
ఉత్తరాది గాన కోకిల లతా మంగేష్కర్ కన్ను మూశారు. వేల పాటలు పాడిన మంగేష్కర్ వల్ల ఓ అవకాశం కోల్పోయానన్నారు.. తెలుగు నాట మొదటి తరం గాయని రావు బాలసరస్వతి.
గాన తరంగం లతా మంగేష్కర్ కన్ను మూశారు. 92ఏళ్ళ వయస్సులో అనారోగ్యంతో.. ముంబయ్ లోని బ్రీచ్ కాండీ హస్పిటల్ తో తుది శ్వాస విడిచారు లతాజీ. ఆమె కెరీర్ లో ఎన్నో ఒడిదుడుకులు.. మరెన్నో విషయాలు.. చాలా మందికి తెలియని..మరుగును పడిన రహస్యాలెన్నో. అయితే లతా జీ తన కెరీర్ ను ప్రభావితం చేశారు అని తెగులు తొలితరం గాయని రావు బాలసరస్వతి పలు సందర్భాలలో అంటుండేవారు.
నౌషాద్ సినిమాల్లో పాడాలని రావు బాలసరస్వతీ దేవికి ఉండేది. అలాంటి సందర్భం కోసం ఆమె వేచి చూసింది. అయితే 1953లో ఉడన్ ఖఠోలా సిననిమాకు హిందీ, తమిళం రెండు భాషల్లో నౌషాద్ సంగీతం సమకూర్చారు. ఈమూవీ తమిళ వెర్షన్ వాణ రదంకు పాటలు పాడడానికి బాలసరస్వతిని ముంబైకి పిలిపించారు. ఆమె రెండు పాటలు కూడా పాడింది. రావు బాలసరస్వతి గాత్రానికి ఆయన ఫిదా అయ్యారు. ఆమె నౌషాద్ మెప్పు పొందేంతగా మధురంగా పాడింది.
అయితే ఇక్కడే చిన్న విషయంజరిగింది. ఈ సినిమాలో హిందీ, తమిళం రెండు వెర్షన్లకు పాటలు తానే పాడుతానని లతా మంగేష్కర్ అన్నారు. ఆ తర్వాత మిగతా పాటలు పాడకుండా సరస్వతీదేవిని మద్రాసు పంపించి వేశారు. ఈ విషయాన్ని బాల సరస్వతీ దేవి పలు సందర్భాల్లో చెప్పి బాధపడ్డారు. తాను ఆ పాటలు పాడి ఉంటే.. ఉత్తరాదిలో కూడా తనకు అవకాశాలు వచ్చేవని.. ఇటు సౌత్ లో కూడా తన ప్రభావం పెరిగేదని అప్పుడప్పుడు చెప్పుకునేవారు రావు బాలసరస్వతి.