో.. ముంబయ్ లోని బ్రీచ్ కాండీ హస్పిటల్ తో తుది శ్వాస విడిచారు లతాజీ.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Prabhas: ప్రభాస్ ఆ డిజాస్టర్ సినిమా వదులుకుని కెరీర్‌ కాపాడుకున్నాడు.. ఎన్టీఆర్ అడ్డంగా దొరికిపోయాడు
Pawan Kalyan: బాలకృష్ణ నటించిన ఆ మూవీని పవన్ కళ్యాణ్ 100 సార్లు చూశారట.. ఇంతకీ అదేంటంటే.?