
గత కొన్ని వారాలుగా, దేశవ్యాప్తంగా COVID-19 కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. Omicron వేరియంట్ మరింత ఆందోళన కలిగిస్తుంది. చిత్ర పరిశ్రమలో కూడా కరోనా కేసులు చాలా వస్తున్నాయి. చాలా మంది సెలబ్రిటీలకు వైరస్ సోకింది. ఇక ప్రముఖ లెజెండరీ గాయని లతా మంగేష్కర్ గారికి కోవిడ్ పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ప్రస్తుతం లతా మంగేష్కర్ గారిని ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ICUలో చేర్చి చికిత్స చేస్తున్నారు డాక్టర్లు. ఇప్పుడు ఆమె పరిస్దితి ఎలా ఉంది...
లతా మంగేష్కర్ (92)కు కరోనా సోకడంతో ఆమెను ఇటీవల కటుంబ సభ్యులు ముంబైలోని బ్రీచ్ కాండీ ఆసుపత్రిలో చేర్చిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆమె ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. ఆమె ఆరోగ్య పరిస్థితిపై వైద్యులు వివరాలు తెలిపారు. ఆమె ఐసీయూలోనే ఉన్నారని, 10-12 రోజుల పాటు వైద్యుల పరిశీలనలోనే ఉంటారని చెప్పారు. ఆమె కరోనాతో పాటు న్యూమోనియాతో బాధపడుతున్నారని వైద్యుడు ప్రతీత్ సంధాని తెలిపారు. కాగా, మూడు రోజుల క్రితం ఆమెకు కరోనా నిర్ధారణ అయింది. లతా మంగేష్కర్ 2019లోనూ శ్వాస సంబంధిత సమస్యలతో బాధపడుతూ ఆసుపత్రిలో చేరి, చికిత్స తీసుకుని కోలుకున్నారు.
లతా మంగేష్కర్ మేనకోడలు రచనా మంగేష్కర్, ఈ విషయాన్ని మీడియాకి వెల్లడించారు. “లతా మంగేష్కర్ గారు బాగానే ఉన్నారు, ఆమె వయస్సును పరిగణనలోకి తీసుకుని ముందు జాగ్రత్త కారణాల కోసం మాత్రమే ICUలో ఉంచారు. దయచేసి మా గోప్యతను గౌరవించండి, ”అని రచన చెప్పారు.
ఇదిలా ఉంటే మన దేశం COVID-19 కేసులలో ఊహించని పెరుగుదలను ఎదుర్కొంటోంది .కేసుల సంఖ్య భయంకరంగా పెరగడంతో, అనేక రాష్ట్ర ప్రభుత్వాలు కఠినమైన ఆంక్షలు విధించాయి మరియు పాక్షిక లాక్‌డౌన్‌ను విధించాయి.