pushpa:అబ్బే...ఈ వార్త బోగస్సేట, అసలు నమ్మద్దు

Surya Prakash   | Asianet News
Published : Feb 06, 2022, 11:50 AM IST
pushpa:అబ్బే...ఈ వార్త బోగస్సేట,  అసలు నమ్మద్దు

సారాంశం

కొన్ని వార్తలు చూసి చూడగానే ఆనందాన్ని కలగ చేస్తాయి. అందులో ఎంత నిజమెంత ఉందో తేల్చుకోనివ్వరు. ముఖ్యంగా సినిమా వార్తలు కొన్ని ఫ్యాన్స్ కు పండగ చేసుకునేలా ఉంటాయి. కానీ తర్వాత అది బోగస్సే అని, మీడియా క్రియోషన్ అని తెలిస్తే నోట మాట రాదు. అలాంటి వార్తే ఒకటి రీసెంట్ గా మీడియాలో హల్ చల్ చేసింది. అదీ పుష్ప సినిమా గురించి ...అదేంటో చూద్దాం.


అల్లు అర్జున్- సుకుమార్ కాంబోలో వచ్చిన 'పుష్ప' సినిమా బ్లాక్ బస్టర్ అయ్యిన సంగతి తెలిసిందే. బన్నీ కెరీర్లో తొలి పాన్ ఇండియా సినిమాగా వచ్చిన ఈ మూవీ పలు రికార్డులు చెరిపేస్తూ భారీ వసూళ్లు రాబట్టింది. చిత్రంలో అల్లు అర్జున్ నటన, సుకుమార్ టేకింగ్‌పై ప్రశంసల వర్షం కురిసింది. తెలుగుతో పాటు హిందీలోనూ ప్రభంజనం సృష్టించింది. ఈ సినిమాను రెండు భాగాలుగా తెరకెక్కిస్తున్నట్లు ముందే ప్రకటించిన సుక్కు.. తొలి భాగాన్ని 'పుష్ప ది రైజ్' పేరుతో ప్రేక్షకుల ముందుకు తెచ్చారు.

ప్రస్తుతం రెండో భాగం స్క్రిప్ట్ వర్క్స్ పూర్తిచేస్తున్న సుకుమార్.. ‘పుష్ప ది రూల్’ పేరుతో ఈ చిత్రాన్ని అతిత్వరలో సెట్స్ మీదకు తీసుకురాబోతున్నారు. ఇంతవరకూ అందరకీ తెలిసిందే. అలాగే జనాల్లోనూ సెకండ్ పార్ట్‌పై ఓ రేంజ్ అంచనాలున్నాయి. అయితే ఆ అంచనాలు మించేలా పుష్ప పార్ట్-2 ఉండాలని ప్లాన్ చేస్తున్న సుకుమార్.. ఈ మూవీ విడుదల కోసం లక్కీ డేట్ ఎంచుకున్నారని మీడియాలో హోరెత్తిపోయింది.

ఆ వార్త సారాంశం...ఫిబ్రవరి చివరివారంలో లేదా మార్చి తొలివారంలో ‘పుష్ప ది రూల్’ చిత్ర రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించి చక చకా ఫినిష్ చేస్తారట. పుష్ప పార్ట్- 1 డిసెంబర్ 17న విడుదలై భారీ సక్సెస్ అయిన కారణంగా పుష్ప పార్ట్- 2 విషయంలోనూ అదే సెటిమెంట్ ఫాలో కాబోతున్నారని, ఈ మేరకు పుష్ప రెండో భాగం రిలీజ్ కోసం డిసెంబర్ 17నే ముహూర్తంగా ఎంచుకున్నారని. అయితే అందుతున్న సమాచారం మేరకు ఈ వార్తలో ఏ మాత్రం నిజం లేదని. అసలు పుష్ప టీమ్ ఏ రిలీజ్ డేట్ ని ఆలోచించి ఫిక్స్ చేసుకోలేదని...షూటింగ్ పూర్తయ్యాక...అప్పుడు చూద్దాంలే అని మిగతా పనులు పూర్తి చేస్తున్నారట. 

అందుకు కారణం అవతార్ 2 సినిమా డిసెంబర్ 16న రిలీజ్ అవుతోంది. ప్రపంచవ్యాప్తంగా భారీ హైప్ తో భారీ ఎత్తున రిలీజ్ అవుతున్న ఈ సినిమాకు పోటీగా వెళ్దామని ఏ నిర్మాతా, దర్శకుడు ప్లాన్ చేయడు. థియోటర్స్ సమస్య వస్తుందని అందరికీ తెలుసు.
 

PREV
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9: చివరి రోజు ఓటింగ్‌ తలక్రిందులు, పక్కా ప్లాన్‌ ప్రకారమే.. టాప్‌లో ఉన్నదెవరంటే?
Karthika Deepam 2 Today Episode: దీప, కార్తీక్ లపై రెచ్చిపోయిన పారు, జ్యో- శ్రీధర్ పదవి పోయినట్లేనా?